గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, జనవరి 2018, బుధవారం

జీవావసాన,తాజీరస,గర్భరంగస్థలీవృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

 జైశ్రీరామ్.
జీవావసాన,తాజీరస,గర్భరంగస్థలీవృత్తము.
 రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
   జుత్తాడ.

                 రంగస్థలీవృత్తము.
                  +++++++++++
ఉత్కృతిఛందము.భ.త.న.త.జ.త.జ.ర.స.మ.గల.గణములు.
యతులు10,19.అక్షరములు.ప్రాసనీమముగలదు.
జీవన రంగస్థలమున!జీరెం తుది ఘట్టమంచు!చింతిలనేలా?బేలా!మదిన్!
పావకమౌ పాత్రకుదుర!పారెన్సమయంబటంచు!పంతుకుపోనేలా?నరా!
భావము,భష్యంబులలర!పారంబగునట్టిచర్య!భ్రాంతులదేలన్తప్పౌగదే?
శ్రీవరమేర్చున్గనుమయ!చేరున్పరమార్ధమౌచు!చెంతన్నిల్చుం!దైవంబిలన్!

1.గర్భగత"-నుతభంగ"-వృత్తము.
బృహతీఛందము.భ.త.న.గణములు.వృ.సం.487.ప్రాసగలదు.
జీవన రంగస్థలమున!
పావకమౌ!పాత్ర కుదుర!
భావము!భాష్యంబులలర!
శ్రీపరమేర్చున్గనుమయ!

2.గర్భగత"-తరంగ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.త.జ.గల.గణములు.వృ.సం.173.ప్రాసగలదు.
జీరెన్తుది ఘట్టమంచు!
పారెన్సమయంబటంచు!
పారంబగునట్టి !చర్య!
చేరున్పరమార్ధమౌచు!

3.గర్భగత"-దోషాచరా"-వృత్తము.
బృహతీఛందము.భ.మ.ర.గణములు.వృ.సం.135.ప్రాసగలదు.
చింతిలనేలా?బేలా!మదిన్!
పంతుకు!పోనేలా?నరా!.
భ్రాంతులదేలందప్పౌ?గదే!
చెంతనునిల్చుం!దైవంబిలన్!

4.గర్భగత"-నతకీర్తి"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.త.న.త.జ.గల.గణములు.యతి.10యవఅక్షరము.
ప్రాసనీమముగలదు.
జీవన రంగస్థలంబున!జీరున్తుది ఘట్టమంచు!
పావకమౌ పాత్రకుదుర!పారెన్సమయంబటంచు!
భావము!భాష్యంబులలర!పాంబగునట్టి చర్య!
శ్శ్రీవరమేర్చున్గనుమయ!చేరున్పరమార్ధమౌచు!

5.గర్భగత"-బేలా"-వృత్తము.
అత్యష్టీఛందము.త.జ.ర.స.మ.లగ.గణములు.యతి09.వయయక్షరము.
ప్రాసనీమముగలదు.
జీరెన్తుది ఘట్టమంచు!చింతిల నేలా?మదిన్!
పారెన్సమయంబటంచు!పంతుకు పోనేలానరా!
పారంబగునట్టి!చర్య! భ్రాంతుల! దేలంతప్పౌ!గదే!
చేరున్పరమార్ధమౌచు! చెంతను!నిల్చుం!దైవంబిలన్!


6.గర్భగత"-భ్రమరక"-వృత్తము.
ధృతిఛందము.భ.మ.ర.భ.త.న.గణములు.యతి10వయక్షరము.
ప్రాసనీమముగలదు.
చింతిలనేలా?బేలా!మదిన్!జీవనరంగస్థలమున!
పంతుకు పోనేలా?నరా!పావకమౌ!పాత్రకుదుర!
భ్రాంతుల దేలన్తప్పౌగదే!భావము!భాష్యంబులలర!
చెంతను నిల్చున్!దైవంబిలన్! శ్రీవరమేర్చన్గనుమయ!

7.గర్భగత"-రతనతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.మ.ర.భ.త.న.త.జ.గల.గణములు.
యతులు.10,19,అక్షరములు.ప్రాసనీమముగలదు.
చింతిలనేలా?బేలా!మదిన్!జీవన రంగస్థలమున!జీరెన్తుది ఘట్టమంచు!
పంతుకుపోనేలా?నరా!పావకమౌ!పాత్రకుదుర!పారెన్సమయంబటంచు!భ్రాంతులదేలంతప్పౌ!!భావము,భాష్యంబులలర! పారంబగునట్టిచర్య!
చెంతను!నిల్చున్దైవంబిలన్!శ్రీవరమేర్చన్గనుమయ! చేరున్పరమార్ధ!మౌచు!

8.గర్భగత"-యశజలా"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.జ.ర.స.మ.య.స.జ.లలంగణములు.
యతులు.09.18.అక్షరములు.ప్రాసనీమముగలదు
జేరరెన్తుదిఘట్టమంచు!చింతిలనేలా?బేలా!మదిం!జీవన!రంగస్థలమున!పారెన్సమయంబటంచు!పంతుకు!పోనేలా?నరా!పావకమౌపాత్రకుదుర!
పారంబగునట్టిచర్య!భ్రాంతులదేలందప్పౌగదే!భావము,భాష్యంబులలర!
చేరున్పరమార్ధమౌచు!చెంతను!నిల్చున్దైవంబిలన్!శ్రీవరమేర్చంగనుమయ!

9.గర్భగత"-జీవావసాన"-వృత్తము.
అత్యష్టీఛందము.త.జ.ర.స.భ.లల.గణములు.యతి09.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
జీరెంతుదిఘట్టమంచు!జీవన రంగస్థలమున!
పారెం!సమయంబటంచు!పావకమౌ!పాత్రకుదుర!
పారంబగునట్టిచర్య!భావము!భాష్యంబులలర!
చేరంపరమార్ధమౌచు!శ్రీవరమేర్చంగనుమయ!

10.గర్భగత"-తాజీరస"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.జ.ర.స.భ.స.స.మ.లగ.గణములు.
యతులు.09.18.అక్షరములు.ప్రాసనీమముగలదు.
జీరెంతుదిఘట్టమంచు!జీవనరంగస్థలమున!చింతిలనేలా?బేలామదిన్!
పారెంసమయంబటంచు!పావకమౌ!పాత్రకుదుర!పంతుకు!పోనేలా?నరా!
పారంబగునట్టిచర్య!భావము భాష్యంబులలర!రాంతుల!దేలం!దప్పౌ!
చేరంపరమార్ధమౌచు !శ్రీపరమేర్చం!గనుమయ!చెంతను!నిల్చన్దైవంబిలన్!
స్వస్తి..


మూర్తి. జుత్తాడ.
జైహింద్.
Print this post

3 comments:

sam చెప్పారు...

dear sir very good blog and very good content

Latest Telugu News

sam చెప్పారు...

dear sir very good blog and very good content


Latest Telugu News

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పండితోత్తములకు ప్రణామములు
నా ఈ చిన్నకలం సరిపోదు . ఎన్నొ తెలియని ఛందస్సులు ఎన్నెన్నో తెలియని వృత్తములు చాలా బాగుంది . ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.