గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జనవరి 2018, ఆదివారం

వగపమరు, నయమే! గర్భ మోక్షాసాధ్య వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

 జైశ్రీరామ్.
వగపమరు, నయమే! గర్భ మోక్షాసాధ్య వృత్తము.
 రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                                                                      జుత్తాడ.

మోక్షాసాధ్యవృత్తము.
ఉత్కృతిఛందము.స.న.య.స.త.న.మ.న.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
పగబూని తరముమాపన్!వగపే!వంశాన మిగులు!పాపంబోపును కనవే!
తగనట్టి కృతము కాదే!తగునంటే!దీప్తులు చెడు!తాపంబే!భవితమరున్!
స్వగతాన చెడు వినోదం!జగమీడ్చున్దీన దిశకు!శాపంబై!గతి చెడదే!
భగవంతుడరయు నయ్యా!పగదోషం!పట్టికుడుపు!పాపంబెంచకు సుగుణా!

1.గర్భగత"-సన్నయ"వృత్తము.
బృహతీఛందము.స.న.య గణములు.ప్రాసగలదు.వృ.సం.124.
పగబూని!తరముమాపన్
తగనట్టి!కృతముకాదే!
స్వగతాన!చెడు వినోదం!
భగవంతుడరయు నయ్యా!

2.గర్భగత"-సృజనా"-వృత్తము.
బృహతీఛందము.స.త.న.గణములు.ప్రాసగలదు.వృ.సం.484.
వగపే!వంశాన!మిగులు!
తగునంటే!దీప్ప్తులు చెడు!
జగమీడ్చున్దీనదిశకు!
పగ!దోషం!పట్టికుడుపు!

3.గర్భగత"-వరదా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.మ.న.లగ.గణములు.ప్రాసగలదు.వృ.సం.121.
పాపంబోపును!కనవే!
పాపంబే!భవితలరున్!
శాపంబై!గతి!చెడదే!
పాపంబెంచకు!సుగుణా!

4.గర్భగత"-పగగొను"-వృత్తము.
ధృతిఛందము.స.న.య.స .త.న.గణములు.యతి.10వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పగబూని తరము మాపన్!వగపే!వంశాన మిగులు!
తగనట్టి!కృతము!కాదే!తగునంటే!దీప్తులు!చెడు!
స్వగతాన చెడువినోదం!జగమీడ్చున్దీన దిశకు!
భగవంతుడరయునయ్యా!పగదోషం!పట్టికుడుపు!

5.గర్భగతపాపాశ్శ్రిత"-వృత్తము.
అత్యష్టీఛందము.స.త.న.మ.న.లగ.గణములు.యతి.10వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
వగపే!వంశాన మిగులు!పాపంబోపును!కనవే!
తగునంటే!దీప్తులు చెడు!తాపంబే!భవితలరున్!
జగమీడ్చున్దీన దశకు!శాపంబై!గతిచెడదే!
పగ దోషం!పట్టికుడుపు!పాపంబెంచకు!సుగుణా!

6.గర్భగత'-హానికర"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.న.జ.జ.న.గగ.గణములు.యతి.09.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.

పాపంబోపును!కనవే!పగబూని!తరముమాపన్!
తాపంబే !భవితలరున్!తగనట్టి!కృతము! కాదే!
శాపంబై!గతిచెడదే!స్వగతాన!చెడువినోదం!
పాపంబెంచకు!సుగుణా!భగవంతుడరయు నయ్యా!

7.గర్భగత"-దోషకర"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.న.జ.జ.న.త.య.భ.లల.గణములు.యతులు.09.18.ప్రాసనీమముగలదు.
పాపంబోపును!కనవే!పగబూని!తరముమాపన్!వగపే!వంశాన!మిగులు!
తాపంబే!భవితలరున్!తగనట్టి!కృతముకాదే!తగునంటే!దీప్తులు చెడు!
శాపంబై!గతి చెడదే!స్వగతాన!చెడువినోదం!జగమీడ్చున్దీన దశకు!
పాపంబెంచకు!సుగుణా!భగవంతుడరయునయ్యా!పగ దోషం!పట్టికుడుపు!

8.గర్భగత"-తెగమాపు"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.త.న.మ.న.జ.జ.న.గగ.గణములు.యతులు.10.18.
ప్రాసనీమముగలదు.
వగపే!వంశాన మిగులు!పాపంబోపును!కనవే!పగబూని!తరముమాపన్!
తగునంటే!దీప్తులు చెడు!తాపంబే!భవితలరున్!తగనట్టి!కృతము!కాదే!
జగమీడ్చున్దీన దశకు!శాపంబై!గతి చెడదే!స్వగతాన!చెడువినోదం!
పగ దోషం!పట్టికుడుపు!పాపంబెంచకు!సుగుణా!భగవంతుడరయునయ్యా!

9.గర్భగత"-వగపమరు"-వృత్తము.
ధృతిఛందము.స.త.న.స.న.య.గణములు.యతి10.వ.అక్షరము.
ప్రాసనియమముగలదు.
వగపే!వంశాన!మిగులు!పగబూని!తరము మాపన్!
తగునంటే!దీప్తులు చెడు!తగనట్టికృతము!కాదే!
జగమీడ్చున్దీన దశకు!స్వగతాన చెడువినోదం!
"పగ"దోషం!పట్టికుడుపు!భగవంతుడరయు నయ్యా!

10.గర్భగత"-నయమే!"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.త.న.స.న.య.మ.న.లగ.గణములు.యతులు.
10.19.ప్రాసనీమముగలదు.
వగపే!వంశాన!మిగులు!పగబూని!తరము మాపన్!పాపంబోపును!కనవే!
తగునంటే!దీప్తులు చెడు!తగనట్టి!కృతము!కాదే!తాపంబే!భవితలరున్!
జగమీడ్చున్దీన దశకు!స్వగతాన!చెడువినోదం!శాపంబై!గతి!చెడదే!
పగ దోషం!పట్టికుడుపు!భగవంతుడరయునయ్యా!పాపంబెంచకు!సుగుణా!
స్వస్తి.
వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
వివిధ వృత్తములను అవలీలగా వ్రాసి మాకం దిస్తున్నందులకు కృతజ్ఞతలు . శ్రీ చింతావారి పుణ్య మున తెలుసుకో గల అదృష్టం లభించి నందులకు ఆనందముగా నున్నది . పండితోత్తములకు ధన్యవాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.