గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జనవరి 2018, సోమవారం

దాతృత్వ,దోషినీ,గర్భ పురుషార్ధవృత్తము. రచన:- వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

 జైశ్రీరామ్.
దాతృత్వ,దోషినీ,గర్భ పురుషార్ధవృత్తము.
 రచన:- వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                                                                      జుత్తాడ.

              పురుషార్ధవృత్తము.
ఉత్కృతిఛందము.త.ర.భ.స.య.జ.భ.స.గగ.గణములు.
యతులు.10,19.అక్షరములు.ప్రాసనీమముగలదు.
ధర్మార్ధ కామమోక్షంబులు తగనొప్ప !దాతృత్వ బుద్ధి! తా నిల నడువన్మేలౌ!
మర్మంపుచర్య!చేరంజెడు!మగరాయుడీవంచు బల్క!మానవ!పరమంబోపన్!
చర్మంపు ముక్తిగల్గంజను! జగదైక కీర్తిన్గడించు!జ్ఞానిగ చరితం నిల్వన్!
పర్మాత్ముదృష్టి శ్రేయంబగు! పగబూని!దోషాలనెట్టు! ప్రాణము!చరితంబేరా!
చర్మంబు=అశువులుబాసినతదుపరి.చరితం=చరిత్రయందు
ప్రాణముచరితంబేరా=జీవనమశాశ్వతంబు.

1.గర్భగత"-ఆశామోహ"-వృత్తము.
బృహతీఛందము.త.ర.భ.గణములు.ప్రాస గలదు.వృ.సం.402.
ధర్మార్ధ కామమోక్షంబులు
మర్మంపు చర్య!జేరన్జెడు.!
చర్మంపుముక్తి!గల్గం జను!
పర్మాత్ము దృష్టి! శ్రేయంబగు

2. గర్భగత"-వశిత"-వృత్తము.
బృహతీఛందము.స.య.జ.గణములు.ప్రాస గలదు.వృ.సం.332.
తగనొప్ప!దాతృత్వ బుద్ధి!
మగరాయుడీవంచు బల్క!
జగదైక !కీర్తిన్గడించు
పగబూని! దోషాల నెట్టు!
3.గర్భగత"-శ్రీనామ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.స.గగ.గణములు.ప్రాసగలదు.వృ.సం. 31.
తానిల నడువన్మేలౌ!
మానవ! పరమంబోపన్?
జ్ఞానిగ!చరితం!నిల్వన్!
ప్రాణము!చరితంబేరా!

4.గర్భగత'-తగుతగ"-వృత్తము.
ధృతిఛందము.త.ర.భ.స.య.జ.గణములు.ప్రాసగలదు
.10.వ.అక్షరముయతి.
ధర్మార్ధ కామమోక్షంబులు!తగనొప్ప!దాతృత్వ!బుద్ధి!
మర్మంపు!చర్య చేరంజెడు!మగరాయుడీవంచు బల్క!
చర్మంబు!ముక్తి కల్గన్జను!జగదైక!కీర్తింగడించు!
పర్మాత్ము దృష్టి శ్రేయంబగు!పగబూని!దోషాల!నెట్టు!

5.గర్భగత"-మాయజీవన"-వృత్తము.
అత్యష్టీఛందము.స.య.జ.భ.స.గగ.గణములు.ప్రాసగలదు.
10.వ.అక్షరముయతి.
తగనొప్ప!దాతృత్వబుద్ధి తానిల నడువన్మేలౌ!
మగరాయుడీవంచు!బల్క!మానవ!పరమంబోపన్!
జగదైక!కీర్తిన్గడించు! జ్ఞానిగ! చరితన్నిల్వన్
పగబూని!దోషాల!నెట్టు!ప్రాణము చరితంబేరా!

6.గర్భగత"-పరమోపు"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.స.మ.ర.య.లల.గణములు. ప్రాసగలదు.
9.వ.అక్షరముయతి.
తానిల నడువన్మేలౌ!ధర్మార్ధ కామమోక్షంబులు!
మానవ! పరమంబోపం!మర్మంపుచర్య!చేరంజెడు!
జ్ఞానిగ!చరితన్నిలువన్! చర్మంబుముక్తి!కల్గం జను!
ప్రాణము!చరితంబేరా! పర్మాత్ము!దృష్టి శ్రేయంబగు!

7.గర్భగత"-మేలగు."-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.మ.ర.య.న.జ.త.గల.గణములు.
ప్రాసగలదు. యతులు,9.18.అక్షరములు.
 తానిల!నడువన్మేలౌ!ధరర్మార్ధకామ మోక్షంబులు!తగనొప్ప !దాతృత్వబుద్ధి!
మానవ!పరమంబోపం!మర్మంపుచర్య!చేరంజెడు!మగరాయుడీవంచు!బల్క!
జ్ఞానిగ!చరితన్నిలువం!చర్మంబుముక్తి!కల్గన్జను!జగదైక!కీర్తిన్గడించు!
ప్రాణము!చరితంబేరా!పర్మాత్ముదృష్టి!శ్రేయంబగు!పగబూని!దోషాల!నెట్టు!

8.గర్భగత"-తానిలా"-వృత్తము.
ధృతిఛందమ.స.య.జ.త.ర.భ.గణములు.ప్రాసగలదు.
10.వ.అక్షరముయతి.
తగనొప్ప!దాతృత్వబుద్ధి!ధర్మార్ధకామమోక్షంబులు!
మగరాయుడీవంచు!బల్క!మర్మంపుచర్యజేరం!చెడు!
జగదైక!కీర్తిన్గడించు!చర్మంముక్తి!గల్గంజను!
పగబూని!దోషాల నెట్టు!పర్మాత్ముదృష్ట!శ్రేయంబగు!

9.గర్భగత"-దాతృత్వ"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.య.జ.త.ర.భ.భ.సగగ.గణములు.
ప్రాసగలదు.యతులు.10.19.అక్షరములు.
తగనొప్ప!దాతృత్వబుద్ధి!ధర్మార్ధ కామమోక్షంబులు!తానిల!నడువన్మేలౌ!మగరాయుడీవంచు!బల్క!మర్మంపుచర్య!జేరన్జెడు!మానవ!పరమంబౌనే
జగదైక!కీర్తిన్గడించు!చర్మం ముక్తిగల్గన్జను!జ్ఞానిగ! చరితన్నిల్వన్!  
పగబూని!దోషాల నెట్టు!పర్మాత్ముదృష్టి!శ్రేయంబగు! ప్రాణము!చరితంబేరా!

10.గర్భగత"దోషషినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.ర.భ.భ.స.త.జ.త.గల.గణములు.
ప్రాసగలదు.యతులు.10.18.అక్షరములు.
ధర్మార్ధకామమోక్షంబులు .తానిలనడువన్మేలౌ!తగనొప్పదాతృత్వ!బుద్ధి!
మర్మంపుచర్య!జేరంజెడు!మానవ!పరమంబోపన్!మగరాయుడీవంచు!బల్క
చర్మం!ముక్తి!గల్గంజను!జ్ఞానిగ!జరితన్నిల్వన్!జగదైక!కీర్తిన్గడించు!
పర్మాత్ముదృష్టి!శ్రేయంబగు!ప్రాణము!చరితంబేరా!పగబూని!దోషాల!నెట్టు!
ఇట్లు
వల్లభవఝల.

బ్రహ్మశ్రీ వల్లభవఝల కవి వరులకభినందన పూర్వజ వందనములు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రణామములు
గురువులకు అభినందన మందారములు. అద్భుత మైన సాహిత్యమును అందిస్తున్న శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.