గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, జనవరి 2018, ఆదివారం

మోహక,తన్వినీ,గర్భ-సిరులొనరువృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి . జుత్తాడ.

 జైశ్రీరామ్.
మోహక,తన్వినీ,గర్భ-సిరులొనరువృత్తము.
  రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి .
  జుత్తాడ.
                 సిరులొనరువృత్తము.
                 ==============.
ఉత్కృతిఛందము.న.న.జ.స.న.న.న.న.గల.గణములు.
యతులు10,19.అక్షరములు.ప్రాసనీమముగలదు.
జడముడిని నెలమొల్క! జగదాంబ!యరలొడలు!జలముల జలకాలు!
జడుపొనరు కడుబీద!  జగమేలు!హరుడతడు! చలనము మరుభూమి!
చెడుతరుము శివమూర్తి!సెగఱేడు!నుదురొదవు!జిలుగుల వెలిమేను!
తొడవుమెడ చదిరంబు!తొగసూడు!నెల కనులు!తొలకక సిరులిచ్చు!

నెలమొల్క=చంద్రవంక,యరలొడలు=అర్ధనారీశ్వరి,జడుపొనరు=
మిక్కిలిబాధాకరమైన,మరుభూమి=స్మశానము,చెడుతరుము=చెడును
తొలగించు,సెగఱేడు నుదురొదవు=అగ్నిఫాలముననొప్పు,జిలుగుల
వెలి మేను=ప్రకాశించెడితెల్లనిశరీరము.తొడవుమెడ=కంఠాభరణము
,చదిరంబు=సర్పము,తొగసూడు=సూర్యుడు,నెల=చంద్రుడు,
శివమూర్తి=శాంత స్వభావుడు.

1.గర్భగత"-త్రినేత్ర"-వృత్తము.
బృహతీఛందము.న.న.జ.గణములు.వృ.సం.384.ప్రాసగలదు.
జడముడిని నెలమొల్క!
జడుపొనరు కడుబీద!
చెడు తరుము శివమూర్తి!
తొడవు మెడ చదిరంబు!

2.గర్భగత"-సననా"-వృత్తము.
బృహతీఛందము.స.న.న.గణములు.వృ.సం.508.ప్రాసగలదు.
జగదాంబ! యరలొడలు!
జగమేలు హరుడతడు!
సెగఱేడు నుదురమరు!
తొగసూడు నెల ,కనులు!

3.గర్భగత"-మృదుపద"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.న.గల.గణములు.వృ.సం.192.ప్రాసగలదు.
జలముల జలకాలు!
చలనము మరుభూమి!
జిలుగుల వెలి మేను!
తొలకక  సిరు లిచ్చు!

4.గర్భగత"- మాతాశ్రీ"-వృత్తము.
ధృతిఛందము. న.న.జ.స.న.న.గణములు.యతి10వయక్షరము.
ప్రాసనీమముగలదు.
జడముడి నెలమొల్క!జగదాంబ!యరలొడలు!
జడుపొనరు కడు బీద! జగమేలు హరుడతడు!
చెడుతరుము శివ మూర్తి! సెగఱేడు!నుదురొదవు!
తొడవుమెడ చదిరంబు! తొగసూడు!'నెల' కనులు!

5.గర్భగత"-యరలొడలు"-వృత్తము.
అత్యష్టీఛందము.స.న.న.న.న.గల.గణములు.యతి10వయక్షరము.
ప్రాసనీమముగలదు.
జగదాంబ!యరలొడలు! జలముల జలకాలు!
జగమేలు!హరుడతడు! చలనము మరుభూమి!
సెగఱేడు!నుదురొదవు! జిలుగుల వెలిమేను!
తొగసూడు!'నెల"కనులు! తొలకక సిరులిచ్చు!

6.గర్భగత"-జలకాల"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.భ.న.న.గల.గణములు.యతి9వయక్షరము.
ప్రాసనీమముగలదు.
జలముల జలకాలు!జడముడి నెలమొల్క!
చలనము మరుభూమి!జడుపొనరు కడుబీద!
జిలుగుల వెలిమేను! చెడు తరుము శివమూర్తి!
తొలకక సిరులిచ్చు! తొడవుమెడ చదిరంబు!

7.గర్భగత"-సారధీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.భ.న.న.భ.జ.న.లల.గణములు.
యతులు.9.18.అక్షరములు.ప్రాసనీమముగలదు.
జలముల జలకాలు! జడముడి  నెలమొల్క!జగదాంబ!యరలొడలు!చలనము మరుభూమి!జడుపొనరు కడుబీద!జగమేలు హరుడతడు!
జిలుగుల వెలిమేను!చెడుతరుము శివమూర్తి!సెగఱేడు నుదురొదవు!
తొలకక సిరులిచ్చు!తొడవుమెడ చదిరంబు!తొగసూడు"నెల"కనులు!

8.గర్భగత"-మోహిత"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.న.న.న.న.భ.న.న.గల.గణములు.
యతులు.10,18.అక్షరములు.ప్రాసనీమముగలదు.
జగదాంబ!యరలొడలు!జలముల జలకాలు!జడముడి నెల మొల్క!
జగమేలు హరుడతడు!చలనము మరుభూమి!జడుపొనరు కడుబీద!
సెగఱేడు నుదురొదవు!జిలుగుల వెలిమేను!చెడు తరుము శివమూర్తి!
తొగసూడు "నెల"కనులు!తొలకక సిరులిచ్చు!తొడవుమెడ చదిరంబు!

9.గర్భగత"-మోహక"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.న.న.న.న.జ.న.న.గల.గణములు.
యతులు.10,19.అక్షరములు.ప్రాసనీమముగలదు.
జగదాంబ!యరలొడలు!జడముడి నెల మొల్క!జలముల జలకాలు!
జగమేలు హరుడతడు!జడుపొనరు కడు బీద!చలనము మరుభూమి!
సెగఱేడు నుదురొదవు!చెడుతరుము శివమూర్తి!జిలుగుల వెలిమేను!
తొగసూడు"నెల"కనులు!తొడవుమెడ చదిరంబు!తొలకక సిరులిచ్చు!

10.గర్భగత"-తన్వినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.భ.జ.న లల.గణములు.యతి9వయక్షరము.
ప్రాసనీమముగలదు.
జలముల జలకాలు!జగదాంబ!యరలొడలు!
చలనము మరుభూమి!జగమేలు హరుడతడు!
జిలుగుల వెలి మేను!సెగఱేడు నుదురొదవు!
తొలకక సిరులిచ్చు!తొగసూడు"నెల"కనులు!

స్వస్తి.
వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

2 comments:

Unknown చెప్పారు...

గురుదేవులకు వినమ్రవందనములు
మధుర మైన ద్రాక్ష రసం మరియు గర్భ గతమైన పద్యాలు శ్రీమాన్ వల్లభవఝల వారికే సొంతం.. వారికి పాదాభివందనములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
గురుదేవుల ప్రతిభకు ప్రణామములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.