గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, జనవరి 2018, శనివారం

ఉల్లాసినీ,గీతాంజలీగర్భపరుషేతరవర్ణయుత"శశికళాద్వయ"వృత్తమ రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

 జైశ్రీరామ్.
ఉల్లాసినీ,గీతాంజలీగర్భపరుషేతరవర్ణయుత"శశికళాద్వయ"వృత్తమ
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
 జుత్తాడ.

             పరుషేతరవర్ణయుత   "శశికళాాద్వయ "వృత్తము.
            ****************************************
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.ర.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
వీడవాయె!దుష్టమార్గమున్!వీడెదేల?బీదసాదలన్!వేడవా!విశ్వనాధునిన్!
బీడువారరాని శోభలన్!వేడుమా!విశేషబాధ్యువై!వీడుమా!దుర్మదంబునున్!
బూడిదౌను!జీవనంబులున్!బోడివోని శ్రీల  వెల్గుమా!బూడిదే!భాసురంబురా!
దాడివీడి!మోదమందుమా!దౌడులేయ!దోషనాగముల్!దాఢయే!భస్వరాశిరా!
దౌడులేయ=పరుగిడగ,దాఢయే=ప్రార్ధనమే!

వీడెదేల?బీదసాదలన్!వీడవాయె!దుష్టమార్గమున్!వేడవావిశ్వనాధునినిన్!
వేడుమా!విశేషబాధ్యువై!బీడువారరాని!శోభలన్!వీడుమా!దుర్మదంబునున్!
బోడివోని!శ్రీల వెల్గుమా!బూడిదౌను!జీవనంబులున్!బూడిదే!భాసురంబురా!
దౌడులేయ!దోషనాగముల్!దాడివీడి!మోదమందుమా!దాఢయే!భాస్వారశిరా


1.గర్భగత"మత్తరజననీద్వయ "-వృత్తములు.                       బృహతీఛందము.ర.జ.ర.గణములు.ప్రాసగలదు.వృ.సం.171.
ఎ.  వీడవాయె!దుష్టమార్గమున్!           బి.   వీడెదేల?బీదసాదలన్!      
      బీడువారరాని శోభలన్!                       వేడుమా! విశేష!బాధ్యువై
     బూడిదౌను!జీవనంబులున్!                  బోడివోని!శ్రీల వెల్గుమా! 
     దాడివీడిమోదమందుమా!                   దౌడులేయ! దోష నాగముల్!

2.గర్భగత"-ముకుంద"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.ర.లగ.గణములు.ప్రాసగలదు.వృ.సం.93.
వేడవా!విశ్వనాధునిన్!
వీడుమా!దుర్మదంబునున్!
బూడిదేభాసురంబురా!
దాఢయే! భాస్వ రాశిరా!

3.గర్భగత"-రజనీకరద్వయ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.10వయక్షరముయతి.ప్రాసగలదు.
ఎ.  వీడవాయె!దుష్టమార్గమున్!వీడెదేల?బీదసాదలన్!
      బీడువార రాని శోభలన్!వేడుమా!విశేష!  భాధ్యువై!
      బూడిదౌను!జీవనంబులున్! బోడివోని! శ్రీల వెల్గుమా!
     దాడివీడి!మోదమందుమా! దౌడులేయ! దోష నాగముల్!
బి.   వీడెదదేల? బీదసాదలన్! వీడవాయె!దుష్ట మార్గమున్!
       వేడుమా!విశేష !బాధ్యువై! బీడువారరాని!శోభలన్!
       బోడివోని! శ్రీల వెల్గుమా! బూడిదౌను!జీవనంబులున్!
       దౌడులేయ!దోష నాగముల్!దాడివీడి!మోదమందుమా!

3.గర్భగత"-రజోరజ"'-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.లగ.గణముల.10వ.యక్షరంయతి.ప్రంయతు
వీడెదేల?బీదసాదలన్! వేడవా?విశ్వనాధునిన్!
వేడుమా!విశేషబాధ్యువై!వీడుమా!దుర్మదంబునున్!
బోడివోని!శ్రీల వెల్గుమా!బూడిదే!భాసురంబురా!
దౌడులేయ! దోషనాగముల్!దాఢయే!భాస్వరాశిరా!

4.గర్భగత"-అజేయ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.య.జ.ర.లగ.గణములు.యతులు10,18.
ప్రాసనీమముగలదు.
వీడెదేల?బీదసాదలన్!వేడవా!విశ్వనాధునిన్వీడవాయె?దుష్టమార్గమున్!
వేడుమా!విశేషబాధ్యువై!వీడుమా!దుర్మదంబునున్!బీడువారరానిశోభలన్
బోడివోని!శ్రీలవెల్గుమా!బూడిదే!భాసురంబురా!బూడిదౌను!జీవనంబులున్!
దౌడులేయు!దోషనాగముల్!దాఢయే!భాస్వరాశిరా!దాడివీడి!మోదమందుమా

5.గర్భగత"-ఉల్లాసినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.ర.య.జ.ర.లగ.గణములు.యతి.9..ప్రాసగలదు.
వేడవా!విశ్వనాధునిన్!వీడవాయె!దుష్టమార్గమునన్!
వీడుమా!దుర్మదంబునున్!బీడువారరాని!శోభలన్!
బూడిదే!భాసురంబురా!బూడిదౌను!జీవనంబులున్!
దాఢయే!భాస్వరాశిరా! దాడివీడి!మోదమందుమా!

6.గర్భగత"-గీతాంజలీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.ర.య.జ.య.జ.ర.లగ.గణములు.యతులు09,18.
ప్రాసనీమముగలదు.
వేడవా!విశ్వనాధునిన్!వీడవాయె!దుష్టమార్గమున్!వీడెదేల?బీదసాదలన్!
వీడుమా!దుర్మదంబునున్!బీడువారరాని శోభలన్!వేడుమా!విశేషబాధ్యువై
బూడిదే!భాసురంబురా!బూడిదౌను!జీవనంబులున్!బోడివోనిశ్రీలవెల్గుమా!
దాఢయే!భాస్వరాశిరా!దాడివీడి!మోదమందుమా!దౌడులేయదోషనాగముల్
స్వస్తి.
వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. 
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
వివిధ వృత్తములను రసరమ్యముగా తెలిపి నందులకు శ్రీ వల్లభవఝులవారికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.