గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, మే 2017, బుధవారం

సామాజిక పద్య పక్షం 3. విషయము. వృద్ధాప్యం కష్ట సుఖాలు. ముగింపు తేదీ 31 - 5 - 2017 6:00pm.

  జైశ్రీరామ్.
ఆర్యులారా! ఈ మూడవ పద్య పక్షమున తమ కవితలు వెలయించుటకు  వృద్ధాప్యం కష్ట సుఖాలు అనే సమాజికాంశాన్ని ప్రకటించియున్నారు. ఇంకెందుకు ఆలస్య్ం. ఉపక్రమించండి పద్య రచనకు. పంపండి మీ రచనలను prajapadyam@gmail.com కు పంపండి. 
ఒక్క మాట చెప్ప మరిచాను.
ఐదు పద్యాలే వ్రాయాలి. ఒక వృత్తపద్యం తప్పక ఉండాలి. 
వ్రాసిన పద్యాలు MSవర్డ్ రూపంలో మాత్రమే పంపాలి.
పద్యం ముందు పేరు వ్ర్యుటకు  చంపకమాల అయితే చం. అని, తేట గీతి ఐతే తే.గీ. అని, ఆటవెలది ఐతే ఆ.వె. అని ఈవిధంగా వ్రాయాలి. పూర్తి పేర్లు వ్రాసి నిర్వాహకులకు  HOME WORK  పెంచ వద్దు. 
తే.గీ. కనుచు వృద్ధాప్యమున వచ్చు కష్ట సుఖము
లసదృశంబగు పద్యంబు లైదు వ్రాసి
పద్య పక్షంబు మూడుగా పంపుడయ్య.
సత్కవీశ్వరుడననిల్చి సభను వెలుఁగ. 
మీ సచ్చరిత కారణంగా మీరు దైవానుగ్రజపార్తులగుదురు గాక. 
 శుభమస్తు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.