గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, మే 2017, శుక్రవారం

పద్య పక్షమ్ ఛందస్సు ( 2 )

జైశ్రీరామ్.

 
పద్య పక్షమ్ ఛందస్సు  ( 2 )
గతవారము తెలుసుకొనిన విషయములపై సాధారణముగా కొన్ని సందేహములు వచ్చుట సహజము.
పొల్లు వర్ణము (న్ క్ ల్) గురువా? లఘువా? ఈ సందేహం మీకు రాకపోవచ్చును నాబోటివానికి రావచ్చును.
ఈ పొల్లు అక్షరములో అచ్చునకు సంబంధించిన హ్రస్వము కాని దీర్ఘము కాని లేని కారణమున అది గురువూ కాదు, లఘువూ కాదు.
ఇక ఏయే వర్ణములు గురువులగునో చెప్పఁబడెను కదా! ఈ నియమములు సాధారణమైనవి.
ఒక్కొక్కసారి ఈ నియమములు కలిగి ఉన్న వర్ణములు గురువులు కాకపోవచ్చును.
ఉదాహరణద్రువ లో ’ / విద్రుచె లో ‘వి గురువులు కావు. లఘువులే..
ఇటువంటివాటి విషయములో నిర్ణయించుట ఎట్లు? అని మనకు అనిపించును.
క. వివిధముగఁ జాఁపి పలికెడు - నవియును, మఱి యూఁదిపలుకు నవియును గురువుల్‌
భువి నిలిపి పలుకు వర్ణము - లవియెల్లను లఘువులయ్యె నంబుధి శయనా! (అనంతుని ఛందము)
అని ముందు తెలుసుకున్నాం కదా!
ఏ ద్విత్వ, సంయుక్త వర్ణ పూర్వాక్షరములపై వాటి ఒత్తిడి ఉండునో
ఆ ద్విత్వ, సంయుక్త వర్ణ పూర్వాక్షరములు గురువులగును.
సర్వ సాధారణముగా ద్విత్వ, సంయుక్త వర్ణములు పద మధ్యమమయియుండునో
వాటి పూర్వ వర్ణము తప్పక ఒత్తిడి కలిగియుండుటచేత గురువులగును.
ఉదా. రక్షణ, శిక్షణ, గుఱ్ఱము, కర్ర. తొర్ర, జుర్రు వక్రము, మున్నగు చోటులలో ద్విత్వ, సంయుక్త వర్ణముల పూర్వ హ్రస్వములు గురువులే అగునని అర్థమగుచున్నది.
ఎగగ్రోలు మున్నగు చోటుల ఒత్తిడి లేనందున లఘువుగనే గ్రహింపవలయునని తెలియుచున్నది.
విద్రుమము మున్నగుచోటులలో గురువు వైకల్పికము అని అర్థమగుచున్నది.
వికల్పము అనగా గురువు వచ్చుట లేదా రాకపోవుట. గురువు రానిపక్షమున లఘువుగా గ్రహింపవలెను.
గణ స్వరూప నిరూపణము.
క. గణంబగు నేక గురువు. (U = )
గణంబగు నేక లఘువు లాలిత్యముగా. (I = )
గణమగు లఘువు గురువును. (IU = , లేదా లగ)
గణంబగు గురువు లఘువహర్పతి తేజా!  (UI = , లేదా గల) (భీమన ఛందము 11)
క. లలమునకు రెండు లఘువులు. (II = లల, లేదా లా)
వలనొప్పఁగ లఘువు గురువు వఱలును లగమై. (IU = లగ, లేదా)
గలమయ్యె గురువు లఘువును. (UI = గల, లేదా )
జలజాక్షా! గగ మనంగఁ జను గురు యుగమున్‌. (UU = గగ, లేదా గా) 12
క. 'శౌరి' యనిన గణంబగుఁ (UI)
జేరి 'హరీ' యనిన మల్ల సిల్లును గణం (IU)
బారయఁ 'గృష్ణా' యనినను (UU)
ధారుణి గగ మండ్రు,  లల ము దా 'హరి' యన్నన్‌. (II) (అనంతుని ఛందము13)
2.5. సమ (ప్రధాన) గణములు
క. గురువులు మూఁడిడ గణము. (UUU)
పరఁగంగా నాదిగురువు గణం బయ్యెన్‌. (UII)
ధరమధ్య గురువు గణము. (IUI)
సరసగుణా! యంత్యగురువు గణం బయ్యెన్‌. (IIU) (భీమన ఛందము 14)
2.6. ప్రధాన గణముల కుదాహరణములు
క. గణము 'శ్రీనాథా' యన. (UUU)
గణము 'కేశవ' యనంగఁ బరికింపగా (UII)
గణము 'ముకుంద' యనఁగా, (IUI)
గణము 'వరదా' యనంగ సర్వజ్ఞనిధీ! (IIU)       16
క. గణంబు మూఁడు లఘువులు. (III)
గణంబున కాదిలఘువు యమతనయ నిభా! (IUU)
గణంబు మధ్యలఘువగు. (UIU)
గణంబున కంత్యలఘువు దాక్షిణ్యనిధీ! (UUI) (భీమన ఛందము 15)
క. గణము 'వరద' యనంగా, (III)
జగతి 'మురారీ' యనంగఁ జను గణంబున్‌. (IUU)
గణంబు 'మాధవా' యన, (UIU)
గణము 'దైత్యారి' యనఁగఁ దామరసాక్షా! (UUI) 17
గణముల వివరణ.
U - అనగా గురువు.   l - అనగా లఘువు.          
l -  గణము.                     ఉదా
ll లల - “లలము లేక లా.            ఉదాహరి
U - ‘ గణము.                     ఉదాశ్రీ
UU గగ - ‘గగము లేక గా.           ఉదారామా!
lU లగ - ‘లగము లేక వగణము.    ఉదాహరీ!
Ul గల - ‘గలము లేక గణము. ఉదాలక్ష్మి.
UUU గగగ గణము.              ఉదాశ్రీనాథా!
Ull గలల గణము.                  ఉదావిష్ణువు.
lUl లగల గణము.                  ఉదాముకుంద!
llU లలగ గణము. .                ఉదారమణా!
lll లలల గణము. .                 ఉదానృహరి.
lUU లగగ గణము. .             ఉదాముకుందా!
UlU గలగ గణము. .               ఉదాశ్రీహరీ
UUl గగల గణము. .               ఉదాశ్రీకృష్ణ
క. నగణముపయి గురువున్నన్‌ (IIIU)
నగమగు, లఘువున్న యెడల నలమగు వరుసన్‌, (IIII)
సగణము పయి లఘువున్నన్‌
దగ సలమగుఁ గంజహిత సుధాకరనయనా! (IIUI) 18
2.7. ఉప గణములు  ‘సూర్య - ఇంద్ర చంద్ర గణములు
క.నల - నగ - సల - - - లు నా (IIII - IIIU - IIUI - UII - UIU - UUI)
నెలమిని నీయాఱు గణము లింద్రగణంబుల్‌.
గల (UI),   (III)గణము లీ రెండును
జలజాప్త గణంబులయ్యె జగదాధారా! (జలజ + ఆప్త గణములు = సూర్య గణములు)     19
క. గల - గణము లినుఁ , డింద్రుఁడు
(IIII) - నగ(IIIU) - సల(IIIUI) - (UII) - (UIU) - (UUI) లింక నగగ(IIIUU) - నహ(IIIUI)-సలా(IIUII)-
భల(UIII) - భగురు(UIIU) - మలఘు(UUUI) - సవ(IIUIU) - సహ(IIUUI)-
తల(UUII) - రల(UIUI) - నవ(IIIIU) - నలల(IIIII) - రగురు(UIUU) - తగ(UUIU)’ లిందుఁడజా! 
(ఇందు గణములు = చంద్ర గణములు) (అనంతుని ఛందము 20)

సూర్య - ఇంద్ర చంద్ర గణముల వివరణ.
సూర్య గణములు.
Ul గలము లేదా హగణము, ఉదా.   లక్ష్మి
lll నగణము.                  ఉదా.   రమణ
ఇంద్ర గణములు.
llll  నల             ఉదా.   హరహర 
lllU నగ             ఉదా.   శుభకరా!
llUl సల            ఉదా.   పరమాత్మ.
Ull                ఉదా.   శ్రీహరి
UlU               ఉదా.   మాధవా!
UUl .              ఉదా.   గోవింద.
చంద్ర గణములు.
నగగ (IIIUU)       ఉదాసుగుణవేద్యా
నహ (IIIUI)         ఉదాసుజనపోష!  
సలా (IIUII)       ఉదారఘురాముఁడు.
భల (UIII)            ఉదా.   శ్రీరమణ.
భగురు (UIIU)     ఉదా.   శ్రీకరుఁడా!
మలఘు (UUUI) ఉదా.   దీనోద్ధార!
సవ (IIUIU)         ఉదా.   సుగుణాశ్రయా!
సహ (IIUUI)       ఉదా.   కరుణాత్ముండు.
తల (UUII)           ఉదా.   రామార్పణ.
రల (UIUI)            ఉదా.   రామరాజు.
నవ (IIIIU)           ఉదా.   జనవినుతా!
నలల (IIIII)         ఉదా.   హరిహరులు.
రగురు (UIUU)     ఉదా.   నీరజాక్షా!
తగ (UUIU)       ఉదా.   కాపాడుమా.
ఎక్కడయినా ఛందశ్శాస్త్ర విరుద్ధముగా కాని, సందేహాస్పదంగా కాని, ముద్రణలో కాని దోషములు ఉన్నచో అవి తప్పక సరి చేసుకొవచ్చును. సహృదయతతో సూచించ వలసినదిగా మనవి.
వచ్చేవారం మరికొన్ని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.