గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, మే 2017, సోమవారం

కార్మిక లోకానికి శుభాకాంక్షలు

జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు కార్మిక సంక్షేమ దినోత్సవము. 
ఈ సందర్భముగా కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలుపుదాము.
ఉ. రాతిరియున్ బవల్ శశియు, రంజన సూర్యుఁడు సంచరించుచున్
ఖ్యాతిని గన్న కార్మికు, లహస్పతి కేది విరామ, మెన్నగా
ధాతిరి వెల్గుచుండుటకు ధర్మము తప్పక సంచరింత్రు వి
ఖ్యాతిని, కార్మికుల్, శశియు, నర్యముఁడున్. మహనీయులే కదా!
శా. కర్మాగారములందు రాత్రి పవలున్ కష్టించి జీవించు
ద్ధర్మాత్ముండయ కార్మికుండు. సుగుణోద్ధాముండు చిందించుచున్
ఘర్మంబున్ యజమాని లాభములకై కష్టించు. వీడండు స
త్క ర్మంబెన్నఁడు పుణ్య మూర్తి. కరుణోద్ధాముండు, పూజ్యుండిలన్!  
ఆటవెలది త్రయ గర్భ సీసము. 
కర్మ పరుఁడు చూడ కార్మికుం డొక్కఁడే - యనవరతము దేశమునకు వెలుగు.
అట్టి కర్మపరుని పట్టించుకొనరేల - హృద్య సుగుణ రామ పద్య పక్ష!
రాత్రి పవలు లేదు రాకాశి యంత్రాల - తోడ బ్రతుకుచుండు నీడ వోలె.
వాని శ్రమను జూచువారలే లేరు నీ - వాని కనుమ రామ! పద్య పక్ష!
ఆ.వె. కుక్షి నిండదెపుడు, నిక్షేపమును లేదు, - రక్ష లేదు కనఁగ, ప్రబల లేడు.    
రక్షకుండ వగుచు రాజిల్లఁ జేయు సం - వర్ధకుఁడవు రామ! పద్య పక్ష!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.