గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, మే 2017, గురువారం

పద్య పక్షమ్ ఛందస్సు ( 4 )

జైశ్రీరామ్.
పద్య పక్షమ్ ఛందస్సు  ( 4 )
ఆర్యులారా! వందనములు. స్వరయతులు ఏడింటిని మనము తెలుసుకొన్నాం కదా.
ఇప్పుడు ఎనిమిది నుండి వ్యంజన యతులను తెలుసుకొను ప్రయత్నము చేద్దాము.
. వ్యంజన యతులు.
8) ప్రాణి విరామము.
తెలుఁగు అజంత భాష. అచ్చు అంతమందు కలిగిన భాష. అజంత భాష.
అచ్చులు ప్రాణములు కావున అవి కలిగి ఉన్న హల్లులు ప్రాణులు.
అజంత భాష అయిన ఈ భాషలో పొల్లు వర్ణముతో సహజ సిద్ధమయిన ముగింపు ఉండదు.
సాధ్యముచే పొల్లు ఉంచుట తెలిసినదే. వచ్చెను అన్న రూపమును వచ్చెన్ అని మనము ప్రయోగించుట కలదు.
పొల్లు హల్లుకు మాత్రమే యతి వేయరాదని అప్పకవి ప్రాణి విరామమును తెలియఁ జేసెను.
అ ఆ ఐ ఔ పరస్పర మైత్రి కల ఒక వర్గము.
ఇ ఈ ఋ ౠ ఎ ఏ పరస్పర మైత్రి కల మరొక వర్గము
ఉ ఊ ఒ ఓ పరస్పర మైత్రి కల వేరొక వర్గము.
హల్లు పొల్లు వర్ణమేఅచ్చు సహాయము లేనిదే పలుకఁబడలేదు
ఇది పలుకఁబడుటకు అచ్చును ప్రాణముగా కలిగియుండును
ఇట్టులున్నందుననే యతులలో ఆ హల్లుతో పాటు అందలి అచ్చునకు కూడా యతి పాటించవలెను.
(క్+) కా (క్+) కై (క్+) కౌ (క్+) / కి (క్+) కీ (క్+) కృ (క్+) కౄ (క్+) కె (క్+) కే (క్+) / కు (క్+) కూ (క్+) కొ (క్+) కో (క్+) అని మూడు తెఱఁగులలో యతి ఒప్పును. ఇదియే ప్రాణి విరామము.
ఉదా.
.వె. (ప్+) ద్య పక్షమందు పై (ప్+) చేయి కవితదే.
ప్రీ (ప్+ర్+) తి పద్యమందు పెం (ప్+ఎం) చ వలయు.
పు (ప్+) ణ్యమొదవఁ జేసి, పో (ప్+) షించు. యతులిట్లు
... మిత్రులమరు హల్లులొప్పు.

9) వర్గజ యతులు.
ఏ వర్గక్షరములకు వర్గాక్షరములు అనునాశికములు తప్ప మిగిలినవాటికి పరస్పరము యతి చెల్లును.
క. ఖ. గ. ఘ. { } వర్గజ యతి
చ. ఛ. జ. ఝ. { } వర్గజ యతి.
ట. ఠ. డ. ఢ. { } వర్గజ యతి
త. థ. ద. ధ. { } వర్గజ యతి.
ప. ఫ. బ. భ. { } వర్గజ యతి.
ఉదా.
.వె. వులు పద్యపక్ష ణనీయ కవులైరి,
చర హృదయులయిరి నత పొంది.
నతఁ గన్న కవులు కావ్యంబులను వ్రాసి
పచ్చనైన పద్య ప్రతిభ పెంచు.

.వె. దువుచుండి వ్రాయు తనంబు చేసిన
ఝుషముఁ (తాపము) బాప వచ్చు ఛుద్ర (ప్రకాశవంతమయిన) కృతిని.
దువ పద్య పక్ష యపూర్ణ సత్కృతుల్
ఝుమ్మటంచు కవిత చొచ్చి వచ్చు. (చొచ్చి వచ్చు = త్రోసుకొని వచ్చును)

తే.గీ. టంకశాలఁ జేయరుగ కుఠారములను?
టంకముండినకోర్కెలరును భువిని.
డంబమప్పుడు పెఱుఁగుట టంక మహిమ.
టంకమనఁగ దీనారము, బ్బు, భువిని.

తే.గీ.లఁచి పద్యపక్షమనెడి దానినొకటి
ర్మపక్షాన నిలుచు పద్య (ద్+య్+)మ్ములిలను
తెలుఁగు భాషను వెలయింప దివ్యులిచట
దీప్తమొనరించిరయ మన తీరు కనఁగ.

తే.గీ. ద్య రచనలు చేయుసద్భా (ద్+భా) గ్యమిచ్చి,
బ్ర (బ్+ర్+) హ్మరథమును పట్టుచు ద్యకవుల
ప్రా (ప్+ర్+) భవంబును పెంచెడి వ్యులిలను
ప్ర (ప్+ర్+) బలి సతతము శుభములు డయుఁ గాక.

10) బిందు యతి. / నుస్వారయతి
పూర్ణ బిందు పూర్వకమైన ఏ వర్గ వర్ణమైనను ఆ వర్గ అనునాశికముతో యతి చెల్లును.
" ఙ " తో > ంక. ంఖ. ంగ. ంఘ.
" ఞ " తో > ంచ. ంఛ. ంజ. ంఝ.
" ణ " తో >ంట. ంఠ. ండ. ంఢ.
" న " తో > ంత. ంథ. ంద. ంధ.
"మ " తో >ంప.ంఫ. ంబ. ంభ. లు బిందు యతిపేరుతో పరస్పరము చెల్లును.
ఉదా.
తే.గీ. క చ ట త ప లును మరియును గ జ డ ద బ లు
ఖ ఛ ఠ థ ఫ లును మరియును ఘ ఝ ఢ ధ భ లు
బిందు పూర్వకమై చెల్లు బిందుయతులు.
ఙాకు క ఖ గ ఘ లగుననం జనకుండ!
ఞాకు చ చ జ ఝలగునుపంచాననుండ!
ణాకు ట ఠ డ ఢ చెల్లు పంరి నివాస!
నాకు త థ ద ధ చెల్లుఁ సౌంర్య నృహరి!
మాకు చెల్లు సంన్న కృష్ణ! 

11) తద్భవ వ్యాజ యతి.
"జ్ఞ --కు యతి మైత్రి కలదు.
ఉదా.
తే.గీ. జ్ఞానమొసఁగెడి తెలుఁగున యతతోడ
జ్ఞాతమగు కృష్ణునకునుప్రణామములన
తద్భవవ్యాజ యతినొప్పు దానినెఱిఁగి
పద్యపక్షము పద్యముల్ వ్రాయనగును.

12) విశేష యతి.
" జ్ఞ " ---- ఘ. లకు యతి మైత్రి. కలదు.
ఉదా.
తే.గీ. జ్ఞాన సౌభాగ్యమే మన గౌరవంబు.
కావ్య నిర్మితి వలన విజ్ఞాన ప్రగతి.
ఖండ కావ్యమ్ము కూడ విజ్ఞతనొసంగు
జ్ఞాన భాగ్య సంవృద్ధిని నత పెఱుఁగు.

13) అనుస్వార సంబంధ యతి.
పూర్ణానుస్వార పూర్వక  ట త వర్గములకు పరస్పరము యతి చెల్లును.
" ంట - ంఠ - ండ - ంఢ - ంత - ంథ - ంద - ంధ - లు పరస్పరము చెల్లును.
ఉదా.
శా. జ్ఞానోద్భాస సుపూజితా! వర జగత్ కల్యాణ సన్మానసుం
డా! నీవే కృప నేలు చిత్ర కృతి సంధానంబు జేయించి, సం
స్థానంబున్ నెలకొల్పి జ్ఞాన హిత భాండాగారమున్ జేసి,! సం
తానంబున్ పరివృద్ధి చేసి మది నుంన్ వేడెదన్ నిన్ హరీ!

14) అనునాసికాక్షర యతి.
తవర్గ అనునాశికాక్షరమైన తో అనుస్వార పూర్వక టవర్గమునకును,
టవర్గ అనునాశికాక్షరమైన తో అనుస్వార పూర్వక తవర్గమునకును యతి చెల్లును
" న " తో > ంట - ంఠ - ండ - ంఢ. చెల్లును.
" ణ " తో > ంత - ంథ - ంద - ంధ. చెల్లును.
ఉదా.
శా. నా మీదం గృపఁ జూపరా! సుగతినుంన్ నన్ను దీవించి, వా
ణీ మంత్రాక్షర మందిరంబని కనం ధీమంతులెల్లన్ ననున్.
నీ మీదన్ మది నిల్పఁ జేసి కృతి పండించే నృసింహా! పరం
ధామా యంచనునాశికాక్షర యతిం దర్పంబుతోఁ జేయనౌన్.

15) మువిభక్తి యతి.
ప్రథమా విభక్తి ప్రత్యయమగు ము అను వర్ణముతో ఉత్వ విశిష్ట  ప వర్గమునకు యతి చెల్లును.
ము - పుపూపొపో, -ఫుఫూఫొఫో, - బుబూబొబో - భుభూభొభో లకు యతి చెల్లును.
ఉదా.
.వె. పుణ్య పద్య పక్షములవ్రాయుసత్ కవుల్.
పూజ్యులిలనుజ్ఞానమునొసగుటను.
భోజు డిలను కష్టములకోర్చు కృష్ణుండు
పొలయఁ జేసె కవనములను మనల.

16) ముకార యతి. (ము విభక్తి యతియు నిందు చేరిపోవును)
ఉత్వముతో కూడిన మవర్ణము (ముకారము) తో ఉత్వ విశిష్ట పవర్గమునకు యతి చెల్లును..
"పు - ఫు - బు - భు - ము కు పరస్పరము యతి చెల్లును
ఉదా.
.వె. మురియు పద్యపక్ష పూజ్యుండు కృష్ణుండు
పుణ్య విలసితుండు ముచ్చటైన
భువన విజయ కవనములఁజేయఁ జేసెడి
బుధుఁడనంతుఁడఖిల ముఖ్యుఁడతఁడు.

17) మవర్ణ యతి.
పూర్ణానుస్వార పూర్వక అంతస్థములకు, ఊష్మములకు వర్ణముతో యతి చెల్లును.
" మ " తో >  ం య - ం ర - ం ల - ం వ -ం శ - ం ష - ం స - ం హ " లకు యతి చెల్లును.
ఉదా.
తే.గీ.హిని రక్షించు ఘనులుసంమివరులగు.
హితులగు వారిదివ్య సంక్షణమున
మాన్య సుకవులు కాంచు సంక్ష్యమరసి,
ధుర కవితలన్ జగతి సంర్ధనమగు.
మాట వినకున్నఁ జరుగు వం క్షయంబు.
ముఖ్య కవి పూజ్యుఁ డేకదంష్ట్రుఁడు కనంగ.
ధుర కవులగు నిలరాజహంలు నిజంబు.
హిత చిత్రకవి కవిసింమిలఁ గనఁగ.

18) సరస యతి.  (అప్పకవి ఋజుయతి అను పేర   -  లకు యతి చెప్పెను )
" -- హ " లకు యతి చెల్లును.
" ------ స " లకు యతి చెల్లును.
" - ణ " లకు యతి చెల్లును.
ఉదా.
ఆ.వె.   లు చెల్లుఁ గమలనాభ యొండొంటికి
(న్+) హ లమరి యుండు స్తి వరద
స లొందునిచట ఝంబుల తోడ
రస యతు లనంగ లధి శయన!

19) అభేద యతి.
" - బ " లకు యతి చెల్లును. (అ భేద వర్గ యతి - " ---- " లు చెల్లును.)
" - ళ " లకు యతి చెల్లును.
" - డ " లకు యతి చెల్లును.
ఉదా.
తే.గీ. హుముఖ ప్రాభవంబున్న వారు కవులు.
లిత కవయిత్రి ముద్దుపని కనంగ.
క్ష్యమునుఁ గల్గి వ్రాయనరు సుకవులు.
- , - , - ,లిట్లొనరును ద్యములను.

20A) ప్రత్యేక యతి.
బాలవ్యాకరణము సంధి పరిచ్ఛేదము 45 వ సూత్రమున అది అవి సబ్దంబుల యత్తునకు వృత్తిని లోపంబు బహుళంబగు. అని చెప్పఁబడెను.
చేతి + అది = చేతిది లేదా చేతిది.
ఇట్టి సందర్భములలో
చేతిది అనినచో వ్యంజనమున(తి)కే యతి వేయ వచ్చును. గూఢస్వర యతి వేయరాదు
చేతిది అనినచో కారమునకే యతి వేయ వచ్చును.
కావుననే అప్పకవి ప్రత్యేక యతిగా దీనినుగ్గడించెను.

20B) భిన్న యతి.
రించు వరించు హరించు స్మరించు మున్నగు క్రియలలో
ఇంచుగాగమమున నడుమ మరియొక కరము యడాగమము(యిం)తో వచ్చి
ధరియించు వరియించు హరియించు స్మరియించు అను రూపములు కలుగును.
ధరియించు అనినచో యడాగమ సహిత ఇకారమున (యిం) కే యతి వేయవలెను.
రించు అనినచోరి వర్ణమునకే యతి వేయ వలెను.
దీనినే అప్పకవి భిన్న యతి అని వక్కాణించెను.

20C) ఏకతర యతి.
- దేనికి అదే యతి చెల్లును కాని పరస్పరము యతి చెల్లదు.

20) అభేదవర్గ యతి.
" ---- వ " లు మిత్ర వర్ణములు కావున పరస్పరము యతి చెల్లును.
ఉదా.
తే.గీ. ద్య పక్షమ్మునందున్న వారు కవులు.
లితమాశించనట్టి సద్వందితులిల.
హుముఖ ప్రాభవంబున్నవారు వారు.
ద్రమొసగెడి పద్యముల్ వ్రాయువారు.

21) సంయుక్త యతి.
" క్ష్మ " వంటి సంయుక్త హల్లులో గల " - - "లలో యే హల్లుకైనను యతి చెల్లును.
ఉదా.
తే.గీ. వుల సత్కీర్తి వ్యాపించు క్ష్మా సతంబు
త్య రూపంబు పరమ సూక్ష్మం (క్+ష్+మ్+అం) బు కనఁగ.
ధుర కవులకు భారత క్ష్మా (క్+ష్+మ్+) గృహంబు.
యుక్తమగు నిట్టు లొప్పు సంయుక్త యతులు.

22) అంత్యోష్మ సంధి యతి.
" వాక్ + రి = వాగ్ఘరి " ఇందు "  తో గాని   " తో గాని యతి చెల్లును.
ఉదా.
తే.గీ. హాకి నంత్యోష్మ సంధి వాగ్ఘ ( క్+రి = గ్+రి = గ్ఘరి ) రి యనంగ.
కాకి నంత్యోష్మ సంధి వాగ్ఘ ( క్+రి = గ్+రి = గ్ఘరి ) రి యనంగ.
వులు కనఁజాలఁ గలరు వాగ్ఘ ( క్+రి = గ్+రి = గ్ఘరి ) రి పదంబు.
రిని కనఁ జేయునిలను వాగ్ఘ ( క్+రి = గ్+రి = గ్ఘరి ) రి పథంబు.

23) వికల్ప యతి.
" సత్ + మతి = సన్మతి. " ఇందు " త " తో గాని " న " తో గాని యతి చెల్లును.
ఉదా.
తే.గీ. త్వ సుకవికిఁ జేయు సన్మానమిలను
లువ రాణికిఁ జేయు సన్మానమగును.
మహితులకుఁ జేయునట్టి సన్మానములవి
మహికి భక్తిని చేయు సమ్మానములగు.
ఇంతవరకు ఇరువది మూడు యతులనుగ్రహింప యత్నించితిమి. వచ్చే గురువారం క్రమ సంఖ్య ఇరవై నాలుగు నుండి ఉభయయతులు తెలుసుకొనే ప్రయత్నమును ఆ పరమాత్మ సిద్ధింపఁ జేయును గాక
చం. గుణముల నుగ్గడించుతరి గుట్టుగ దోషములుండవచ్చు సద్
గుణగణనాభిరాములగు కూర్మి సహోదరులీరు. దోషముల్
గణనము చేయఁబోక వర గణ్య గుణంబులనెల్ల నెంచుడీ!
మణులనెఱుంగునేర్పరులు మాన్యులు కాక మరెవ్వరిద్ధరన్? 
నమస్తే.

స్వస్తి.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.