గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, మే 2017, ఆదివారం

చతుర్విధ కందము.

జ్వైశ్రీరామ్.
ఆర్యులారా!
చిత్రకవనాసక్తి ఉరకలు వేస్తున్న కొందరు కవులను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే అప్పకవి చెప్పిన చతుర్విధ కందము (అప్పకవీయము - 4- 627) మీ ముందుంచుచున్నాను. ఈ విధంగా కూడా వ్రాసే ప్రయత్నంలో కవులు కృతకృత్యులవాలని నా ఆకాంక్ష.

చూడండి చతుర్విధ కందము.
శ్రీభూమీన వరదహరి
గోభూమానవ వినుత సుగుణ బుధ మధునా
శాభీ మానవ కృష్ణఘ
నా భా మానవ హరిదరి యభవ కమలనా 

భూమీన వరదహరిగో
భూమానవ వినుత సుగుణ బుధ మధునాశా
భీ మానవ కృష్ణఘనా 
భా మానవ హరిదరి యభవ కమలనా శ్రీ

మీన వరదహరిగోభూ
మానవ వినుత సుగుణ బుధ మధునాశా
భీ మానవ కృష్ణఘనా భా 
మానవ హరిదరి యభవ కమలనా మీశ్రీభూ

న వరదహరిగోభూమా
నవ వినుత సుగుణ బుధ మధునాశాభీ 
మానవ కృష్ణఘనా భా మా
నవ హరిదరి యభవ కమలనాశ్రీభూమీ.
జైహింద్. 
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.