గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, మే 2016, సోమవారం

అదృష్టపూర్వా బాహవః ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. అదృష్టపూర్వా బాహవః సహాయాః సర్వే పదస్థస్య భవంతి వశ్యాః
అర్ధాద్విహీనస్య పదచ్యుతస్య భవంతి కాలే స్వజనోపి శత్రుః
గీ. రెండు చేతులా గడియించు చుండువాని
కండగానుందురందరూ. అట్లు కాక
వట్టి చేతుల నుందుమా ఒట్టు రారు
దరికినొక్కరూ నిజమిది.మరువరాదు.
భావము. అదృష్టం మనకి కలసి వచ్చినంతసేపూ రెండుచేతులా సంపాదిస్తున్నంతసేపూ బయటివాళ్ళు అందరూ మన అడుగులకు మడుగులొత్తుతారు. అర్ధవిహీనస్య అంటే డబ్బు లేనప్పుడు పదవి పోయినప్పుడు అదే స్నేహితులు బంధువులు శత్రువులుగా మారిపోతారట... దీనినే జగద్గురు ఆదిశంకరాచార్యులవారు భజగోవిందం లో ఇలా చెప్తారు.
శ్లో. యావద్విత్తోపార్జన సక్తః - తావన్నిజ పరివారో రక్తః|
పశ్చాజ్జీవతి జర్జర దేహే - వార్తాం కోపి న పృచ్ఛతి గేహే||
ధనమును సంపాదింస్తుంన్నంత వరకే నీ బంధు మిత్ర పరివార జనము నీ మీద అనురాగము, ఆసక్తి చూపిస్తారు. ముసలితనమున నీ దేహము శిథిలమై శక్తిహీనమైనప్పుడు నీ ఇంట నిన్ను పలుకరించేవారు ఎవ్వరూ ఉండరు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును ఇదిఖచ్చితమైన నిజం.డబ్బు ఉన్నంతకాలం బ్రమ్మరధం పడతారు. ఆ ధనమే లేకపోతే పలకరించను కూడా పలకరించరు. ఇదిమానవ నైజం . నిజమైన మేలిమి బంగారం మనసంస్కృతి .ధన్య వాదములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.