గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, మే 2016, శనివారం

సర్వా ఏవాపద స్తస్య ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. సర్వా ఏవాపద స్తస్య యస్య తుష్టం న మానసమ్ !
సర్వాః సమ్పత్తయ స్తస్య సన్తుష్టం యస్య మానసమ్ !!
ఆ.వె. ఎచట తృప్తి లేదొ యచటయాపదలుండు.
ఎచట తృప్తి యుండునచట ధనము
సంపదలవియెల్ల చక్కగా నుండును.
తృప్తుఁడిలను సుఖము తేజమొందు.                                                                                                         భావము. సంతృప్తి జీవితంలో అతి ముఖ్యమైన విషయం. సంతృప్తి లేని వాడ కి లేదా అత్యాశ వున్నవాడికి సర్వాఏవాపద అంటే ప్రతీ విషయమూ ఆపదలాగానే కనిపిస్తుందిట. అదే ఎవరి మనస్సు సంతోషంగా తృప్తి గా వుంటుందో వారికి సర్వాః సంపత్తయ అంటే అన్నీ సంపదలే. తృప్తి గా జీవించగలిగినవాడే జ్ఞాని.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును ఉన్నంతలో సంతృప్తిగా జీవించ గలిగితే అంతకంటే సుఖ జీవనం వేరొకటి ఉండదు.అంతకు మించిన ఆనందం మరొకటి లేదు చక్కని విషయాన్ని అందించినందులకు ధన్య వాదములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.