గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, మే 2016, బుధవారం

ఆది శంకరాచార్య జయంతి సందర్భముగా శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
ఆర్యులారా! నేశు శంకర భగవత్పాదులవారి జయంతి.
ఈ సందర్భముగా జ్ఞాన పిపాసులైన మీ అందరికీ శంకర విరచిత జ్ఞానామృత శ్లోక పుష్పాలు మీ అందరికీ జ్ఞానప్రదం కావాలని మనసారా కోరుకొంటూ, ఆ భక్తవసంకరుఁడైన శంకర కృపా కటాక్షం మీకు లభించాలని మనసారా కోరుకొంటున్నాను.
జైశ్రీమన్నారాయణా!
జైహింద్.
Print this post

2 comments:

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

గురుదేవులకు శ్రీ శంకరజయంతి పర్వదిన శుభాకాంక్షలు.

అద్వైతామృత ధార బంచెను జగద్వ్యాప్తంబుగా ధీరుఁడై
విద్వత్ప్రౌఢిమఁ జూపుచున్ జనుల సద్విజ్ఞానమున్ బెంచుచున్
సద్వైరాగ్య విచారభావనల తేజ:పూర్ణుఁడై దివ్య మో
క్ష ద్వారంబును జూపు "శంకరుల"కున్ కైమోడ్పులర్పించెదన్.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ శంకర జయంతి సందర్భముగా సోదరులు శ్రీ చింతా వారికి వారి కుటుంబ సభ్యు లందరికీ శుభా కాంక్షలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.