గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, మే 2016, శుక్రవారం

నృసింహ జయంతి సందర్భముగా మీకందరికీ శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
ఆర్యులారా!
వైశాఖ శుక్లపక్షేతుతుర్దశ్యాం సమాచరేత్ -మజ్జన్మ సంభవం పుణ్యం వ్రతం పాప ప్రణాశనమ్
అని నృసింహ పురాణ ప్రమాణము.
ఈ నృసింహ జయంతి నేడే. 
ఈ సందర్భముగా.మీ అందరికీ ఆపరమాత్మ ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ సంతోషములనీయఁ గోరుచున్నాను.
లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబమ్.
కంటికి రెప్పవోలె కని కాచుచునుంటివి. జన్మనేత్తి నే
నొంటిరినై వసించుటకునొప్పని నీవు మనంబు లోపలన్
జంటగ నిల్చి నాగతిని చక్కగఁ జేసి రహింప చేసితే!
ఉంటివి నాకునండగనహోబల శ్రీనరసింహ! దైవమా!

నన్ను గణించు తీరుననె నా మది మెల్గెడి సజ్జనావళిన్
కన్నులఁ బెట్టి కావుమయ! కంజ దళాక్ష నృసింహ దైవమా!
నిన్నుభజించి, నిత్యము పునీత ప్రవృత్తిని మెల్గు భక్తులన్
మన్నికతోడ కాచుట రమాధవ నీ కరుణా కటాక్షమే.

ఈటీవీకి ధన్యవాదములు.
జైహింద
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ నృసింహజయంతి సందర్భముగా ,భగవంతుని చిత్రమును చక్కని ఉత్పలమాలతో అలంకరించి నందులకు ధన్యవాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.