గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, మే 2016, మంగళవారం

మానిషాద ప్రతిష్ఠాం త్వమగమ: . . . వాల్మీకి నోటినుండి వెలువడ్డ ప్రప్రధమ శ్లోకమ్.

జైశ్రీరామ్.

వాల్మీకి నోటినుండి వెలువడ్డ ప్రప్రధమ శ్లోకమ్.
శ్లో. మానిషాద ప్రతిష్ఠాం త్వమగమ: శాశ్వతీస్సమా:
యత్ క్రౌంచ మిధునాదేకమ్ అవధీ: కామ మోహితమ్.
ఆ.వె. ఓరి బోయవాఁడ! ఊరకే చంపితే
కామ మోహియైన ఖగమునొకటి
నెందు వలనఁ జంపితందు వలన నీవు
కీర్తి హీనుడవయి క్షితిని మనుదు.
భావము. ఓరీ కిరాతకుడా! 
క్రౌంచ దంపతులలో కామమోహితమగు ఒకదానిని చంపి, 
నీవు శాశ్వతమగు అపకీర్తిని పొందితివి.
జైహింద్. 
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ప్రసిద్ధ మైన శ్లోకమును అందించి నందులకు కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.