గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, మే 2016, ఆదివారం

గంగా పాపం, శశీ తాపం . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్. 
శ్లో. గంగా పాపం, శశీ తాపం, దైన్యం కల్పతరుస్తథా,
పాపం తాపంచ దైన్యంచ ఘ్నంతి సంతో మహాత్మనః.
గీ. పాపమును గంగ చంద్రుఁడు తాప బాధ,
కల్ప వృక్షము దైన్యము కలుగనీవు.
పాప తాపాలు, దైన్యము, వదలి పోవు
మహితులను చేరి వసియింప మాన్యులార!
భావము. గంగ తాపమును హరించును. చంద్రుఁడు తాపమును పోఁగొట్టును. కల్ప వృక్షము దైన్యమును నశింపఁ జేయును. మహాత్ములనాశ్రయించినచో పాపము, తాపము, దైన్యము మూడూ కూడా నశించును.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నిజమే మహాత్ములను సేవించిన తెలియని అవ్యాజమైన మనశ్శాంతి కలుగుతుంది. చక్కని శ్లోకము

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.