గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఆగస్టు 2015, శనివారం

శ్రీమద్భారతీయులకు 69 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

 జై భారత్.
శ్రీమద్భారతాంబ ముద్దుబిడ్డలైన యావన్మంది భారతీయులకు 69 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. 
సప్త వింశత్యధిక ద్వివిధ కంద గీత గర్భ చంపకమాల.
ధర నుత మాన్య సజ్ జనని భారతి నిత్యము శాంతితోడ ప్రా
గ్వర శృతమై సదా వెలుగు గావుత ప్రీతిని విశ్వమందు పూ 
జ్య రసతమున్ గనున్ జనులు సన్నుతులొందుత సత్ప్రవృత్తితో 
కరినుతుడారయన్ ఘనత గాంచుత సత్యము క్రాలు వెల్గుచున్.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభా కాంక్షలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.