గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, ఆగస్టు 2016, గురువారం

బంధ కవితా మందారము. 40. శ్రీ కే.వీ.సుబ్రహ్మణ్యం

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

10, ఆగస్టు 2016, బుధవారం

శ్రీకృష్ణ దేవరాయా! రచన - కంది శంకరయ్య, వరంగల్

1 comments

జైశ్రీరామ్

శ్రీకంది శంకరయ్య
శ్రీకృష్ణ దేవరాయా!

శ్రీకృష్ణదేవరాయా!
ప్రాకట కర్ణాట రాజ్య రమణీ రమణా!
నీ కావ్య సుధనుఁ గ్రోలఁగ
మా కందును మధురమైన మాకందములే.

ఆయత బాహువిక్రమ సమార్జిత వంశ పరంపరాగత
శ్రీయుత రాజ్యవైభవ మశేషముఁ జెందియు ధర్మరక్షణో
పాయ విదుండవైన నరపాలశిఖామణి! నీ ప్రజాళికిన్
న్యాయము దప్పకుండగ ఘనంబగు పాలన మందఁజేసితే.

వచియింతున్ భవదీయ విక్రమ కళా భాస్వద్యశోభూషిత
ప్రచురోదంతములన్; సమస్త ఘన కర్ణాటాంధ్ర సామ్రాజ్య
ద్రచనా కార్య నిరంతరాత్త నిపుణత్వమ్మున్ విభూషింతు; భా
చయాంచత్ సుమనోజ్ఞ దివ్య కవితాప్రౌఢిన్ బ్రశంసించెదన్.

నీ యన్గుం బ్రజ కెల్ల మోదమును సంధింపంగఁ బాలించితే
యా యన్యాయపు శత్రుమూఁకల రణంబం దోడఁగాఁ జేసితే
వ్రాయం బొందితి వాంధ్రభాషను కవీంద్రస్థానమున్ విష్ణుచి
త్తీయంబున్ నినుఁ బోలు రాజు కలఁడే దేశమ్మునన్ జూడఁగన్.

ఒక చేతన్ గరవాల మూని రిపురాడుద్వృత్తి ఖండించితే
యొక చేతన్ ఘన ఘంట మూని రసకావ్యోత్పత్తినిన్ జేసితే
వికసించెన్ ముఖ మష్టదిగ్గజ కవుల్ ప్రీతిన్ నినుం జేరి కా
వ్య కళాగేహము లష్టదిక్కుల యశోవ్యాప్తిన్ గనం జేయఁగన్.

రచన - కంది శంకరయ్య, వరంగల్
జైహింద్. 

ఆత్మ షట్కము. రచన శ్రీ శంకర భగవత్పాదులు.

0 comments

జైశ్రీరామ్.
 కాను చిత్త బుద్ధి మానసాహంకార - ములు కను చెవి ముక్కు ముఖము కాను.
కాను భూత పంచకంబు. చిదానంద - రూపుఁడయిన శువుఁడ రూఢి నేను.
ప్రాణమేను కాను పంచవాయువులును - కాను ధాతు సప్తకంబు కాను
కోశములును కాను, గురుసచ్చిదానంద - రూపుఁడయిన శువుఁడ రూఢి నేను.
రాగద్వేషములెఱుఁగను,
నేఁగనమోహమును లోభ 
జైైహింద్.

బంధ కవితా మందారము. 39. శ్రీ కే.వీ.సుబ్రహ్మణ్యం

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

9, ఆగస్టు 2016, మంగళవారం

యేన కేన ప్రకారేణ . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

 జై శ్రీరామ్.
శ్లో. యేన కేన ప్రకారేణ, యస్య కస్యాపి దేహినః
సంతోషం జనయేత్ ప్రాజ్ఞః తదేవేశ్వర పూజనమ్.
ఆ. ఎట్టి ప్రాణికైన, నే విధంబుగనైన
నెట్టి పని నయినను నెట్టులైన
సంతసంబుకొలుప సర్వేశ్వరుఁడు మెచ్చు
నదియె దైవ పూజ మదిని గనుఁడు.
భావము. ఏ ప్రాణికైనను, ఏ పని చేసియైనను, ఎట్లైనను ఆనందమును కలిగించుటయే మానవులకు ఈశ్వర పూజ. 
జైహింద్.

బంధ కవితా మందారము. 38. శ్రీ కే.వీ.సుబ్రహ్మణ్యం

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

8, ఆగస్టు 2016, సోమవారం

ఘనంగా జరిగిన శ్రీకృష్ణదేవరాయలు507వపట్టాభిషేకదినోత్సవ చిత్రమాలిక

2 comments

జైశ్రీరామ్ 
ఘనంగా జరిగిన శ్రీకృష్ణదేవరాయలు507వపట్టాభిషేకదినోత్సవ చిత్రమాలిక
 
జైహింద్. 

బంధ కవితా మందారము. 37. శ్రీ కే.వీ.సుబ్రహ్మణ్యం

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

7, ఆగస్టు 2016, ఆదివారం

శ్రీకృష్ణ దేవరాయలవారి 507 వ పట్టాభిషేక దినోత్సవము . . ఆహ్వానమ్

4 comments

జై శ్రీరామ్.

ఆహ్వానమ్
ప్రియ సాహితీ బంధువులారా! శుభమస్తు.
తేదీ 07 - 08 - 2016  ఆదివారం సాయంత్రం 4 గంటలకు
సాహితీ సమరాంగణా సార్వభౌముఁడు శ్రీకృష్ణ దేవరాయలవారి 
507 పట్టాభిషేక దినోత్సవమును
 శ్రీ  జె.పి.ఎన్. నగరు కమ్మూనిటీ హాలులో
 జరిపించ తలపెట్టినారు.
కార్యక్రమమున తెలుగు, సంస్కృత, కన్నడ, తమిళ సాహితీవేత్తలుపాల్గొనుచున్నారు. శ్రీకృష్ణ దేవరాయలు సాహితీ సౌరభాన్ని వ్యాపింప చేసిన “8” మందికి అష్ట దిగ్గజ ప్రశస్తి పురస్కార ప్రదానం.
ఈసందర్భంగా
కోమల సాహితీ వల్లభ డా. కోడూరు ప్రభాకర రెడ్డి, సాహితీ పీఠం, ప్రొద్దుటూరు తరుపున వార్షిక పురస్కార ప్రదానం
తెలుగు కోసం జీవితం ముడుపు గట్టిన  శ్రీ సా.వెం . రమేష్, గారికి.,
కార్యక్రమము జరుగు చిఱునామా:-
జయప్రకాశ నారాయణ్ నగర్ సముదాయ భవనం
వయా మియాపూర్,
హైదరాబాదు - 500 049.
దూర వాణి. 9177945559.
సందర్భముగా
సాహితీ ప్రియులందరికీ ఇదే మా ఆహ్వానం.
ముఖ్య ప్రసంగం - కృష్ణ రాయ రచితమైన ఆముక్త మాల్యద కావ్యము గురించి శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు
ముఖ్య అతిథులు
1.      ఆచార్య శ్రీ ఎల్లూరి శివారెడ్డి
2.     శ్రీ చెన్నూరి ఆంజనేయ రెడ్డి  
3.     శ్రీ ఎ.బి.కె. ప్రసాదు
4.     శ్రీ పి. సత్యనారాయణ.
అష్టదిగ్గజ ప్రశస్తి స్వీకర్తలు.
1.     శ్రీ పెండకూరు గురుమూర్తి, బెంగుళూరు.
2.    శ్రీమతి మంగిపూడి సుబ్బ లక్ష్మి, అధ్యక్షులు, శ్రీ అన్నమాచార్య సంగీత సాహిత్య కళాపీఠం, చోడవరం,          విశాఖపట్టణం.
3.    శ్రీ కంది శంకరయ్య, విశ్రాంత తెలుగు పండితుడు, శంకరాభరణం బ్లాగు నిర్వాహకులు, వరంగల్లు.
4.    శ్రీ కె.సురేంద్ర బాబు, బళ్ళారి.
5.     శ్రీ బాలమురుగన్, దేవకీపురం, తమిళనాడు.
6.    శ్రీ నిష్టి రుద్రప్ప, బళ్ళారి.
7.    శ్రీ వడ్డిపల్లి శ్రీనివాస రావు, జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా.
8.    శ్రీ అప్పిరెడ్డి హరినాథరెడ్డి, కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా.
గుత్తి (జోలదరాశి)చంద్రశేఖర రెడ్డి
డా. కోడూరు ప్రభాకర రెడ్డి
జై హింద్

బంధ కవితా మందారము. 36. శ్రీ కే.వీ.సుబ్రహ్మణ్యం

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

6, ఆగస్టు 2016, శనివారం

బంధ కవితా మందారము. 35. శ్రీ కే.వీ.సుబ్రహ్మణ్యం

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

5, ఆగస్టు 2016, శుక్రవారం

బంధ కవితా మందారము. 34. శ్రీ కే.వీ.సుబ్రహ్మణ్యం

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

4, ఆగస్టు 2016, గురువారం

బంధ కవితా మందారము. 33. శ్రీ కే.వీ.సుబ్రహ్మణ్యం

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

3, ఆగస్టు 2016, బుధవారం

సాదరాహ్వానము.

2 comments

జైశ్రీరామ్.
సాదరాహ్వానము.
జైహింద్

బంధ కవితా మందారము. 32. శ్రీ కే.వీ.సుబ్రహ్మణ్యం

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

2, ఆగస్టు 2016, మంగళవారం

బంధ కవితా మందారము. 31. శ్రీ కే.వీ.సుబ్రహ్మణ్యం

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

1, ఆగస్టు 2016, సోమవారం

బంధ కవితా మందారము. 30. శ్రీ కే.వీ.సుబ్రహ్మణ్యం

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.