గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, జులై 2013, శనివారం

లలితపదముల మది లలిత గొలుతు. రచన శ్రీ అనంత కృష్ణ యన్వీ.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ యన్వీ అనంత కృష్ణ కృతమగు వరసిద్ధి వినాయక శతకము ఇంతకు ముందు చదివాము కదా! ఇప్పుడు ఆ కవి కృతమగు లలిత శతకమును కూడా చదివే అవకాశం మనకు లభించింది. మీరు కూడా చదివి మీ మీ అభిప్రాయాలను వ్రాయవలసినదిగా మనవి.



























భక్త కవి శ్రీ అనంత కృష్ణ గారికి మనః పూర్వక అభినందనలు తెలియజేయుచున్నాను.
జైహింద్.

26, జులై 2013, శుక్రవారం

మేలిమి బంగారం మన సంస్కృతి142.

1 comments

జైశ్రీరామ్
శ్లో: విద్యా ధన మదోన్మత్తః  -  యః కుర్యాత్ పితృ హేళనమ్
స యాతి నరకం ఘోరమ్  -  సర్వ ధర్మ బహిష్కృతః.
గీ: ధన విద్యల మద గర్వము
కనులకు పొర గొలిపి నిజము కానంబడమిన్
వినయము విడి తలిదండ్రుల
కినుకను గను పుత్రుఁడొందు కిల్భష జగతిన్..
భావము: విద్యా ధన మదములతో కళ్ళు గానక పొగరుబోతుదనంతో తల్లిదండ్రులనెవ్వఁడు చులకన చేయునో వాఁడు ధర్మ చ్యుతుడై నరకమున బడును.
జైహింద్.

25, జులై 2013, గురువారం

మేలిమి బంగారం మన సంస్కృతి 141.

2 comments

జైశ్రీరామ్.
శ్లో: శ్రావయేత్ మృదులాం వాణీమ్  -  సర్వదా ప్రియమాచరేత్.
పిత్రో రాజ్ఞానుసారీ స్యాత్  -  సత్ పుత్రః కుల పావనః.
గీ: పుత్రకుని చేత కులము పవిత్రమగును.
తల్లి దండ్రులు తృప్తులై తనియఁ జేయ
తీయనగు మంచి మాటలు తృప్తిఁ బలికి
వారి మాటలు పాలించి వరలవలెను. 
భావము: సత్ పుత్రుఁడే కులమును పవిత్రమొనరించు వాఁడు. పుత్రుఁడెప్పుడూ తల్లి దండ్రులతో తియ్యని చల్లని మాటలే ఆడ వలెను. వారికి ప్రియమునే చేస్తూ, వారి ఆజ్ఞను పాలించ వలెను.
జైహింద్.

24, జులై 2013, బుధవారం

వరసిద్ధి వినాయక! భక్త పాలకా! శతక రచన- శ్రీ యన్వీ అనంత కృష్ణ.

2 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ యన్వీ అనంత కృష్ణ కవి విరచిత వరసిద్ధి వినాయక భక్త పాలకా! అను మకుటముతో వ్రాసిన శతకము కడుంగడు రస రమ్యముగా నున్నందున మీముందుంచుచున్నాను. రస గ్రహణా పారీణులైన మీరునూ పఠించి మీ అభిప్రాయమును త్రెలుప గలరని ఆశించుచున్నాను. ఇక పఠించండి.

చక్కగా చదివారు కదండీ! ఇక మీ అమూల్యమైన అభిప్రాయమును తెలియ జేసి, కవిగారి కవితాజ్యోతికి ఆజ్యం పోసి ప్రజ్వలింప జేయండి.
శ్రీ యన్వీ అనంత కృష్ణ కవిగారికి నా అభినందనలు.
జైహింద్.

మేలిమి బంగారం మన సంస్కృతి 140.

3 comments

జైశ్రీరామ్.
శ్లో: మాతరమ్ పితరంచైవ  -  సాక్షాత్ ప్రత్యక్ష దేవతామ్.
మత్వా గృహీ నిషేవేత  -  సదా సర్వ ప్రయత్నతః.
గీ: తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవములిల  
దాని భావించి గేస్తు సద్భక్తితోడ
సేవలను చేసి నిరతము బ్రోవ వలెను.
సత్య, సత్వర్తనాదులు శ్రద్ధనొదవు.
భావము: కుటుంబి తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవముగా భావించుచు, అన్ని విధముల వారిని సేవింప యత్నించవలెను.
జైహింద్.

23, జులై 2013, మంగళవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 139.(త్రొమూర్త్యాత్మ దివాకరుఁడు)

1 comments

జైశ్రీరామ్.
ఆదిత్యాయ నమో నమః.
శ్లో: నమః పవిత్రే జగదేక చక్షుషే  -  జగత్ ప్రసూతి, స్థితి, నాశ హేతవే,
త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే  -  విరించి, నారాయణ, శంకరాత్మనే.
క: జగదేక చక్షు సవితకు,
జగములకన్నిటికి మూల సంస్థిత రవికిన్,
త్రిగుణాత్మగను, త్రిమూర్త్యా
త్మగ గల సూర్యునికి నుతులు మది నొనరింతున్.
భావము: జగదేక చక్షువైన సూర్య భగవానునకు నమస్కార సహస్రములు. సర్వ జగత్తుల సృష్టి స్థితి లయలకు కారణభూతుఁడై, వేద స్వరూపుఁడై, త్రిగుణాత్మకుఁడై, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాత్మకుఁడగు సవితకునా నమస్సులు అర్పించుచున్నాను.
జైహింద్.

22, జులై 2013, సోమవారం

గురు సేవా తత్పరులైన భక్త పాళికి గురుపూర్ణిమ సందర్భముగా శుభాకాంక్షలు.

2 comments

జైశ్రీరామ్.
శ్రీ గురుభ్యోనమః.
ఆర్యులారా! పరమ విశిష్టమైన గురు పూర్ణిమ నేడే. సద్గురుదేవుల శుభాశీః పరంపర మీకు లభించాలని మనసారా కోరుకొంటున్నాను.
నారాయణ సమారంభామ్  -  వ్యాస శంకర మధ్యమామ్.
అస్మదాచార్య పర్యంతమ్  -  వందే గురు పరంపరామ్.
నారాయణుడాదిగ గురు
పారావారమున మధ్య వ్యాసుండును, గం
భీరవచశ్శంకరుడును,
ధారుణి నా గురువును మది తలచి నుతింతున్. 
జైహింద్.

శ్రీ వల్లభవఝల వారి కార్తీక పురాణము. ఉత్తరార్థము.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల కృత కార్తీక పురాణము సుప్రసిద్ధ గ్రంథము. దానిని మీరు ఈ క్రింద తిలకించ వచ్చును.
సంపూర్ణం.
చూచారు కదండీ శ్రీ వల్లభవఝల వారి కార్తీక పురాణం. మీ స్పందనను తెలియ జేయ వలసినదిగా మనవి.
జైహింద్.