గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జులై 2013, గురువారం

మేలిమి బంగారం మన సంస్కృతి 141.

జైశ్రీరామ్.
శ్లో: శ్రావయేత్ మృదులాం వాణీమ్  -  సర్వదా ప్రియమాచరేత్.
పిత్రో రాజ్ఞానుసారీ స్యాత్  -  సత్ పుత్రః కుల పావనః.
గీ: పుత్రకుని చేత కులము పవిత్రమగును.
తల్లి దండ్రులు తృప్తులై తనియఁ జేయ
తీయనగు మంచి మాటలు తృప్తిఁ బలికి
వారి మాటలు పాలించి వరలవలెను. 
భావము: సత్ పుత్రుఁడే కులమును పవిత్రమొనరించు వాఁడు. పుత్రుఁడెప్పుడూ తల్లి దండ్రులతో తియ్యని చల్లని మాటలే ఆడ వలెను. వారికి ప్రియమునే చేస్తూ, వారి ఆజ్ఞను పాలించ వలెను.
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నిజమే మన సంస్కృతి మేలిమి బంగారమే .కానీ నేటి నాగరికత నీడల్లో కరిగి పోయి నడి వీధిలో నిలబడింది.. అనుబంధాలు వెల వెల బోతున్నాయి

సూర్య చెప్పారు...

క్షమించాలి, మీరు చెప్పిన పద్యభావం లోని చివరి వాక్యం పూర్తిగా అనుసరణీయం కాదు. పిల్లలు తల్లిదండ్రుల మాటలు పాలించాలి, కాని ఎంతవరకు? ఈ విషయం లో పరిమితులుంటాయి. నేటి కాలం లో అవగాహన లోపం వల్ల కొన్ని కొన్ని సార్లు తల్లిదండ్రుల నిర్ణయాలు సరైనవి కాకపోవచ్చు. అటువంటప్పుడు పిల్లలు వాటిని వ్యతిరేకించకుండా ఉండలేరు. "మాకంటే నీకెక్కువ తెలుసా" అని అంటే కొన్నిసార్లు అవును అనే సమాధానం కూడా వచ్చే అవకాశాలున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.