గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఫిబ్రవరి 2024, గురువారం

అపూర్వః కోపి కోశోఽయం ... మేలిమిబంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్. 

శ్లో. అపూర్వః కోపి కోశోఽయం

విద్యతే తవ భారతి|

వ్యయతో వృద్ధిమాయాతి

క్షయమాయాతి సఞ్చయాత్||

తే.గీ.  శారదా! నీ నిరుపమకోశగృహమందుఁ

గలుగు సంపద ఘనమమ్మ, ఖర్చుచేయ

బెఱుగుచుండును తరుగదు వింతగాను,

వాడకున్నచో వ్యర్థమౌన్వసుధపైన.

భావము.  అమ్మా సరస్వతీదేవి! నీ కోశాగారంలో ఉన్న విద్య (జ్ఞానము) అనే 

సంపద అపూర్వమైనది. అది ఖర్చు పెడితే పెరుగుతుంది, 

దాచుకుంటే/వాడకపోతే నిరుపయోగమవుతుంది.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.