గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఫిబ్రవరి 2024, గురువారం

అబ్బురమె,చేదుకాని,డబ్బు పంచ,డెబ్బదేడ్ల,ఛిన్న శోభ,దోచుకొను,సోమరత్వ దెబ్బతిను,నీతి దూర,అపాత్రదాన,నీతి నొందు,సోమరితన,అబ్బసొత్తు,కీర్తిలు "-గర్భ"-స్వేచ్ఛ వాయువుల్"-వృత్తమురచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ..

 జైశ్రీరామ్.

డబ్బు చేదు కాదు భూతలిన్!డబ్బదేలు లోకమునే!డబ్బు నీతి మార్గ
                                                                             మొందుమా!
డబ్బపాత్ర దాన దోషమౌ!డబ్బు నీతి దూర మవన్!డబ్బు దేశ సౌరు
                                                                                లార్పునే!
అబ్బ సొమ్మనంగ పంచు చోన్!అబ్బు రంబె కీర్తి కనన్!అబ్బె సోమరత్వ
                                                                             మబ్బులే!
డెబ్బదేడ్ల శోభ ఛిన్నమౌ!దిబ్బలైన విక్రయమౌ!దెబ్బ నొందు స్వేచ్ఛ
                                                                      వాయువుల్!

డెబ్బదేడ్ల=డెబ్బది యేడేండ్ల,

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"-అనిరుద్ఛందాంతర్గత
"ఉత్కృతి ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.
పాదమునకు"26"అక్షరము లుండును.యతులు,10,18,అక్షరము
లకు చెల్లును.

1,గర్భగత"-అబ్బురమె"-వృత్తము.

డబ్బు చేదు కాదు భూతలిన్!
డబ్బ పాత్ర దాన దోషమౌ!
అబ్బ సొమ్మ నంగ నిచ్చు చోన్!
డెబ్బ దేడ్ల శోభ ఛిన్నమౌ!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

2,గర్భగత"-చేదు కాని"-వృత్తము.

డబ్బ దేలు లోకమునే!
డబ్బు నీతి దూర మవన్!
అబ్బు రంబె కీర్తి కనన్!
దిబ్బ లైన విక్రయమౌ!

అభిజ్ఞా ఛందము నందలి"-అనుష్టుప్"ఛందము లోనిది
ప్రాసనియమము కలదు.పాదమునకు8,అక్షరము లుండును,

3,గర్భగత"-సొమ్మనీయ"-వృత్తము.

డబ్బు నీతి నొంద సౌఖ్యమౌ!
డబ్బు దేశ సౌరు లార్పులే!
అబ్బె సోమరత్వ మబ్బులే!
దెబ్బ నొందు స్వేచ్ఛ వాయువుల్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

4,గర్భగత"-డెబ్బ దేడ్ల"-వృత్తము.

డబ్బు చేదు కాదు భూతలిన్!డబ్బ దేలు లోకమునే!
డబ్బపాత్ర దాన దోషమౌ!డబ్బు నీతి దూర మవన్!
అబ్బ సొమ్మనంగ నిచ్చు చోన్!అబ్బు రంబె కీర్తి కనన్!
డెబ్బదేడ్ల శోభ ఛిన్నమౌ!దిబ్బ లైన విక్రయమౌ!

అణిమా ఛందమునందలి"-అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 17,అక్షరము లుండును.
యతి,10 వయక్షయరమునకు చెల్లును.

5,గర్భగత"-ఛిన్న శోభ"-వృత్తము.

డబ్బ దేలు లోకమునే!డబ్బు చేదు కాదు భూతలిన్!
డబ్బు నీతి దూర మవన్!డబ్బపాత్ర దాన దోషమౌ!
అబ్బురంబె కీర్తి కనన్!అబ్బ సొమ్మనంగ నిచ్చు చోన్!
దిబ్బ లైన విక్రయమౌ!డెబ్బ దేడ్ల శోభ ఛిన్నమౌ!

అణిమా ఛందమునందలి"అత్యష్టి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,9,వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-దోచుకొను"-వృత్తము.

డబ్బు చేదు కాదు భూతలిన్!డబ్బు  నీతి నొంద సౌఖ్యమౌ!
డబ్బపాత్ర దాన దోషమౌ!డబ్బు దేశ సౌరు లార్పునే!
అబ్బ సొమ్మనంగ నిచ్చుచోన్!అబ్బె సోమరత్వ మబ్బులే!
డెబ్బదేడ్ల శోభ ఛిన్నమౌ!దెబ్బ నొందు స్వేచ్ఛ వాయువుల్!

అణిమా ఛందము నందలి "ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-సోమరత్వ"-వృత్తము.

డబ్బు నీతి నొంద సౌఖ్యమౌ!డబ్బు చేదు కాదు భూతలిన్!
డబ్బు దేశ సౌరు లార్పునే! డబ్బపాత్ర దాన దోషమౌ!
అబ్బె సోమరత్వ మబ్బులే!అబ్బ సొమ్మనంగ నిచ్చు చోన్!
దెబ్బ నొందు స్వేచ్ఛ వాయువుల్!డెబ్బదేడ్ల శోభ ఛిన్నమౌ!

అణిమా ఛందము నందలి"-ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18,అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-దెబ్బతిను"-వృత్తము

డబ్బ దేలు లోకమునే!డబ్బు నీతి నొంద సౌఖ్యమౌ!
డబ్బు నీతి దూరమవన్!డబ్బు దేశ సౌరు లార్పునే!
అబ్బు రంబె కీర్తి కనన్!అబ్బె సోమరత్వ మబ్బులే!
దిబ్బలైన విక్రయమౌ!దెబ్బ నొందు స్వేచ్ఛ వాయువుల్!

అణిమా ఛందమునందలి"-అత్యష్టి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9,వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-నీతిదూర"-వృత్తము.

డబ్బు నీతి నొంద సౌఖ్యమౌ!డబ్బ దేలు లోకమునే!
డబ్బు దేశ సౌర లార్పునే!డబ్బు నీతి దూరమవన్!
అబ్బె సోమరత్వ మబ్బులే!అబ్బు రంబె కీర్తి కనన్!
దెబ్బ నొందు స్వేచ్ఛ వాయువుల్!దిబ్బలైన విక్రయమౌ!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి 10,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-అపాత్రదాన"-వృత్తము.

డబ్బ దేలు లోకమునే!డబ్బు చేదు కాదు భూతలిన్!డబ్బు నీతి నొంద
                                                                                   సౌఖ్యమౌ!
డబ్బు నీతి దూర మవన్!డబ్బపాత్ర దాన దోషమౌ!డబ్బు దేశ సౌరు
                                                                                  లార్పునే!
అబ్బురంబె కీర్తి కనన్!అబ్బ సొమ్మనంగ నిచ్చుచోన్!అబ్బె సోమరత్వ
                                                                               మబ్బులే!
దిబ్బలైన విక్రయమౌ!డెబ్బదేడ్ల శోభ ఛిన్నమౌ!దెబ్బ నొందు స్వేచ్ఛ
                                                                          వాయువుల్!  

అనిరుద్ఛందము నందలి"-  ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును.

11,గర్భగత"-నీతి నొందు"-వృత్తము.

డబ్బు చేదు కాదు భూతలిన్!డబ్బు నీతి నొంద సౌఖ్యమౌ!డబ్బదేలు
                                                                                లోకమునే!
డబ్బపాత్ర దాన దోషమౌ!డబ్బు దేశ సౌరు లార్పునే!డబ్బు నీతి దూర
                                                                                  మవన్!
అబ్బ సొమ్మనంగ నిచ్చు చోన్!అబ్బె సోమరత్వ మబ్బులే!అబ్బురంబె
                                                                              కీర్తి కనన్!
డెబ్బ దేడ్ల శోభ ఛిన్నమౌ!దిబ్బ లైన విక్రయమౌ!దెబ్బ నొందు స్వేచ్ఛ
                                                                       వాయువుల్!

అనిరుద్ఛందమునందలి,ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "26"అక్షరములుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.

12,గర్భగత"-సోమరితన"-వృత్తము.

డబ్బు నీతి నొంద సౌఖ్యమౌ!డబ్బు చేదు కాదు భూతలిన్!డబ్బ దేలు
                                                                             లోకమునే!
డబ్బు దేశ సౌరు లార్పునే!డబ్బ పాత్ర దాన దోషమౌ!డబ్బు నీతి
                                                                        దూరమవన్!
అబ్బె సోమరత్వ మబ్బులే!అబ్బ సొమ్మనంగ నిచ్చు చోన్!అబ్బురంబె
                                                                            కీర్తి కనన్!
దిబ్బలైన విక్రయ మౌ!డెబ్బ దేడ్ల శోభ ఛిన్నమౌ!దెబ్బ నొందు స్వేచ్ఛ
                                                                        వాయువుల్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.

13,గర్భగత"-అబ్బసొత్తు"-వృత్తము.

డబ్బ దేలు లోకమునే!డబ్బు నీతి నొంద సౌఖ్యమౌ!డబ్బు చేదు కాదు
                                                                              భూ తలిన్!
డబ్బు నీతి దూర మవన్!డబ్బు దేశ సౌరు లార్పునే!డబ్బపాత్ర దాన
                                                                                దోషమౌ!
అబ్బురంబె కీర్తి కనన్!అబ్బె సోమరత్వ మబ్బులే!అబ్బ సొమ్మనంగ
                                                                            నిచ్చుచోన్!
దిబ్బ లైన విక్రయమౌ!దెబ్బనొందు స్వేచ్ఛ వాయువుల్!డెబ్బ దేడ్ల
                                                                     శోభ ఛిన్నమౌ!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును.

14,గర్భగత"-కీర్తిలు"-వృత్తము.

డబ్బు నీతి నొంద సౌఖ్యమౌ!డబ్బ దేలు లోకమునే!డబ్బు చేదు కాదు
                                                                                భూతలిన్!
డబ్బు దేశ సౌరు లారుపునే!డబ్బు నీతి దూర మవన్!డబ్బపాత్ర దాన
                                                                                   దోషమౌ!
అబ్బె సోమరత్వ మబ్బులే!అబ్బురంబె కీర్తి కనన్!అబ్బ సొమ్మనంగ
                     :                                                         నిచ్చుచోన్!
దెబ్బనొందు స్వేచ్ఛ వాయువుల్!దిబ్బలైన విక్రయమౌ!డెబ్బ డేడ్ల శోభ
                                                                               ఛిన్నమౌ!

అనిరుద్ఛందము నందలి,ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26,అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.