గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, ఫిబ్రవరి 2024, సోమవారం

కావరె,పోరాడు,జవహీన,గర్భ"-వెతలు మాపు"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

జైశ్రీరామ్.

 తీరు లేదు తెన్ను లేదు!తీరు తెన్ను లసలె లేవు!తీరు గూర్చి గావుమా హరీ!

నేర మేమి చేయలేదు!నేర గాడి నసలె కాను!నీర జాక్ష దక్షు డీవె గా!
భూరి సత్వ దైవ మీవు!పోర నాకు జవము లేదు!భూరి దక్షిణంబు లేదయా!
ఘోర కాటకాలు బాపుక్రూర జీవ వెతలు మాపు!కోరె దేను ముక్తి మార్గమున్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"-అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి"-
ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరము లకు చెల్లును.

1,గర్భగత"-తీరు"-వృత్తము.

తీరు లేదు తెన్ను లేదు!
నేరమేమి చేయ లేదు!
భూరి సత్వ దైవమీవు!
ఘోర కాటకాలు బాపు!

అభిజ్ఞాఛందము నందలి"అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.

2,గర్భగత"-తెన్ను లేని"-వృత్తము.

తీరు తెన్ను లసలె లేవు!
నేరగాడి నసలె కాను!
పోర నాకు జవము లేదు!
క్రూర జీవ వెతలు మాపు!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

3,గర్భగత"-నేరుగా"-వృత్తము.

తీరు గూర్చి కావుమా హరీ!
నీరజాక్ష దక్షు డీవె గా!
భూరి దక్షిణంబు లేదయా!
కోరె దేను ముక్తి మార్గమున్!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతీ"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

4,గర్భగత"-జవము"-వృత్తము.

తీరు లేదు తెన్ను లేదు!తీరు తెన్ను లసలె లేవు!
నేరమేమి చేయ లేదు!నేరగాడి నసలె కాను!
భూరి సత్వ దైవ మీవు!పోర నాకు జవము లేదు!
ఘోర కాటకాలు బాపు!క్రూర జీవ వెతలు మాపు!

అణిమా"-ఛందమునందలి "అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,9,వ యక్షరము నకు చెల్లును.

5,గర్భగత"-తెరగు"-వృత్తము.

తీరు తెన్ను లసలె లేవు!తీరు లేదు తెన్ను లేదు!
నేరగాడి నసలె కాను!నేరమేమి చేయ లేదు!
పోర నాకు జవము లేదు!భూరి సత్వ దైవ మీవు!
క్రూర జీవ వెతలు మాపు!ఘోర కాటకాలు బాపు!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరము నకు చెల్లును.

6,గర్భగత"-భూరిదా"-వృత్తము.

తీరు లేదు తెన్ను లేదు!తీరు గూర్చి కావుమా హరీ!
నేర మేమి చేయ లేదు!నీర జాక్ష దక్షు డీవె గా!
భూరి సత్వ దైవ మీవు!భూరి దక్షిణంబు లేదయా!
ఘోర కాటకాలు బాపు!కోరె దేను ముక్తి మార్గమున్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది.
పాదమునకు"17"అక్షరము లుండును.ప్రాసనియమము కలదు.
యతి"9,వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-దక్షిణా"-వృత్తము..

తీరు గూర్చి కావుమా హరీ!తీరు లేదు తెన్ను లేదు!
నీర జాక్ష దక్షు డీవె గా!నేర మేమి చేయ లేదు!
భూరి దక్షిణంబు లేదయా!భూరి సత్వ దైవ మీవు!
కోరె దేను ముక్తి మార్గమున్!ఘోర కాటకాలు బాపు!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరము నకు చెల్లును.

8,గర్భగత"-నీరజాక్ష"-వృత్తము.

తీరు తెన్ను లసలె లేవు!తీరు గూర్చి  గావుమా హరీ!
నేర గాడి నసలె కాను!నీర జాక్ష దక్షు డీవెగా!
పోర నాకు జవము లేదు!భూరి దక్షిణంబు లేదయా!
క్రూర జీవ వెతలు మాపు!కోరె దేను ముక్తి మార్గమున్!

అణిమా ఛందము నందలి"ధృతి"-ఛందము లోనిది.
పాదమునకు"18"అక్షరము లుండును..ప్రాసనియమము కలదు.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-జీవన"-వృత్తము.

తీరు గూర్చి కావుమా హరీ!తీరు తెన్ను లసలె లేవు!
నీరజాక్ష దక్షు డీవె గా!నేరగాడి నసలె కాను!
భూరి దక్షిణంబు లేదయా!పోర నాకు జవము లేదు!
కోరె దేను ముక్తి మార్గమున్!క్రూర జీవ వెతలు మాపు!

అణిమా ఛందము నందలి"-ధృతి "ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి 10,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-సత్వము"-వృత్తము.

తీరు తెన్ను లసలె లేవు!తీరు లేదు తెన్ను లేదు!తీరు గూర్చి కావుమా హరీ!
నేరగాడి నసలె కాను!నేర మేమి చేయ లేదు!నీరజాక్ష దక్షు డీవె గా!
పోర నాకు జవము లేదు!భూరి సత్వ దైవ మీవు!భూరి దక్షిణంబు లేదయా!
క్రూర జీవ వెతలు మాపు!ఘోర కాటకాలు బాపు!కోరె దేను ముక్తి మార్గమున్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"-26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరము లకు చెల్లును.

11,గర్భగత"-తత్వము"-వృత్తము.

తీరు లేదు తెన్ను లేదు!తీరు గూర్చి కావుమా హరీ!తీరు తెన్ను లసలె లేవు!
నేరమేమి చేయ లేదు!నీర జాక్ష దక్షు డీవెగా!నేరగాడి నసలె కాను!
భూరి సత్వ దైవ మీవు!భూరి దక్షిణంబు లేదయా!పోర నాకు జవము లేదు!
ఘోర కాటకాలు బాపు!కోరె దేను ముక్తి మార్గమున్!క్రూర జీవ వెతలు మాపు!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"9,18,అక్షరము లకు చెల్లును.

12,గర్భగత"-కావవె"-వృత్తము.

తీరు గూర్చి కావుమా హరీ!తీరు లేదు తెన్ను లేదు!తీరు తెన్ను లసలె లేవు!
నీరజాక్ష దక్షు డీవె గా!నేర మేమి చేయ లేదు!నేర గాడి నసలె కాను!
భూరి దక్షిణంబు లేదయా!భూరి సత్వ దైవ మీవు!పోర నాకు జవము లేదు!
కోరె దేను ముక్తి మార్గమున్!ఘోర కాటకాలు బాపు!క్రూర జీవ వెతలు మాపు!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.

13,గర్భగత"-పోరాడ"-వృత్తము.

తీరు తెన్ను లసలె లేవు!తీరు గూర్చి కావుమా హరీ!తీరు  లేదు తెన్ను లేదు!
నేరగాడి నసలె కాను!నీర జాక్ష దక్షు డీవె గా!నేర మేమి చేయ లేదు!
పోర నాకు జవము లేదు!భూరి దక్షిణంబు లేదయా!భూరి సత్వ దైవ మీవు!
క్రూర జీవ వెతలు మాపు!కోరె దేను ముక్తి మార్గమున్!ఘోర కాటకాలు బాపు!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరము లకు చెల్లును.

14,గర్భగత"-జవహీన"-వృత్తము.

తీరు గూర్చి గావుమా హరీ!తీరు తెన్ను లసలె లేవు!తీరు లేదు తెన్ను లేదు!
నీరజాక్ష దక్షు డీవెగా!నేరగాడి నసలె కాను!నేర మేమి చేయ లేదు!
భూరి దక్షిణంబు లేదయా!పోర నాకు జవము లేదు!భూరి సత్వ దైవ మీవు!
కోరె దేను ముక్తి మార్గమున్!క్రూర జీవ వెతతలు మాపు!ఘోల కాటకాలు బాపు!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరము లకు చెల్లును.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.