గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఫిబ్రవరి 2024, బుధవారం

నెంచు,మది మెత్తన,కత్తి సాము,పత్తి వాస,సమస్త,కోరుమి,గర్భ"-ముక్తిదా"-వృత్తము. రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.

 చీల నీకుమి సఖ్యతన్!చేర బోకుమి దుర్మదంబున్!చిత్తజాహితు గొల్వు భక్తిన్!

మేలు గోరుమి సర్వమున్!మీర కేగుమి నీతి శాంతిన్!మెత్తనౌ మది నిల్పు చిత్తమ్!
కాల దోషము నంట నీకన్!కారు కూతలు కూయ బోకుమ్!కత్తి సాముకి నిచ్ఛ మానుమ్!
బాల చైదము వీడుమా!పౌరహక్కుల గావు మెల్లన్!పత్తి వాసుని ముక్తి కోరుమ్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"-అనుష్టుప్ఛందాంతర్గత"-ఉత్కృతి"-
ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరము లకు చెల్లును.

1,గర్భగత"-సఖ్యతా"-వృత్తము.

చీల నీకుమి సఖ్యతన్!
మేలు గోరుమి సర్వమున్!
కాల దోషము నంట నీకన్!
బాల చైదము వీడుమా!

అభిజ్ఞా ఛందము నందలి,అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.

2,గర్భగత"-చీలనీకు"-వృత్తము.

చేర బోకుమి దుర్మదంబున్!
మీర కేగుమి నీతి శాంతిన్!
కారు కూతలు కూయ బోకుమ్!
పౌర హక్కులు గావు మెల్లన్!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

3,గర్భగత"-మేలను"-వృత్తము.

చిత్త జాహితు గొల్వు భక్తిన్!
మెత్తనౌ మది నిల్పు చిత్తమ్!
కత్తి సాముకు నిచ్ఛ మానుమ్!
పత్తి వవాసుని ముక్తి గొల్వుమ్!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదము నకు"9"అక్షరము లుండును.

4,గర్భగత"-దోషతా"-వృత్తము.

చీల నీకుమి సఖ్యతన్!చేర బోకుమి దుర్మదంబున్!
మేలు గోరుమి సర్వమున్!మీర కేగుమి నీతి శాంతిన్!
కాల దోషము నంటకన్!కారు కూతలు కూయ బోకుమ్!
బాల చైదము వీడుమా!పౌర హక్కుల గావు మెల్లన్!

అణిమా ఛందమునందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును.
యతి.9,వ యక్షరము నకు చెల్లును.

5,గర్భగత"-చైదము"-వృత్తము.

చేర బోకుమి దుర్మదంబున్!చీల నీకుమి షఖ్యతన్!
మీర కేగుమి నీతి శాంతిన్!మేలు గోరుమి సర్వమున్!
కారు కూతలు కూయ బోకుమ్!కాల దోషము నంటకన్!
పౌర హక్కుల గావు మెల్లన్!బా ల చైదము వీడుమా!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరము నకు చెల్లును.

6,గర్భగత"-మీరకు"-వృత్తము.

చీల నీకుమి సఖ్యతన్!చిత్త జాహితు గొల్వు భక్తిన్!
మేలు గోరుమి సర్వమున్!మెత్తనౌ మది నిల్పు చిత్తమ్!
కాల దోషము నంటకన్!కత్తి సాముకు నిచ్ఛ మానుమ్!
బాల చైదము వీడుమా!పత్తి వాసుని ముక్తి గొల్వుమ్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
పాదమునకు"17"అక్షరము లుండును.ప్రాసనియమము కలదు.
యతి"9,వ యక్షరమునకు చెల్లును.

7,,గర్భగత"-కారుకూతలు"-వృత్తము.

చిత్తజాహితు గొల్వు భక్తిన్!చీల నీకుమి సఖ్యతన్!
మెత్తనౌ మది నిల్పు చిత్తమ్!మేలు గోరుమి సర్వమున్!
కత్తి సాముకు నిచ్ఛ మానుమ్!కాల దోషము నంటకన్!
పత్తి వాసుని ముక్తి గొల్వుమ్!బాల చైదము వీడుమా!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-దుర్మద'-వృత్తము.

చేర బోకుమి దుర్మదంబున్!చిత్త జాహితు గొల్వు భక్తిన్!
మీర కేగుమి నీతి శాంతిన్!మెత్తనౌ మది నిల్పు చిత్తమ్!
కారు కూతలు కూయ బోకుమ్!కత్తి సాముకు నిచ్ఛ మానుమ్!
పౌర హక్కులు గావు మెల్లన్!పత్తి వాసుని ముక్తి గొల్వుమ్!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-నీతి నెంచు"-వృత్తము.

చిత్త జాహితు గొల్వు భక్తిన్!చేర బోకుమి దుర్మదంబున్!
మెత్తనౌ మది నిల్పు చిత్తమ్!మీర కేగుమి నీతి శాంతిన్!
కత్తి సాముకు నిచ్ఛ మానుమ్!కారు కూతలు కూయ బోకుమ్!
పత్తి వాసుని ముక్తి గొల్వుమ్!పౌర హక్కులు గావు మెల్లన్!

అణిమా ఛందము నందలి"-ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదుపాదమునకు"18"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరము నకుఉ చెల్లును.

10,గర్భగత"-మది మెత్తన"-వృత్తము.

చేర బోకుమి దుర్మదంబున్!చీల నీకుమి సఖ్యతన్!చిత్తజాహితు గొల్వు భక్తిన్!
మీర కేగుమి నీతి శాంతిన్!మేలు గోరుమి సర్వమున్!మెత్తనౌ మది నిల్పు చిత్తమ్!
కారు కూతలు కూయ బోకుమ్!కాల దోషము నంటకన్!కత్తి సాముకి నిచ్ఛ మానుమ్!
పౌర హక్కులు గావు మెల్లన్!బాల చైదము వీడుమా!పత్తి వాసుని ముక్తి గొల్వుమ్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.

11,గర్భగత"-కీర్తి దామ"-వృత్తము.

చీల నీకుమి సఖ్యతన్!చిత్తజాహితు గొల్వు భక్తిన్!చేర బోకుమి దుర్మదంబున్!
మేలు గోరుమి సర్వమున్!మెత్తనౌ మది నిల్పు చిత్తమ్!మీర కేగుమి నీతి శాంతిన్!
కాల దోషము నంటకన్!కత్తి సామును నిచ్ఛ మానుమ్!కారు కూతలు కూయ బోకుమ్!
బాల చైదము వీడుమా!పత్తి వాసుని ముక్తి గొల్వుమ్!పౌర హక్కులు గావు మెల్లన్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరము లకు చెల్లును.

12,గర్భగత"-పత్తి వాస"-వృత్తము.

చిత్తజాహితు గొల్వ భక్తిన్!చీల నీకుమి సఖ్యతన్!చేర బోకుమి దుర్మదంబున్!
మెత్తనౌ మది నిల్పు చిత్తమ్!మేలు గోరుమి సర్వమున్!మీర కేగుమి నీతి శాంతిన్!
కత్తి సామును నిచ్ఛ మానుమ్!కాల దోషము నంటకన్!కారు కూతలు కూయ బోకుమ్!
పత్తి వాసుని ముక్తి గొల్వుమ్!బాల చైదము వీడుమా!పౌర హక్కులు గావు మెల్లన్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాథమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరము లకు చెల్లును.

13,గర్భగత"-సమస్త"-వృత్తము.

చేర బోకుమి దుర్మదంబున్!చిత్తజాహితు గొల్వు భక్తిన్!చీల నీకుమి సఖ్యతన్!
మీర కేగుమి నీతి శాంతిన్!మెత్తనౌ మది నిల్పు సత్యమ్!మేలు గోరుమి సర్వమున్!
కారు కూతలు కూయ బోకుమ్!కత్తి సామును నిచ్ఛ మానుమ్!కాలదోషము నంటకన్!
పౌర హక్కులు గావు మెల్లన్!పత్తి వాసుని ముక్తి గొల్వుమ్!బాల చైదము వీడుమా!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరము లకు చెల్లును.

14,గర్భగత"-కోరుమి"-వృత్తము.

చిత్తజాహితు గొల్వు భక్తిన్!చేర బోకుమి దుర్మదంబున్!చీల నీకుమి సఖ్యతన్!
మెత్తనౌ మది నిల్పు సత్యమ్!మీర కేగుమి నీతి శాంతిన్!మేలు గోరుమి సర్వమున్!
కత్తి సామును నిచ్ఛ మానుమ్!కారు కూతలు కూయ బోకుమ్!కాలదోషము నంటకన్!
పత్తి వాసుని ముక్తి గొల్వుమ్!పౌర హక్కులు గావు మెల్లన్!బాల చైదము వీడుమా!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరము లకు చెల్లును.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.