గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఫిబ్రవరి 2024, గురువారం

చేరనీవె,శూన్యగతి,కాలచక్ర,నిండు బుద్ధి,నీలకంఠ,స్తోత్రతా,నీడనీయు,రక్షకా, జీవితం,ఫాలనేత్ర,చిక్కి నాడ,స్తుతించు,కోరుట,గంగేశా,"-గర్భ"-మృగతృష్ణ"- వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరింహ మూర్తి జుత్తాడ..

జైశ్రీరామ్.

ఎండమావి జీవితం బయెన్!ఏల చేరనీవు?సన్నిధిన్!ఏడ జూడ నీవే సుమా!

పండుటాకు  నైతి నే నిలన్!ఫాల నేత్ర మల్లికార్జునా!పాడె దేను నీ స్తోత్రముల్!

కండపుష్టి శూన్య మాయెనే!కాలచక్ర మందు జిక్కితిన్!గాడినిల్పి రక్షింపుమా!

నిండుబుద్ధి నిన్ను కొల్చెదన్!నీలికంఠ గంగమేశ్వరా!నీడ నిచ్చి కాపాడుమా!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి"

ఛందము లొనిరి.ప్రాస నియమము కలదు.పాదమునకు 26,అక్షరము లుండును.యతులు"10,19,అక్షరములకు చెల్లును.

1.గర్భగత"-చేర నీవె"-వృత్తము.

ఎండమావి జీవితం బయెన్!
పండుటాకు నైతి నేనిలన్!
కండ పుష్టి శూన్య మాయెనే!
నిండు బుద్ధి నిన్ను కొల్చెదన్!

అభిజ్ఞా ఛందమునందలి"బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

2,గర్భగత"-శూన్యగతి"-వృత్తము.

ఏల చేర నీవు?సన్నిధిన్!
ఫాల నేత్ర మల్లి కార్జునా!
కాలచక్ర మందు చిక్కితిన్!
నీలి కంఠ జంగమేశ్వరా!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు "9"అక్షరము లుండును.

3,గర్భగత"-కాలచక్ర"-వృత్తము.

ఏడ జూడ నీవే  !సుమా!
పాడె దేను నీ స్తోత్రముల్!
గాడి నిల్పి రక్షింపుమా!
నీడ నిచ్చి కాపాడుమా!

అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.

4,గర్భగత"-నిండు బుద్ధి"-వృత్తము.

ఎండమావి జీవితంబయెన్!ఏల చేరనీవు?సన్నిధిన్!
పండుటాకు నైతి నే నిలన్!ఫాల నేత్ర మల్లి కార్జునా!
కండ పుష్టి శూన్య మాయెనే!కాల చక్రమందు చిక్కితిన్!
నిండుబుద్ధి నిన్ను  కొల్చెదన్!నీలి కంఠ గంగ మేశ్వరా!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-నీలికంఠ"వృత్తము.

ఏల చేరనీవు?సన్నిధిన్!ఏడ చూడ నీవే సుమా!
ఫాల నేత్ర మల్లి కార్జునా!పాడె దేను నీ స్తోత్రముల్!
కాల చక్ర మందు చిక్కితే!గాడి నిల్పి రక్షింపుమా!
నీలికంఠ గంగ మేశ్వరా!నీడ నిచ్చి కాపాడుమా!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము  లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-స్తోత్రతా"వృత్తము.

ఏడ చూడ నీవే సుమా!ఏల చేర నీవు సన్నిధిన్?
పాడె దేను నీ స్తోత్రముల్!ఫాల నేత్ర మల్లి కార్జునా!
గాడి నిల్పి రక్షింపుమా!కాల చక్ర మందు చిక్కితే!
నీడ  నిచ్చి కాపాడుమా!నీలికంఠ గంగ మేశ్వరా!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరములుండును.
యతి9,వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-నీడ నీయు"-వృత్తము.

ఏడ చూడ నీవే సుమా!ఎండమావి జీవితం బయెన్!
పాడె దేను నీ స్తోత్రముల్!పండుటాకు నైతి నే నిలన్!
గాడి నిల్పి రక్షింపుమా!కండ పుష్టి శూన్య మాయెనే!
నీడ నిచ్చి కాపాడుమా!నిండు బుద్ధి నిన్ను గొల్చెదన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు17"అక్షరము లుండును.
యతి"9,వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-రక్షకా వృత్తము.

ఎండమావి జీవితం బయెన్!ఏడ చూడ నీవే సుమా!
పండు టాకు నైతి నే నిలన్! పాడె దేను నీ స్తోత్రముల్!
కండ పుష్టి శూన్య మాయెనే!గాడి నిల్పి రక్షింపుమా!
నిండు బుద్ధి నిన్ను గొల్చెదన్!నీడ నిచ్చి కాపాడుమా!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమనకు17,అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-జీవితం"-వృత్తము

.ఏల చేర నీవు సన్నిధిన్?ఎండమావి జీవితం బయెన్!
ఫాల నేత్ర మల్లి కార్జునా!పండు టాకు నైతి నే నిలన్!
కాల చక్ర మందు చిక్కితే!కండ పుష్టి శూన్య మాయెనే!
నీలికంఠ గంగ మేశ్వరా!నిండు బుద్ధి నిన్ను గొల్చెదన్!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది..
ప్రాసనియమము కలదు.పాదమునకు18,అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-ఫాలనేత్ర వృత్తము.

ఏల చేరనీవు సన్నిధిన్?ఏడ చూడ నీవే సుమా!ఎండమావి జీవితంబయెన్!
ఫాలనేత్ర మల్లికార్జునా!పాడె దేను నీస్తోత్రముల్!పండుటాకు నైతి నే నిలన్!
కాలచక్ర మందు చిక్కితే!గాడి నిల్పి రక్షింపుమా!కండ పుష్టి శూన్యమాయెనే!
నీలికంఠ గంగ మేశ్వరా!నీడ నిచ్చి కాపాడుమా!నిండు బుద్ధి నిన్ను గొల్చెదన్!

అనిరుద్ఛందమునందలి"-ఉత్కృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,26,అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.

11,గర్భగత"-చిక్కినాడ"-వృత్తము.

ఏడ జూడ నీవే సుమా!ఏల చేరనీవు సన్నిధిన్!ఎండమావి జీవితం బయెన్!
పాడెదేను నీ స్తోత్రముల్!ఫాలనేత్ర మల్లికార్జునా!పండుటాకు నైతి నేనిలన్!
గాడినిల్పి రక్షింపుమా!కాలచక్ర మందు చిక్కితే!కండ పుష్టి శూన్య మాయెనే!
నీడ నిచ్చి కాపాడుమా!నీలికంఠ గంగ మేశ్వరా!నిండుబుద్ధి నిన్ను గొల్చెదన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు.9,18;అక్షరములకు చెల్లును.

12,గర్భగత"-స్తుతించు"-వృత్తము.

ఏడ చూడ నీవే సుమా!ఎండమావి జీవితం బయెన్!ఏల చేరనీవు సన్నిధిన్!
పాడె దేను నీస్తోత్రముల్!పండుటాకు నైతి నే నిలన్!ఫాల నేత్ర మల్లికార్జునా!
గాడి నిల్పి రక్షింపుమా!కండ పుష్టి శూన్యమాయెనే!కాలచక్ర మందు చిక్కితే!
నీడనిచ్చి కాపాడుమా!నిండుబుద్ధి నిన్ను గొల్చెదన్!నీలికంఠ గంగ మేశ్వరా!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును.

13,గర్భగత"-కోరుట"-వృత్తము.

ఏల చేరనీవు సన్నిధిన్!ఎండమావి జీవితం బయెన్!ఏడ చూడ నీవే సుమా!
ఫాలనేత్ర మల్లికార్జునా!పండుటాకు నైతి నే నిలన్!పాడె దేను నీ స్తోత్రముల్!
కాలచక్రమందు చిక్కితే!కండ పుష్టి శూన్యమాయెనే!గాడినిల్పి రక్షింపుమా!
నీలి కంఠ గంగమేశ్శరా!నిండుబుద్ధి నిన్ను గొల్చెదన్!నీడ నిచ్చి కాపాడుమా!

అనిరుద్ఛందమునందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"10,19,అక్షరములకు చెల్లును.

14,గర్భగత"-గంగేశ"-వృత్తము.

ఎండమావి జీవితం బయెన్!ఏడ చూడ నీవే సుమా!ఏల చేరనీవు సన్నిధిన్?
పండుటాకు నైతి నే నిలన్!పాడె దేను నీస్తోత్రముల్!ఫాల నేత్ర మల్లికార్జునా!
కండపుష్టి శూన్యమాయెనే!గాడి నిల్పి రక్షింపుమా!కాలచక్రమందు చిక్కితే!
నిండుబుద్ధి నిన్ను గొల్చెదన్!నీడనిచ్చి కాపాడుమా!నీలికంఠ గంగమేశ్వరా!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.