గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఫిబ్రవరి 2024, బుధవారం

పుష్పవిలాపము ... రచన : ACPSastry ... 4 ఆగ, 2016, గురు 2:19 AM

జైశ్రీరామ్.

 పుష్పవిలాపము 



తే .. బుద్ధదేవుని పూజింప బోవుచున్న 
       నాదు  వెనుకను పిలుచుచు నన్నుతాకి 
       గాలి పిలిచినటులసడి గాగ తిరిగి 
       జూడ కానబడియె నొక్క సుమము కన్నె 

తే ..  వట్టి చేతుల తోడ దైవతమునుగన
         బోవ నొప్పునటయ్య నీ బుద్ధి యిట్లు 
         వికట గతి బొంద నగునయ్య విమలమయిన 
         భారతమునందు నీపూజ గోర రెవరు 

తే ..   రిక్త హస్తము తోడను నృపుల గురువు 
          దైవ తంబుల  జూచుట తగదు తప్ప 
          టంచు శాస్త్రముల్ పలుకగా నార్య సమితి 
          చెప్పగా విని నీవిట్లు చేయనగునొ  

తే ..   తల్లి వృక్షము వయసుతో నుల్ల మలర 
         సూర్య కిరణాల సంగతి సుఖము గదుర 
          పుటుకనో చితిమయ్య నీ పుడమి బలము 
          తోడ సర్వ ఋతువులందు తోరముగను


తే ...   మాకు మాత్రము దేవుని మహిమలన్ని 
           కన్నులారంగ జూడంగ కాంక్ష లేదొ 
          చంద్రవదనల శిరసున సార రుచుల 
          పీఠ మెక్కగ మాయెద పేర్మిలేదొ 

తే ..   ఎవరు కనకుండ వినకుండ నేటి దారి 
         పుట్టిపెరిగి కడకుమేము  గిట్టుటేన 
          బ్రహ్మ మా నొసటను బట్టి వ్రాసినట్టి 
          వ్రాత మీరు చదువగల్గు వారొ ! ఔనొ ! 
               
తే ...... కదల లేని వారము మేము కనికరమున 
           నెవరు చేగొని నను కాదనియన బోము 
           మీరు దేవుని పూజల సౌరు మీర
           మమ్ముబోOట్లను దరిజేర్చు మనుజులెవరు 

తే ...   ఇప్పటి కినైన మించిన దేమిలేదు 
          మమ్ము గోయుచు మీ సజ్జ సొమ్ముగాగ
         బోల్చి గొనిపొండు బుద్ధుని పూజ కొరకు 
         పరుల పూజకు గాదెమా విరులు ధరణి 

తే..  ఋతువు నందున పూవులు  జతను గోరు 
        ధరణి యందు పరులకైన విరులు తాము 
        అర్ప ణముజేసి కొనునట్టి యర్హజాతి 
        అట్టి భాగ్యము పోగొట్ట నర్హులెవరు 


రచన : ACPSastry 
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.