గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఫిబ్రవరి 2024, గురువారం

తమాశ్రి,రామనీ,ఖండనా,విక్రమక్రమా,తమోరమా,రమతమా,తమాశ్రజా,సాధ్యమా,తమరేయను,రణమాయె,రమాశ్రితా,సద్యుతమగు,రమోధ్యమ,రణోత్తమా,సజ్జతా,రుణభార,తమోదమాశ్రిత,రమాంగిర,సృజామ్యహం,రమోత్తమసా,సౌజన్య,తామరస,జిత రమా,అమాయక,అన్యోభయ,భారయా,తమి బాపు,రమాంబు ధీర, రసభర,"-గర్భ"-రసోద్దిపిత"-వృత్తమురచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

 జైశ్రీరామ్.

ఉద్దండ పిండాలున్!యుర్వినే శాశింపన్!ఒరిగేది లేదిలన్!ఊంచ వృత్తియె    
                                                                                          సుమా!
తద్దాశ్య సంకెళ్ళున్!తర్వు నాశాంతంబున్!తరు గౌను శ్రీలికన్!దంచ వత్తురు
                                                                                         రిపుల్!
బుద్ధిం గనం దూష్యమ్!పూర్వ శోభ ల్జారున్!పూర్వ కీర్తి లొల్లయౌ!పొంచి
                                                                               సత్యం గనున్!
గద్దించు నాదంబున్!గర్వమే కాల్జేర్చున్ !కరదీప్తు లంతమౌ!కంచి కేగును
                                                                                          కధల్!

సృజనాత్మక గర్భకవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందము నందలి
ఉత్కృతి"-ఛందము లోనిది.ర,న,భ,ర,య,య,మ,ర,గగ,గణము
లుండును.ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము
లుండును.యతులు" 13,20,అక్షరము లకు చెల్లును.

1,గర్భగత"-తమాశ్రి"-వృత్తము.

ఉద్దండ పిండాలున్!
తద్దాశ్య సంకెళ్ళున్!
బుద్ధిం గనందూష్యమ్!
గద్దించు నాధంబున్!

సృజనాత్మక గర్భకవితా స్రవంతి యందలి"-గాయిత్రి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"6"అక్షరము లుండును.
త,మ,గణములుండును.

2,గర్భగత"- రామణీ"-వృత్తము.

యుర్వినే శాశింపన్!
తర్వు నాశాంతంబున్!
పూర్వ శోభల్జారున్!
గర్వమే కాల్జేర్చున్!

కాలు జేర్చున్=యమ రాజుని చేర్చును.

గాయిత్రి ఛందములోనిది.
ర,మ గణములుండును.ప్రాసనియమము కలదు.
పాదమునకు"6"అక్షరములుండును.

3,గర్భగత"-ఖండనా"-వృత్తము.

ఒరిగేది లేదిలన్!
తరు గౌను శ్రీలికన్!
పురకీర్తి లొల్లయౌ!
కరదీప్తు లంతమౌ!

ఉష్ణిక్"-ఛందము నందలిది.
స,జ,గ, గణము లుండును.ప్రాసనియమము కలదు.
పాదమునకు "7"అక్షరము లుండును.

4,గర్భగత"-విక్రమ క్రమా"-వృత్తము.

ఊంచ వృత్తియె సుమా!
దంచ వత్తురు రిపుల్!
పొంచి సత్యము గనున్!
కంచి కేగును కధల్!

ఉష్ణిక్"-ఛందము నందలిది.
ర,న,గ, గణము లుండును.ప్రాసనియమము కలదు.
పాదమునకు"-7"అక్షరము లుండును.

5,గర్భగత"-తమోరమా"-వృత్తము.

ఉద్దండ పిండాలున్!యుర్వినే శాశింపన్!
తద్దాస్య సంకెళ్ళున్!తర్వు నాశాంతంబున్!
బుద్ధిన్గనం దూష్యమ్!పూర్వ శోభల్పారున్!
గద్దించు!నాధంబున్!గర్వమే కాల్జేర్చున్!

అర్ధములు=తర్వు=తరిమి వేయును,శోభల్పారున్=శోభలు పరుగిడును.

"జగతి" ఛందము నందలిది.
త,మ,ర,మ,గణము లుండును.ప్రాసనియమము కలదు.
పాదమునకు"12,అక్షరము లుండును.యతి"7"వ యక్షరమునకు
చెల్లును

6,గర్భగత"-రమతమా"-వృత్తము.

యుర్వినే శాశింపన్!ఉద్దండ పిండాలున్!
తర్వు నాశాంతంబున్!తద్దాశ్య సంకెళ్ళున్!
పూర్వ శోభల్పారున్!బుద్ధిన్గనం దూష్యమ్!
గర్వమే కాల్జేర్చున్!గద్దించు నాధంబున్!

జగతి"ఛందమునందలిది
ర,మ,త,మ,గణము లుండును.ప్రాసనియమము కలదు.
పాదమునకు12,అక్షరము లుండును.యతి,7వయక్షరమునకు
చెల్లును.

7,గర్భగత"-తమాశ్రజా"-వృత్తము.

ఉద్దండ పిండాలున్!ఒరిగేది లేదిలన్!
తద్దాశ్య సంకెళ్ళున్!తరుగౌను శ్రీలికన్!
బుద్ధిం గనన్!దూష్యం!పూర్వకీర్తి లొల్లయౌ!
గద్దించు నాదంబున్!కర దీప్తు లంతమౌ!

అతి జగతి"-ఛందము నందలిది.
త,మ,స,జ,గ,గణములుండును.ప్రాసనియమము కలదు.
పాదమునకు13,అక్షరము లుండును.ప్రాసనియమము కలదు.
యతి"7,7వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-సాధ్యమా"-వృత్తము.

ఒరిగేది లేదిలన్!ఉద్దండ పిండాలున్!
తరుగౌను శ్రీ లికన్!తద్దాశ్య సంకెళ్ళున్!
పూర్వ కీర్తి లొల్లయౌ!బుద్ధిం గనం దూష్యమ్!
కరదీప్తు లంతమౌ!గద్దించు నాదంబున్!

అతిజగతి"-ఛందమునందలిది.
స,జ,మ,య,గ,గణము లుండును.ప్రాసనియమము కలదు.
పాదమునకు"13"అక్షరము లుండును.ప్రాసనియమము కలదు.
యతి" 8,వ యక్షరమునకు చెల్లును

9,గర్భగత"-తమరేయను"-వృత్తము.

ఉద్దండ పిండాలున్!ఊంచ వృత్తియె సుమా!
తద్దాశ్య సంకెళ్ళున్!దంచ వత్తురు రిపుల్!
బుద్ధిం గనం దూష్యమౌ!పొంచి సత్యము గనున్!
గద్దించు నాదంబున్!కంచి కేగును కధల్!

అతి జగతి"ఛందము నందలిది.
త,మ,ర,న,గ, గణములుండును.ప్రాసనియము కలదు.
పాదమునకు 13,అక్షరము లుండును.ప్రాసనియమము కలదు.
యతి"7,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-రణమయె"-వృత్తము.

ఊంచ వృత్తియె సుమా!ఉద్దండ పిండాలున్!
దంచ వత్తురు రిపుల్!తద్దాశ్య సంకెళ్ళున్!
పొంచి సత్యము గనున్!బుద్ధిగనం దూష్యమౌ!
కంచి కేగును కధల్!గద్దించు నాదంబున్!

"అతిజగతి"-ఛందము నందలిది.
ర,న,మ,య,గ,గణము లుండును.ప్రాసనియమము కలదు.
యతి,8,వ యక్షరమునకు చెల్లును.

11,గర్భగత,రమాశ్రితా"-వృత్తము.

యుర్వినే శాశింపం!ఒరిగేది లేదిలన్!
తర్వు నాశాంతంబున్!తరు గౌను శ్రీ లికన్!
పూర్వ శోభ ల్జారున్!పుర కీర్తి లొల్ల యౌ!
గర్వమే కాల్జే ర్చున్!కర దీప్తు లంతమౌ!

అతి జగతి"-ఛందము నందలిది.
ర,మ,స,జ,గ,గణములుండును.ప్రాసనియమము కలదు.
యతి,7,వ యక్షరమునకు చెల్లును.పాదమునకు13,అక్షరము
లుండును.

12,గర్భగత"-సద్యుతమగు"-వృత్తము.

ఒరిగేది లేదిలన్!యుర్వినే శాశింపన్!
తరు గౌనుశ్రీలికన్!తర్వు నాశాంతంబున్!
పుర కీర్తి లొల్లయౌ!పూర్వ శోభల్జారున్!
కర దీప్తు లంతమౌ!గర్వమే కా ల్జేర్చున్!

అతి జగతి"-ఛందము లోనిది.
స,జ,త,మ,గ,గణములుండును.ప్రాసనియమము కలదు.
పాదమునకు13,అక్షరము లుండును.యతి,8,వ యక్షరమునకు
చెల్లును.

13,గర్భగత"- రమోద్యమ"వృత్తము.

యుర్వినే శాశింపన్!ఊంచ వృత్తియె సుమా!
తర్వు నాశాంతంబున్!దంచ వత్తురు రిపుల్!
పూర్వ శోభల్జారున్పొంచి సత్యము గనున్!
గర్వమే కా ల్జేర్చున్!కంచి కేగును కధల్!

అతి జగతి"-ఛందము నందలిది.
ర,మ,ర,న,గ,గణములుండును.ప్రాసనియమము కలదు.
పాదమునకు 13,అక్షరము లుండును.యతి"7,వ యక్షరము
నకు చెల్లును.

14,గర్భగత"రణోత్తమ"-వృత్తము.

ఊంచ వృత్తియె సుమా!యుర్వినే శాశింపన్!
దంచ వత్తురు రిపుల్!తర్వు నాశాంతంబున్!
పొంచి సత్యము గనున్!పూర్వ శోభల్జారున్!
కంచి కేగును కధల్!గర్వమే కా ల్జేర్చున్!

అతి జగతి"ఛందము నందలిది.
ర,న,త,మ,గ,గణము లుండును.ప్రాసనియమము కలదు.
పాదమునకు13,అక్షరము లుండును.యతి"-8,వ యక్షరమునకు
చెల్లును.

15,గర్భగత"-స జ్జతా"-వృత్తము.

ఒరిగేది లేదికన్!ఊంచ వృత్తియె సుమా!
తరుగౌను శ్రీలికన్!దంచ వత్తురు రిపుల్!
పుర కీర్తి లొల్లయౌ!పొంచి సత్యము గనున్!
కరదీప్తు లంతమౌ!కంచి కేగును కధల్!

శక్వరి"ఛందము నందలిది.
స,జ,త,భ,లగ,గణము లుండును.ప్రాసనియము కలదు.
పాదమునకు"14"అక్షరము లుండును.
యతి,8,వ యక్షరమునకు చెల్లును.

16,గర్భగత"-రుణభార"-వృత్తము.

ఊంచ వృత్తియే సుమా!ఒరిగేది లేదికన్!.
దంచ వత్తురు రిపుల్!తరు గౌను శ్రీ లికన్!
పొంచి సత్యము గనున్పుర కీర్తి లొల్లయౌ!
కంచి కేగును కధల్!కర దీప్తు లంతమౌ!

శక్వరి"-ఛందము లోనిది,
రర,న,భ,ర,లగ,గణము లుండును.ప్రాసనియమము కలదు.
పాదమునకు"14"అక్షరము లుండును.
యతి"8,వ యక్షరమునకు చెల్లును.

17,గర్భగత"-తమో రమాశ్రిత"-వృత్తము.

ఉద్దండ పిండాలున్!యుర్వినే శాశింపన్!ఒరిగేది లేదిలన్?
తద్దాశ్య సంకెళ్ళున్!తర్వు నాశాంతంబుం తరుగౌను శ్రీ లికన్!
బుద్ధిం గనం దూష్యం!పూర్వ శోభల్జారున్!పుర కీర్తి లొల్లయౌ!
గద్దించు నాదంబున్!గర్వమే కాల్జే ర్చున్!కరదీప్తు లంతమౌ!

అతి ధృతి ఛందము నందలిది.
త,మ,ర,మ,స,జ,గ,గణము లుండును.ప్రాసనియమము కలదు.
పాదమునకు"19,అక్షరము లుండును.
యతులు,7,13,అక్షరములకు చెల్లును.

18,గర్భగత"-రమాంగిర వృత్తము.

యుర్వినే శాశింపం!ఒరిగేది లేదిలం?ఉద్దండ పిండాలున్!
తర్వు నాశాంతంబున్!తరుగౌను శ్రీలికన్!తద్దాశ్య సంకెళ్ళున్!
పూర్వ శోభ ల్జారుం!పుర కీర్తి లొల్లయౌ!బుద్ధిం గనం దూష్యమ్!
గర్వమే కాల్జేర్చున్!కరదీప్తు లంతమౌ!గద్దించు నాదంబున్!

అతి ధృతి ఛందము నందలిది.
ర,మ,స,జ,మ,య,గ,గణము లుండును.ప్రాసనియమము కలదు.
పాదమునకు "19,అక్షరము లుండును.
యతులు7,14,అక్షరములకు చెల్లును.

19,గర్భగత"-సృజామ్యహం"-వృత్తము.

ఒరిగేది లేదిలన్!ఉద్దండ పిండాలుం!యుర్వినే శాశింపన్!
తరు గౌను శ్రీ లికం!తద్దాశ్య సంకెళ్ళుం!తర్వు నాశాంతంబున్!
పుర కీర్తి లొల్లయౌ!బుద్ధిం గనం దూష్యం!పూర్వ శోభ ల్జారున్!
కర దీప్తు లంతమౌ!గద్దించు నాధంబుం!గర్వమే కాల్జేర్చున్!

అతిధృతి ఛందము నందలిది.
స,జ,మ,య,త,మ,గ,గణంబు లుండును.ప్రాసనియమము కలదు.
పాదమునకు"19"అక్షరము లుండును.
యతులు,8"14"అక్షరములకు చెల్లును.

20,గర్భగత"-రమోత్తమసా"-వృత్తము.

యుర్వేనే శాశింపం!ఉద్దండ పిండాలుం!ఒరిగేది లే దిలన్?
తర్వు నాశాంతం బుం!తద్దాశ్య సంకె ళ్ళుం!తరుగౌను శ్రీలింకన్!
పుర్వ శోభ ల్జారుం!బుద్ధిం గనం దూష్యం!పుర కీర్తి లొల్లయౌ!
గర్వమే కాల్జేర్చుం!గద్దించు నాదంబుంకర దీప్తు లంతమౌ!

అనిరుద్ఛందమునందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ర,మ,త,మ,ప,జ,గ,గణము లుండును.ప్రాసనియమము కలదు.
పాదమునకు"19,అక్షరము లుండును.
యతులు.7,13,అక్షరములకు చెల్లును.

21,గర్భగత"-సౌజన్య"-వృత్తము.
.
యుర్వినే శాశింపన్!ఓరిగేది లేదిలన్?ఉద్దండ పిండాలున్!ఊంచ వృత్తియె
                                                                                          సుమా!
తర్వు నాశాంతంబున్!తరుగౌను శ్రీ లికన్!తద్దాశ్య సంకెళ్ళున్!దంచ వత్తురు
                                                                                         రిపుల్!
పూర్వ శోభల్జారున్!పురకీర్తి లొల్లయౌ!బుద్ధిం గననం దూష్యమ్!పొంచి
                                                                           సత్యము గనున్!
గర్వమే కాల్జేర్చున్!కరదీప్తు లంతమౌ!గద్దించు నాదంబున్!కంచి చేరును
                                                                                        కధల్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి ఛందము లోనిది.
ర,మ,స,జ,మ,య,త,ర,లగ,గణములుండును.ప్రాసనియమము
కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"14,20,అక్షరములకు చెల్లును.

22.గర్భగత"-తామరస"-వృత్తము.

ఒరిగేది లేదిలన్?ఉద్దండ పిండాలున్!యుర్వినే శాశింపం!ఊంచ వృత్తియె
                                                                                .        సుమా!
తరుగౌను శ్రీ లికన్!తద్దాశ్య సంకెళ్ళున్!తర్వు నాశాంతంబున్!దంచ
                                                                             వత్తరు రిపుల్!
పుర కీర్తి లొల్లయౌ!బుద్ధిం గనం దూష్యం! పూర్వ శోభ ల్జారున్!పొంచి
                                                                       సత్యము గనున్!
కర దీప్తు లంతమౌ!గద్దించు నాదంబున్!గర్వమే కాల్జేర్చున్!కంచి కేగును
                                                                                          కధల్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి "-ఛందము లోనిది.
స,జ,మ,య,త,మ,ర,భ,లగ,గణము లుండును.ప్రాసనియమము
కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"14,20,అక్షరములకు చెల్లును.

23,గర్భగత"-జితరమా"-వృత్తము.

యుర్వినే శాశింపన్!ఉద్దండ పిండాలున్!ఒరిగెది లేదిలన్!ఊంచ వృత్తయె
                                                                                         సుమా!
తర్వు నాశాంతంబున్!తద్దాశ్య సంకెళ్ళున్!తరుగౌను శ్రీలికన్!దంచ వత్తురు
                                                                                        రిపుల్!
పూర్వ శోభ లాజారున్!బుద్ధిం గనం దూష్యం!పుర కీర్తి లొల్లయౌ!పొంచి
                                                                          సత్యము గనున్!
గర్వమే కాల్జేర్చున్!గద్దించు నాదంబున్!కర దీప్తు లంతమౌ!కంచి కేగును     
                                                                                       కధల్!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ర,మ,త,మ,స,జ,త,భ,లగ,గణములుండును.ప్రాసనియమము
కలదు.పాదమనకు"26"అక్షరము లుండును.
యతులు,13,20,అక్షరములకు చెల్లును.

24,గర్భగత"-అమాయక"-వృత్తము.

ఊంచ వృత్తియె సుమా!ఉద్దండ పిండాలున్!యుర్వినే శాశింపన్!ఒరిగేది
                                                                                   .  లే దిలన్?
దంచ వత్తురు రిపుల్!తద్దాశ్య సంకెళ్ళున్!తర్వు నాశాంతంబున్!తరుగౌను
                                                                                       శ్రీలిలన్!
పొంచి సత్యము గనున్!బుద్ధిం గనం దూష్యమ్!పూర్వ శోభల్జారుం!పుర
                                                                              కీర్తి లొల్లయౌ!
కంచి కేగును కధల్!గద్దించు నాదంబుం!గర్వమే కాల్జేర్చున్!కర దీప్తు
                                                                                  లంతమౌ!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందములోనిది.
ర,న,మ,య,త,మ,భ,ర,లగ,గణములుండును.ప్రాసనియమము కలదు.
పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"14,20,అక్షరములకు చెల్లును.

25,గర్భగత"-అన్యోభయ"-వృత్తము.

ఊంచ వృత్తియె సుమా!యుర్వినే శాశింపం!ఒరిగేది లేదిలన్?ఉద్దండ
                                                                               పిండాలున్!
దంచ వత్తురు రిపుల్!తర్వు నాశాంతంబున్!తరుగౌను శ్రీ లికన్!తద్దాశ్య
                                                                               సంకెళ్ళున్!
పొంచి సత్యము గనున్!పూర్వ శోభల్జారున్!పురకీర్తి లొల్లయౌ!బుద్ధిం
                                                                      గనం దూష్యమ్!
కంచి కేగును కధల్!గర్వమే కాల్జేర్చున్!కర దీప్తు లంతమౌ!గద్దించు
                                                                             నాదంబున్!

అనిరుద్ఛందమునందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ర,న,త,భ,ర,య,ర,గగ,గణము లుండును.ప్రాసనిమము గలదు.
పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,14,20,అక్షరములకు చెల్లును.

26,గర్భగత"-భారయా"-వృత్తము.

ఊంచ వృత్తియె సుమా!ఒరిగేది లేదిలన్?ఉద్దండ పిండాలుం!యుర్వినే
                                                                                     శాశింపన్!
దంచ వత్తురు రిపుల్!తరుగౌను శ్రీలికం!తద్దాశ్య సంకెళ్ళున్!తర్వు
                                                                            నాశాంతంబున్!
పొంచి సత్యము గనున్!పుర కీర్తి లొల్లయౌ!బుద్ధిం గనం దూష్యం!పూర్వ
                                                                                శోభ ల్జారున్!
కంచి కేగును కధల్!కర దీప్తు లంతమౌ!గద్దించు నాదంబున్!గర్వమే
                                                                                   కాల్జేర్చున్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి'-ఛందములోనిది.
ప్రాస నియమము కలదు.ర,న,భ,ర,య,ర,మ,య,గగ,గణుము
లుండును.పాదమునకు 26"అక్షరము లుండును.
యతులు"15,21,అక్షరములకు చెల్లును.

27,గర్భగత"-తమి బాపు"-వృత్తము.

ఊంచ వృత్తియె సుమా!యుర్వినే శాశింపన్!ఉద్దండపిండాలుం!ఒరిగేది
                                                                                     లే దిలన్?
దంచ వత్తురు రిపుల్!తర్వు నాశాంతంబున్!తద్దాశ్య సంకెళ్ళు!తరుగౌను
                                                                                    శ్రీ లికన్!
పొంచి సత్యము గనున్!పూర్వ శోభల్జారున్!బుద్ధిం గనందూష్యమౌ!పుర
                                                                         కీర్తి లొల్లయౌ!
కంచి కేగును కధల్!గర్వమే కాల్జేర్చున్!గద్దించు నాదంబున్!కర దీప్తు
                                                                             లంతమౌ!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందములోనిది
ర,న,త,మ,య,భ,ర,లగ,గణములుండును.ప్రాసనియమము కలదు.
పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"14"20,అక్షరములకు చెల్లును.

28,గర్భగత"-రమాంబు ధీర"-వృత్తము.

ఊంచ వృత్తియె సుమా!ఒరిగేది లే దిలన్!యుర్వినే శాశింపన్!ఉద్దండ
                                                                                 పిండాలున్!
దంచ వత్తురు రిపుల్!తరుగౌను శ్రీ లికన్!తర్వు నాశాంతంబున్!తద్దాశ్య
                                                                                  సంకెళ్ళున్!
పొంచి సత్యము గనున్!పుర కీర్తి లొల్లయౌ!పూర్వ శోభ ల్జారున్!బుద్లిం
                                                                          గనం దూష్యమ్!
కంచి కేగును కధల్!కర దీప్తు లంతమౌ!గర్వమే కాల్జేర్చున్!గద్దించు
                                                                                నాదంబున్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందములోనిది.
ర,న,భ,ర,య,య,మ,ర,గగ,గణములుండును.ప్రాసనియమభు కలదు.
పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"15,21,అక్షరములకు చెల్లును.

29,గర్భగత"-రసభర"-వృత్తము.

ఊంచ వృత్తియే సుమా!ఉద్దండ పిండాలున్!ఒరిగేది లే దిలన్?యుర్వినే
                                                                                    శాశింపన్!
దంచ వత్తురు రిపుల్!తద్దాశ్య సంకెళ్ళున్!తరు గౌను శ్రీ లికన్!తర్వు
                                                                          నాశాంతంబున్!
పొంచి సత్యము గనున్!బుద్ధిం గనం దూష్యమౌ! పురకీర్తి లొల్లయౌ!పూర్వ
                                                                            శోభ ల్జారున్!
కంచి కేగును కధల్!గద్దించు నాదంబున్!కరదీప్తు లంతమౌ!గర్వమే
                                                                               కా ల్జేర్చున్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ర,న,మ,య,భ,ర,య,య,గగ,గణములుండును.ప్రాసనియమము
కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"14,21,అక్షరములకు చెల్లును.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.