గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఫిబ్రవరి 2024, గురువారం

మమత్తిలి,స్వార్ధచిత్త,మైకమున,యశశ్వి,నిష్ప్రయోజిక,దుశ్చర్య,లోకహాని, కపట జీవన,నాతి రక్ష,మత్తచేతనా,ధననా శయ,కాకి మూక,కాయలేని, భ యానక,""-గర్భ"భీతాహవ"వృత్తమురచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ..

 జైశ్రీరామ్

మత్తుమందు జల్లి లోకమున్!మాయజేసి రూకలిచ్చి!మైకమీర్చి కోట్లు
                                                                                 నందుచున్!
చిత్త స్వార్ధ మత్తు చేతనన్!చేయరాని చేష్ట లొప్ప!చీకు చింత లొందు
                                                                                 భావినిన్!!
బొత్తి గాను బీద లౌదురే!భూ యశంబు బుగ్గి యౌను!బోకు లౌదు రెల్ల
                                                                               వారలున్!
కత్తి కోత లందు ధాత్రియున్!కాయ లేడు శర్వుడైన!కాకి మూక మాయు
                                                                                నెన్నడో?

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత
ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 26 అక్షరము లుండును.
యతులు"10,18,అక్షరములకు చెల్లును.

1.గర్భగత"-మత్తిలి"-వృత్తము.

మత్తుమందు జల్లి లోకమున్!
చిత్త స్వార్ధ మత్తు చేతనన్!
బొత్తిగాను బీద లౌదురే!
కత్తి కోత లందు ధాత్రియున్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

2.గర్భగత"-స్వార్ధ చిత్త"-వృత్తము.

మాయ జేసి రూక లిచ్చి!
చేయ రాని చేష్ట లొప్ప!
భూ యశంబు బుగ్గి యౌను!
కాయ లేడు శర్వు డైన!

అభిజ్ఞా ఛందము నందలి"-అనుష్టుప్ ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.

3,గర్భగత"-మైకమున"-వృత్తము.

మైక మేర్చి కోట్లు నందుచున్!
చీకు చింత లొందు భావినిన్!
బోకు లౌదు రెల్ల వారలున్!
కాకి మూక మాయు నెన్నడో?

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదముసకు"9,అక్షరము లుండును.

4,గర్భగత"-యశశ్వి"-వృత్తము.

మత్తు మందు జల్లి లోకమున్!మాయ జేసి రూక లిచ్చి!
చిత్త స్వార్ధ మత్తు చేతనన్!చేయ రాని చేష్ట లొప్ప!
బొత్తిగాను బీద లౌదురే!భూ యశంబు బుగ్గి యౌను!
కత్తి కోత లందు ధాత్రియున్!కాయ లేడు శర్వు డైన!

అణిమా ఛందమునందలి  అత్యష్టి ఛందము లోనిది.
పాదమునకు 17,అక్షరము లుండును.ప్రాసనియమము కలదు.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-నిష్ప్రయోజిక"-వృత్తము.

మాయ జేసి రూక లిచ్చి!మత్తు మందు జల్లి లోకమున్!
చేయరాని చేష్ట లొప్ప!చిత్త స్వార్ధ మత్తు చేతనన్!
భూ యశంబు బుగ్గి యౌను!బొత్తిగాను బీద లౌదురే!
కాయ లేడు శర్వు డైన!కత్తి కోతలందు ధాత్రియున్!

అణిమా ఛందము నందలి అత్యష్టి ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "17"అక్షరము లుండును.
యతి,9,వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-దుశ్చర్య"-వృత్తము.

మత్తు మందు జల్లి లోకమున్!మైక మేర్చి కోట్లు నందుచున్!
చిత్త స్వార్ధ మత్తు చేతనన్!చీకు చింత లొందు భావినిన్!
బొత్తి గాను బీద లౌదురే!బోకు లౌదు రెల్ల వారలున్!
కత్తి కోత లందు ధాత్రి యున్!కాకి మూక మాయు నెన్నడో?

అణిమా ఛందము నందలి "ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-లోకహాని"-వృత్తము.

మైక మేర్చి కోట్లు నందుచున్!మత్తుమందు జల్లి లోకమున్!
చీకు చింత లొందు భావినిన్!చిత్త స్వార్ధ మత్తు చేతనన్!
బోకు లౌదు రెల్ల వారలున్!బొత్తిగాను బీద లౌదురే!
కాకి మూక మాయు నెన్నడో?కత్తి కోత లందు ధాత్రియున్!

అణిమా ఛందము నందలి "ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరములుండును.
యతి 10,వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-కపట జీవన"-వృత్తము.

మాయ జేసి రూక లిచ్చి!మైక మేర్చి కోట్టు నందు చున్!
చేయరాని చేష్ట లొప్ప!చీకు చింత లొందు భావినిన్!
భూ యశంబు బుగ్గి యౌను!బోకు లౌదు రెల్ల వాదలున్!
కాయ లేడు శర్వుడైన!కాకి మూక మాయు నెన్నడో?

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9,వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-నితి రక్ష"-వృత్తము.

మైక మేర్చి కోట్లు నందుచున్!మాయ జేసి రూక లిచ్చి!
చీకు చింత లొందు భావినిన్!చేయరాని చేష్ట లొప్ప!
బోకు లౌదు రెల్ల వారలున్!భూ యశంబు బుగ్గి యౌను!
కాకి మూక మాయు నెన్నడో?కాయ లేడు శర్వుడైన!

అణిమా ఛందము నందలి అత్యష్టి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17,అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-మత్తు చేతనా"-వృత్తము.

మాయ జేసి రూక లిచ్చి!మత్తు మందు జల్లి లోకమున్!మైక మేర్చి కోట్లు
                                                                                   నొందుచున్!
చేయరాని చేష్ట లొప్ప!చిత్త స్వార్ధ మత్తు చేతనన్!చీకు చింత లొందు
                                                                                   భావినిన్!
భూయశంబు బుగ్గి యౌను!బొత్తి గాను బీద లౌదురే!బోకు లౌదు రెల్ల
                                                                                వారలున్!
కాయ లేడు శర్వు డైన!కత్తి కోత లందు ధాత్రి యున్!కాకి మూక మాయు
                                                                                నెన్నడో?

అనిరుద్ఛందమునందలి ఉత్కృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరము లకు చెల్లును.

11,గర్భగత"-ధనాశ"-వృత్తము.

మత్తు మందు జల్లి లోకమున్!మైక మేర్చి కోట్లు నొందుచున్!మాయ జేసి
                                                                                    రూక లిచ్చి!
చిత్త స్వార్ధ మత్తు చేతనన్!చీకు చింత లొందు భావినిన్!చేయరాని చేష్ట
                                                                                         లొప్ప!
బొత్తి గాను బీద లౌదురే!బోకు లౌదు రెల్ల వారలున్!భూ యశంబు బుగ్గి
                                                                                       యౌను!
కత్తి కోత లందు ధాత్రియున్!కాకి మూక మాయు నెన్నడో?కాయ లేడు 
                                                                                  శర్వు డైన!      

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి ఛందము లోనది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26,అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.

12,గర్భగత"-కాకి మూక"-వృత్తము.

మైక మేర్చి కోట్టు నొందుచున్!మత్తు మందు జల్లి లోకమున్!మాయ జేసి
                                                                                      రూక లిచ్చి!
చీకు చింత లొందు భావినిన్!చిత్త స్వార్ధ మత్తు చేతనన్!చేయ రాని చేష్ట
                                                                                          లొప్ప!
బోకు లౌదు రెల్ల వారలున్!బొత్తిగాను బీద లౌదురే!భూ యశంబు బుగ్గి
                                                                                       యౌను!
కాకి మూక మాయు నెన్నడో?కత్తి కోత లందు ధాత్రియున్!కాయ లేడు
                                                                                   శర్వుడైన!

అనిరుద్ఛందము నందలిఉత్కృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు;26,అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.

13,గర్భగత"-కాయలేని"-వృత్తము.

మాయ జేసి రూక లిచ్చి!మైక మేర్చి కోట్లు నొందుచున్!మత్తు మందు జల్లి
                                                                                       లోకమున్!
చేయరాని చేష్ట లొప్ప!చీకు చింత లొందు భావినిన్!చిత్త స్వార్ధ మత్తు
                                                                                      చేతనన్!
భూ యశంబు బుగ్గి యౌను!బోకు లౌదు రెల్ల వారలున్!బొత్తిగాను బీద
                                                                                     లౌదురే!
కాయ లేడు శర్వు డైన!కాకి మూక మాయు నెన్నడో?కత్తి కోత లందు
                                                                                 ధాత్రియున్!

అనిరుద్ఛందమునందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరము లకు చెల్లును.

14,గర్భగత"-భయానక"-వృత్తము.

మైక మేర్చి కోట్లు నొందుచున్!మాయ జేసి రూక లిచ్చి!మత్తుమందు
                                                                         జల్లి లోకమున్!
చీకు చింత లొందు భావినిన్!చేయరాని చేష్ట లొప్ప!చిత్త స్వార్ధ మత్తు
                                                                                చేతనన్!
బోకు లౌదు రెల్ల వారలున్!భూ యశంబు బుగ్గి యౌను!బొత్తిగాను బీద
                                                                                  లౌదురే!
కాకి మూక మాయు నెన్నడో?కాయ లేడు శర్వుడైన!కత్తి కోత లందు
                                                                          ధాత్రియున్!

అనిరుద్ఛందము నందలి "ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరము లకు చెల్లును.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.