గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఫిబ్రవరి 2024, గురువారం

నటత,వికటత,అట్టహాస,నవ్వుల పాలు,సవ్వడి,కవ్విత,చివ్వకు,దోషాచరు, కాదను,కంటక,చిటికెడు,బిచ్చమీయు,సాదరణ,సీదరణ"గర్భ"జయ" "వృత్తముఠచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

 జైశ్రీరామ్.

నట వికటాట్ట హాసమై!నవ్వుల పాలైన రసన్!నౌదల జయమంద నౌనే!
జటిల సమస్య జేసెడిన్!సవ్వడి దోషాంబుధియై!సాదరమున ఱేని జేయన్!
కటుత జనాళి దోషియై!కవ్విత మోసాశ్రియనన్!!కాదన  బడు లోక మందు
చిటికెడు దానమీయునే!చివ్వకు ముందుండుగదే!సీదరణకు లోను నౌచున్

సృజనాతక గర్భకవితా స్రవంతి యందలిఅనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి"
ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము
లుండును.యతులు"10,,18,అక్రములకు చెల్లును.

1,గర్భగత"-నటత"-వృత్తము.

నట వికటాట్ట హాసమై!
జటిల సమస్య జేసెడిన్!
కటుత జనాళి దోషియై!
చిటికెడు దాన మీయునే!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోవిది..
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

2,గర్భగత"-వికటత"-వృత్తము.

నవ్వులపాలైన రసన్!
సవ్వడి దోషాంబుధియై!
కవ్విత మోసాశ్రి యనన్!
చివ్వకు ముందుండు గదే?

అభిజ్ఞా ఛందము నందలి"-అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.శాదమునకు"8"అక్షరము లుండును.

3,గర్భగత"-అట్టహాస"-వృత్తము.

నౌదల జయ మంద నౌనే?
సాదరమున ఱేని జేయన్!
కాదన బడు లోక మందున్!
సీదరణకు లోను నౌచున్!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

4,గర్భగత"-నవ్వులపాలు"-వృత్తము.

నట వికటాట్ట హాసమై!నవ్వుల పాలైన రసన్!
జటిల సమస్య జేసెడిన్!సవ్వడి దోషాంబుధియై!
కటుత జనాళి దోషియై!కవ్విత మోసాశ్రి యనన్!
చిటికెడు దాన మీయునే!చివ్వకు ముందుండు గదే!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-సవ్వడి"-వృత్తము,

నవ్వుల పాలైన రసన్!నట విక టాట్ట హాసమై!
సవ్వడి దోషాంబుధియై!జటిల సమస్య జేసెడిన్!
కవ్విత మోసాశ్రి యనన్!కటుత జనాళి దోషియై!
చివ్వకు ముందుండు గదే!చిటికెడు దాన మీయునే

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17,అక్షరము లుండును.
యతి,9,వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-కవ్విత"-వృత్తము.

నవ్వుల పాలైన రసన్!నౌదల జయ మంద నౌనే?
సవ్వడి దోషాంబుధియై!సాదరమున ఱేని జేయన్!
కవ్విత మోసాశ్రి యనన్!కాదనబడు లోకమందున్!
చివ్వకు ముందుండు గదే!సీదరణకు లోను నౌచున్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9,వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-చివ్వకు"వృత్తము.

నౌదల జయ మంద నౌనే?నవ్వుల ఫాలైన రసన్!
సాదరమున ఱేని జేయన్!సవ్వడి దోషాంబుధియై!
కాదన బడు లోకమందున్!కవ్విత మోసాశ్రి యనన్!
సీదరణకు లోను నౌచున్!చివ్వకు ముందుండు గదే!

అణిమా ఛందము నందలి"అత్యష్టి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-దోషాచర"-వృత్తము.

నట విక టాట్ట హాసమై!నౌదల జయ మంద నౌనే?
జటిల సమస్య జేసెడిన్!సాదరమున ఱేని జేయన్!
కటుత జనాళి దోషియై!కాదనబడు లోక మందున్!
చిటికెడు దాన మీయునే!సీదరణకు లోను నౌచున్!

అణిమా ఛందమునందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-కాదను"-వృత్తము.

నౌదల జయ మంద నౌనే?నట విక టాట్ట హాసమై!
సాదరమునఱేని జేయన్!జటిల సమస్య జేసెడిన్!
కాదనబడు లోక మందున్!కటుత జనాళి దోషియై!
సీదరణకు లోను నౌచున్!చిటికెడు దాన మీయునే!

అణిమా"ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18,అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-కంటక"-వృత్తము.

నవ్వుల పాలైన రసన్!నట వికటాట్ట హాసమై!నౌదల జయ మంద నౌనే?
సవ్వడి దోషాంబుధియై!జటిల సమస్య జేసెడిన్!సాదరమున ఱేని చేయగన్!
కవ్విత మోసాశ్రి యనన్!కటుత జనాళి దోషియై!కాదన బడు లోక మందున్!
చివ్వకు ముందుండు గదే!చిటికెడు దాన మీయునే!సీదరణకు లోను నౌచున్!

అనిరుద్ఛందమునందలిఉత్కృతి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 26,అక్షరము లుండును.
యతులు"9"18,అక్షరము లకు చెల్లును.

11,గర్భగత"-చిటికెడు"-వృత్తము.

నవ్వుల పాలైన  రసన్!నౌదల జయ మంద నౌనే?నట వికటాట్ట హాసమై!
సవ్వడి దోషాంబుధియై!సాదరమున ఱేని చేయగన్!జటిల సమస్య జేసెడిన్!
కవ్విత మోసాశ్రియనన్!కాదన బడు లోకమందున్!కటుత జనాళి దోషియై!
చివ్వకు ముందుండుగదే!సీదరణకులోను నౌచున్!చిటికెడు దాన మీయునే!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9"18,అక్షరములకు చెల్లును.

12,గర్భగత"-బిచ్చమీయు"-వృత్తము.

నౌదలజయమంద నౌనే?నవ్వు ల పాలలైన రసన్!నట వికటాట్ట హాసమై!
సాదరమున ఱేని చేయగన్! సవ్వడి దోషాంబుధియై!జటిల సమస్యజేసెడిన్
కాదనబడు లోకమందున్!కవ్విత మోసాశ్రియనం!కటుత జనాళి దోషియై!
సీదరణకు లోనునౌచున్!చివ్వకు ముందుండు గదే!చిటికెడు దానమీయునే!

అనిరుద్ఛందము నందలలిఉత్కృఋతి"ఛందము లోనిది.
ప్రాసనియై కలదు.పాదమముననకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,,అక్షరములకు చెల్లును.

13,గర్భగత"-సాదరణ"వృత్తము.

నట వికటాట్ట హాసమై!నౌదల జయమంద నౌనే?నవ్వుల పాలైన రసన్!
జటిల సమస్యజేసెడిం!సాదరమున ఱేని చేయగన్!సవ్వడి దోషాంబుధియై!
కటుత జనాళి దోషియై!కాదనబడు లోక మందున్!కవ్విత మోసాశ్రి యనన్!
చిటికెడు దాన మీయునే!సీదరణకు లోను నౌచున్!చివ్వకు ముందుండు గదే!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.

14,గర్భగత"-సీదరణ"-వృత్తము.

నౌదల జయమంద నౌనే!నట విక టాట్ట హాసమై!నవ్వుల పాలైన రసన్!
సాదరమున ఱేని చేయగన్!జటిలసమస్య జేసెడిన్!సవ్వడి దోషాంబుధియై!
కాదనబడు లోక మందున్!కటుత జనాళి దోషియై!కవ్విత మోసాశ్రి యనన్!
సిదరణకు లోను నౌచున్!చిటికెడు దానమీయునే!చివ్వకు ముందుండు గదే!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండను.
యతులు"10,19,అక్షరములకు చెల్లును.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.