గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఫిబ్రవరి 2024, గురువారం

వృద్ధి,భ్రాంతిలు,సుష్కమై,పాపౌఘ,సారమింతె,భీరత్వ,నిష్కృత,భీభత్స,గర్భ" భావోద్వేగ"వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్. 

వృద్ధి,భ్రాంతిలు,సుష్కమై,పాపౌఘ,సారమింతె,భీరత్వ,నిష్కృత,భీభత్స,గర్భ" భావోద్వేగ"వృత్తము.   రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

స్మృతి వికటాస్యము జేసె!చింతింప ఫల శూన్యమై!జీవా పాపౌఘ సారంబనన్?
పతి సతు లందున జేరి!పంతాల పటి యింపులన్!భావోద్వేగంబు భేదింపగన్!
నృతములు మృగ్యము లాయె!నింతింత వటు డింతనన్!నేవంబే లేక భీభత్సతన్!
బ్రతుకుల మంటలు రేపె!భ్రాంతుల్మిగిలె సుష్క మై!ప్రా వర్ఛస్సుల్బాయ హేయంబునై!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"-10,18,అక్షరము లకు చెల్లును.

1,గర్భగత"-వికటాస్యం"-వృత్తము.

స్మృతి వికటాస్యము జేసి!
పతి సతులందున జేరి!
నృతములు మృగ్యము లాయె!
బ్రతుకుల మంటలు రేపె!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

2,గర్భగత"-నృతము"-వృత్తము.

చింతింప ఫల శూన్యమై!
పంతాల పటియింపులన్!
నింతింత వటు డింతనన్!
భ్రాంతుల్మిగిలె సుష్కమై!

అభిజ్ఞా ఛందము నందలి"-అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.

3,గర్భగత"-స్మృతి పథం"-వృత్తము.

జీవా!పాపౌఘ సారంబనన్!
భావోద్వేగంబు భేదింపగన్!
నేవంబే లేక భీభత్సతన్!
ప్రా వర్ఛస్సున్నెడంబాయగన్!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "9"అక్షరము లుండును.

4,గర్భగత"-శోకజీవనా"-వృత్తము.

స్మృతి వికటాస్యము జేసె!చింతింప ఫల శూన్యమై!
పతి సతు లందున జేరి!పంతాల పటియింపులన్!
నృతములు మృగ్యము  లాయె!నింతింత వటు డింతనన్!
బ్రతుకుల మంటలు రేపె!భ్రాంతుల్మిగిలె సుష్కమై!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"-17"అక్షరము లుండును.
యతి,"10"వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-శూన్యఫల"-వృత్తము.

చింతింప ఫలశూన్యమై!జీవా!పాపౌఘ సారంబనన్!
పంతాల పటియింపులన్!భావోద్వేగంబు భేదింపగన్!
నింతింత వటు డింతనన్!నేవంబే లేక భీభత్సతన్!
భ్రాంతుల్మిగిలె సుష్కమై!ప్రా వర్ఛస్సున్నెడ బాయగన్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9,వ క్షరమునకు చెల్లును.

6,గర్భగత"-పంతంబు"-వృత్తము.

జీవా!పాపౌఘసారంబనన్!స్మృతి వికటాస్యము జేసె!
భావోద్వేగంబు భేదింపగన్!పతి సతులందున జేరి!
నేవంబే లేక భీభత్సతన్!నృతములు మృగ్యము లాయె!
ప్రా వర్ఛస్సున్నెడ బాయగన్!బ్రతుకుల మంటలు రేపె!

అణిమా ఛందము నందలి"-ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-అనతి వృద్ధి"-వృత్తము.

స్మృతి వికటాస్యము జేసె!జీవా!పాపౌఘ సారంబనన్!
పతి సతులందున జేరి!భావోద్వేగంబు భేదింపగన్!
నృతములు మృగ్యము లాయె!నేవంబె లేక భీభత్సతన్!
బ్రతుకుల మంటలు రేపె!ప్రా వర్ఛస్సున్నెడ బాయగన్!

అణిమా ఛందమునందలి"-ధృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-భ్రాంతిలు"-వృత్తము.

జీవా!పాపౌఘ సారంబనన్!చింతింప ఫల శూన్యమై!
భావోద్వేగంబు భేదింపగ్!పంతాల పటియింపులన్!
నేవంబె లేక భీభత్సతన్!నింతింత వటు డింతనన్!
ప్రా వర్ఛస్సున్నెడ బాయగన్!భ్రాంతుల్మిగిలె సుష్కమై!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి "10,వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-సుష్కమై!"-వృత్తము.

చింతింప ఫల శూన్యమై!స్మృతి వికటాస్యము జేసె!
పంతాల పటియింపులన్!పతి సతులందున జేరి!
నింతింత వటు డింతనన్!నృతములు మృగ్యము లాయె!
భ్రాంతుల్మిగిలె సుష్కమై!బ్రతుకుల మంటలు రేపె!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-పాపౌఘ"-వృత్తము.

చింతింప ఫల శూన్యమై!జీవా!పాపౌఘ సారంబనన్!స్మృతి వికటాస్యము జేసె!
పంతాల పటియింపులన్!భావోద్వేగంబు భేదింపగన్!పతి సతులందున జేరి!
నింతింత పటు డింతనన్!నేవంబె లేక భీభత్సతన్!నృతములు మృగ్యము లాయె!
భ్రాంతుల్మిగిలి సుష్కమై!ప్రా వర్ఛస్సున్నెడబాయగన్!బ్రతుకుల మంటలు రేపె!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును.

11,గర్భగత"-సారమింతె"-వృత్తము.

జీవా!పాపౌఘ సారంబనన్!స్మృతి వికటాస్యము జేసె!చింతింప ఫల శూన్యమై!
భావోద్వేగంబు భేదింపగన్!పతి సతులందున జేరి!పంతాల పటియింపులన్!
నేవంబె లేక భీభత్సతన్!నృతములు మృగ్యము లాయె!నింతింత వటుడింతనన్!
ప్రా వర్ఛస్సున్నెడ బాయగన్!బ్రతుకుల మంటలు రేపె!భ్రాంతుల్మిగిలె సుష్కమై!

అనిరురుద్ఛందమునందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"10,19,అక్షరములకు చెల్లును.

12,గర్భగత"-భేదత్వ"-వృత్తము.

స్మృతి వికటాస్యము జేసె!జీవా!పాపౌఘ సారంబనన్!చింతింప ఫల శూన్యమై!
పతి సతులందున జేరి!భావోద్వేగంబు భేదింపగన్!పంతాలు పటియింపులన్!
నృతములు మృగ్యము లాయె!నేవంబె లేక భీభత్సతన్!నింతింత వటు డింతనన్!
బ్రతుకుల మంటలు రేపె!ప్రా వర్ఛస్సున్నెడ బాయగన్!భ్రాంతుల్మిగిలె సుష్కమై!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.

13,గర్భగత"-నిష్కృత"-వృత్తము.

జీవా!పాపౌఘ సారంబసస్!చింతింప ఫల శూన్యమై!స్మృతి వికటాస్యము జేసె!
భావోద్వేగంబు భేదింపగన్!పంతాలు పటియింపులన్!పతి సతు లందున జేరి!
నేవంబె లేక భీభత్సతన్!నింతింత వటు డింతనన్!నృతములు మృగ్యము లాయె!
ప్రా వర్ఛస్సున్నెడ బాయగన్!భ్రాంతుల్మిగిలె సుష్కమై!బ్రతుకుల మంటలు రేపె!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.

14,గర్భగత"-భీభత్స"-వృత్తము.

చింతింప ఫలశూన్యమై!స్మృతి వికటాస్యము జేసె!జీవా!పాపౌఘ సారంబనన్!
పంతాలు పటియింపులన్!పతి సతులందున జేరి!భావోద్వేగంబు భేదింపగన్!
నింతింత వటు డింత నన్! నృతములు మృగ్యము లాయె!నేవంబె లేక భీభత్సతన్!
భ్రాంతుల్మిగిలె సష్కమై!బ్రతుకుల మంటలు రేపె!ప్రా వర్ఛస్సున్నెడ బాయగన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,19,అక్షరములకు చెల్లును.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.