గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఫిబ్రవరి 2024, గురువారం

కాసులాశ,దుష్టచర్య,భాసమాన,గాసిలు,మంచి నెట్టు,తొల్లి కీర్తి,కల్లబొల్లి,కల్ల బొల్లి,కల్లబ్రతుకు,తులతూగు,మేటి తూగు,బాన నింపు,నింద మోపు,కల్ల లాడి,వల్ల కాని,గర్భ"-స్వార్ధతా"-వృత్తము రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ..

 జైశ్రీరామ్.

కాసు లాశ దుష్ట చర్యలన్!కల్ల బొల్లి కబురులన్!కాని నిందమోపి యొడ్లకున్!
త్రోసి పుచ్చి మంచి నావలన్!తొల్లి కీర్తి తరుముచున్!తూని కందు తానె
                                                                                         మేటనన్ !
బాసమాన కీర్తి నాదనన్!వల్లకాని పనులతోన్!బాన నింపు రూక లాశలన్!
గాసిలంగ జేసి లోకమున్!కల్లలాడి బ్రతుకుచున్!కానరాని స్వార్ధు లాయిరే!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"-అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి"
ఛందము నందలిది.ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము
లుండును.యతులు10,18,అక్షరములకు చెల్లును.

1,గర్భగత"-కాసులాశ"-వృత్తము.

కాసు లాశ దుష్ట చర్యలన్!
త్రోసి పుచ్చి మంచి నావలన్!
బాసమాన కీర్తి నాదనన్!
గాసిలంగ జేసి లోకమున్!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

2,గర్భగత"-దుష్టచర్య"-వృత్తము.

కల్లబొల్లి కబురులన్!
తొల్లి కీర్తి తరుముచున్!
వల్లకాని పనులతోన్!
కల్ల లాడి బ్రతుకుచున్!

అభిజ్ఞా ఛందమునందలి"-అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.

3,గర్భగత"-బాసమాన"-వృత్తము.

కాని నింద మోపి యొడ్లకున్!
తూని కందు తానె మేటనన్!
బాన నింపు రూక లాశలన్!
కాన రాని స్వార్ధు లాయిరే!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,9"అక్షరము లుండును.

4,గర్భగత"-గాసిలు"-వృత్తము.

కాసు లాశ దుష్ట చర్యలన్!కల్లబొల్లి కబురులన్!
త్రోసిపుచ్చి మంచి నావలన్!తొల్లి కీర్తి తరుముచున్!
బాసమాన కీర్తి నాదనన్!వల్లకాని పనులతోన్!
గాసిలంగ జేసి లోకమున్!కల్లలాడి బ్రతుకు చున్!

అణిమా ఛందమునందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరములుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-మంచినెట్టు"-వృత్తము.

కల్లబొల్లి కబురులన్!కాసులాశ దుష్ట చర్యలన్!
తొల్లి కీర్తి తరుముచున్!త్రోసిపుచ్చి మంచి నావలన్!
వల్లకాని పనులతోన్!బాసమాన కీర్తి నాదనన్!
కల్లలాడి బ్రతుకుచున్!గాసిలంగ జేసి లోకమున్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9,వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-తొల్లి కీర్తి"-వృత్తము.

కాసులాశ దుష్ట చర్యలన్!కాని నింద మోపి యొడ్లకున్!
త్రోసి పుచ్చి మంచి నావలన్!తూనికందు తానె మేటనన్!
బాసమాన కీర్తన్ నాదనన్!బాన నింపు రూక లాశలన్!
గాసిలంగ జేసి లోకమున్!కానరాని స్వార్ధు లాయిరే!

అణిమా ఛందమునందలి"-ధృతి-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి" 10,వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-కల్లబొల్లి"-వృత్తము.

కాని నింద మోపి యొడ్లకున్!కాసు లాశ దుష్ట చర్యలన్!
తూనికందు తానె మేటనన్!త్రోసి పుచ్చి మంచి నావలన్!
బాననింపు రూక లాశలన్!బాసమాన కీర్తి నాదనన్!
కానరాని స్వార్ధు లాయిరే!గాసిలంగ జేసి లోకమున్!

అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి,10,వ క్షరమునకు చెల్లును.

8,గర్భగత"-కల్లబ్రతుకు"-వృత్తము.

కల్లబొల్లి కబురులన్!కాని నింద మోపి యొడ్లకున్!
తొల్లికీర్తి తరుముచున్!తూనికందు తానె మేటనన్!
వల్లకాని పనులతోన్!బాననింపు రూక లాశలన్!
కల్ల లాడి బ్రతుకుచున్!కానరాని స్వార్ధు లాయిరే!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-చందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"-9,వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-తులతూగు"-వృత్తము.

కాని నిందమోపి యొడ్లకున్!కల్ల బొల్లి కబురులన్!
తూనికందు తానె మేటనన్!తొల్లి కీర్తి తరుముచున్!
బాన నింపు రూక లాశలన్!వల్లకాని పనులతోన్!
కానరాని స్వార్ధు లాయిరే!కల్ల లాడి బ్రతుకుచున్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి" 10,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-మేటి తూగు"-వృత్తము.

కల్లబొల్లి కబురులన్!కాసులాశ దుష్ట చర్యలన్!కాని నిందమోపి యొడ్లకున్!
తొల్లి కీర్తి తరుముచున్!త్రోసిపుచ్చి మంచి నావలన్!తూని కందు తానె
                                                                                         మేటనన్!
వల్లకాని పనులతోన్!బాసమాన కీర్తి నాదనన్!బాన నింపు రూక లాశలన్!
కల్లలాడి బ్రతుకుచున్!గాసిలంగ జేసి లోకమున్!కానరాని స్వార్ధు లాయిరే!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండును.
యతులు"9,18,అక్షరములకు చెల్లును.

11,గర్భగత"-బాననింపు"-వృత్తము.

కాసులాశ దుష్ట చర్యలన్!కాని నిందమోపి యొడ్లకున్!కల్లబొల్లి కబురులన్!
త్రోసి పుచ్చి మంచి నావలన్!తూని కందు తానె మేటనన్!తొల్లి కీర్తి
                                                                                 తరుముచున్!
బాసమాన కీర్తి నాదనన్!బాననింపు రూక లాశలన్!వల్లకాని పనులతోన్!
గాసిలంగ జేసి లోకమున్!కానరాని స్వార్ధు లాయిరే!కల్లలాడి బ్రుతుకుచున్!

అనిరుద్ఛందమునందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"10,19,అక్షరములకు చెల్లును.

12,గర్భగత"-నిందమోపి"-వృత్తము.

కానినింద మోపి యొడ్లకున్!కాసులాశ దుష్టచర్యలన్!కల్లబొల్లి కబురులన్!
తూని కందు తానె మేటనన్!త్రోసి పుచ్చి మంచి నావలన్!తొల్లి కీర్తి
                                                                                  తరుముచున్!
బాన నింపు రూకలాశలన్ !బాస  మాన కీర్తి నాదనన్!వల్లకాని పనులతోన్!
కానరాని స్వార్ధు లాయిరే!గాసిలంగ జేసి లోకమున్!కల్లలాడి బ్రతుకుచున్!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"10,19"అక్షరము లకు చెల్లును.

13,గర్భగత"-కల్లలాడి"-వృత్తము.

కల్లబొల్లి కబురులన్!కాని నిందమోపి యొడ్లకున్!కాసు లాశ దుష్ట చర్యలన్!
తొల్లి కీర్తి తరుముచున్!తూని కందు తానె మేటనన్!త్రోసి పుచ్చి మంచి
                                                                                          నావలన్!
వల్లకాని పనులతోన్!బాన నింపు రూకలాశలన్! బాసమాన కీర్తి నాదనన్!
కల్లలాడి బ్రతుకుచున్!కానరాని స్వార్ధులాయిరే!గాసిలంగ జేసి లోకమమున్

అనిరుద్ఛందమమునందలి,ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును.

14,గర్భగత"-వల్లకాని"-వృత్తము.

కానినింద మోపి యొడ్లకున్!కల్లబొల్లి కబురులన్!కాసులాశ దుష్ట చర్యలన్!
తూనికందు తానె మేటనన్!తొల్లి కీర్తి తరుముచున్!త్రోసి పుచ్చి మంచి
                                                                                         నావలన్!
బాననింపు రూక లాశలన్!వల్లకాని పనులతోన్!బాసమాన కీర్తి నాదనన్!
కానరాని స్వార్ధు లాయిరే!కల్లలాడి బ్రతుకుచున్!గాసిలంగ జేసి లోకమున్!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.

జైహిఒంద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.