గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, డిసెంబర్ 2022, శుక్రవారం

శ్రద్ధయా పరయా తప్తం - ...17 - 17...//...సత్కారమానపూజార్థం - ...17 - 18,,,//.....సప్తదశోధ్యాయము - శ్రద్ధాత్రయవిభాగయోగము

 జైశ్రీరామ్

శ్లోశ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః|

అఫలాకాఙ్క్షిభిర్యుక్తైః సాత్త్వికం పరిచక్షతే. || 17-17 ||

తే.గీమూడు తపములున్ శ్రద్ధతో కూడి, లాభ

కాంక్షలేకుండి, నిగ్రహ గతిని చేయ

బడిన సాత్వికతపముగ వరలు పార్థ!

నీవు గ్రహియించు శ్రద్ధతో నేర్పు మీర.

భావము.

పై మూడు రకాల తపస్సు పూర్తి శ్రద్ధతో, లాభమూ కోరకుండా, నిగ్రహంచేత 

చేయబడినప్పుడు, సాత్వికమైన తపస్సుగా చెప్పబడుతుంది.

శ్లోసత్కారమానపూజార్థం తపో దమ్భేన చైవ యత్|

క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్. || 17-18 ||

తే.గీసత్కృతికొ, మానమర్యాద సంస్తుతులకొ,

దంబమున తాము చేసెడి తపములరయ

రాజసికతపములిల పార్థ! తెలియుమిది.

నీకు తెలియవలయునిది నిజము తెలియ.

భావము.

సత్కారంకోసమూ, మాన మర్యాద కోసమూ డంభంతోనూ తపస్సు చేయబడుతుందో 

దానిని స్తిరత్వము లేని రాజసిక తపస్సుఅంటారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.