గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, డిసెంబర్ 2022, మంగళవారం

అనుద్వేగకరం వాక్యం సత్యం - ...17 - 15...//...మనః ప్రసాదః సౌమ్యత్వం - ...17 - 16,,,//.....సప్తదశోధ్యాయము - శ్రద్ధాత్రయవిభాగయోగము

 జైశ్రీరామ్.

శ్లోఅనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం యత్|

స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే. || 17-15 ||

తే.గీవాక్కులుద్వేగరహితమై, వరలుచు, ప్రియ,

సత్య, హిత యుక్తమై, పరులకు చక్కనొప్పు

నట్లుపలుకుట, స్వాధ్యాయ మరసి నేర్వ,

వాచికంబగు తపమది, పార్థ! వినుమ.

భావము.

ఇతరులను బాధింపనిదీ, సత్యమూ, ప్రియమూ, హితమూ అయిన వాక్కుస్వాధ్యాయాన్ని అభ్యసించడమూ ఇది వాచికమైన తపస్సు.

శ్లోమనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః|

భావసంశుద్ధిరిత్యేతత్తపో మానసముచ్యతే.  || 17-16 ||

తే.గీసుప్రసన్నచిత్తము,మంచి సుగుణచయము,

మౌనమును, నిగ్రహంబును, మహితభావ

శుద్ధి, మానసికతపస్సు, చూడ ఘనము.

నీవు గ్రహియింపుమర్జునా! నేర్పు మీర.

భావము.

ప్రసన్నమైన మనస్సూ, మంచితనమూ, మౌనమూ, మనోనిగ్రహమూశుద్ధమైన భావాలూ-ఇవి మానసిక తపస్సు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.