గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, డిసెంబర్ 2021, మంగళవారం

గాణ్డీవం స్రంసతే హస్తాత్..//.. ||1-30||..//..నిమిత్తాని చ పశ్యామి..//.. ||1-31||..//.అర్జున విషాద యోగము.

 జైశ్రీరామ్.

శ్లో.  గాణ్డీవం స్రంసతే హస్తాత్త్వక్చైవ పరిదహ్యతే |

శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ మే మనః ||1-30||

తే.గీ.  చేతి గాండీవ మది జారు భీతి గొలుపు,

దేహమే మండుచుండెను దేవదేవ!

నిలుచుటకు శక్తి లేదిక, నిలకడ విడి

మతియు భ్రమియించుచుండెను మాధవుండ!

భావము. 

గాండీవం చేతిలోనుంచి జారిపోతుంది, వళ్ళు మండుతోంది, నిలబడటానికి 

ఓపికలేకుండా ఉన్నదిమనస్సుభ్రమిస్తోంది                                                                                                                                 .

శ్లో.  నిమిత్తాని పశ్యామి విపరీతాని కేశవ |

శ్రేయోऽనుపశ్యామి హత్వా స్వజనమాహవే ||1-31||

తే.గీ.  కేశవా! దుశ్శకునములు క్షితిని గనితి,

స్వజన హననంబుచేతను ఫలమదేమి

కలుగునో గాంచ లేకుంటి, కమల నయన!

ఇట్టిదుస్స్థితిన్ గట్టెక్కుటెట్టులొ కద.

భావము. 

కేశవా దుశ్శకునాలు కనిపిస్తున్నాయి, స్వజనాన్ని చంపడం వలన 

ఏమి మేలుకలుగుతుందో తెలుసుకో లేకుండా ఉన్నాను.

జైహింద్.                                                                                                                                 
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.