గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, డిసెంబర్ 2021, శుక్రవారం

యావదేతాన్నిరీక్షేऽహం ||1-22|| // యోత్స్యమానానవేక్షేऽ ||1-23||// అర్జున విషాద యోగము.

 జైశ్రీరామ్.

శ్లో.  యావదేతాన్నిరీక్షేऽహం యోద్ధుకామానవస్థితాన్ |

కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే ||1-22||

తే.గీ.  యుద్ధమును చేయఁ గోరుచు నున్నదెవరొ

యెవరితో యుద్ధమునుచేయ నెదురునిలువ

వలెనొ వారినే నే జూడ వలయునిపుడె

యనెను కృష్ణునిజూచుచు నర్జునుండు. 

భావము.  

యుద్ధంచేయగోరి ఎదురు చూస్తూ నిలబది ఉన్న వారిలో నేను ఎవరితో 

యుద్ధం చేయాలో వారిని చూడాలి                                                                                                                               

శ్లో.  యోత్స్యమానానవేక్షేऽహం య ఏతేऽత్ర సమాగతాః |

ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః ||1-23||

తే.గీ.  దుష్టుఁడగు ధార్తరాష్ట్రుని తోడనుండి

తృప్తి కలిగింప వానికి నాప్తులగుచు

నుండిరిచ్చట, యిచ్చటనున్న నేను

చూడగావలె వారిని చూపుమనెను.

భావము.    

దుర్బుద్ధి కలిగిన దుర్యోదనునికి ప్రియం చేయగోరి యుద్ధం చేయడానికి 

ఎవరెవరు ఇక్కడ  సమావేశమై ఉన్నారో వాళ్ళను నేను చూస్తాను.                              

జైహింద్.                                                                                                                             

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.