గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, డిసెంబర్ 2021, ఆదివారం

తత్రాపశ్యత్స్థితాన్పార్థః.. ||1-26||..//..శ్వశురాన్సుహృదశ్చైవ..//.. ||1-27||../..అర్జున విషాద యోగము.

 జైశ్రీరామ్

శ్లో.  తత్రాపశ్యత్స్థితాన్పార్థః పితౄనథ పితామహాన్

ఆచార్యాన్మాతులాన్భ్రాతౄన్పుత్రాన్పౌత్రాన్సఖీంస్తథా ||1-26||

తే.గీ.  అర్జునుం డటఁ గాంచె తా నపుడు తండ్రు

లను, గురువులను, తన తాతలను సుతులను

మనుమలను తన మేనమామల నెఱింగె,

వారలను మదిఁ గనె తనవారెయనుచు.

భావము. 

అప్పుడు అర్జునుడు తండ్రులను, తాతాతలను, గురువులను, 

మేనమామలను,  కుమారులను, మనుమలను చూచాడు.

శ్లో.  శ్వశురాన్సుహృదశ్చైవ సేనయోరుభయోరపి |

తాన్సమీక్ష్య స కౌన్తేయః సర్వాన్బన్ధూనవస్థితాన్ ||1-27||

తే.గీ.  అర్జునుం డింకయున్ గాంచె నచట నుండి

నట్టి యుభయపక్షంబుల నలరుచున్న

సైనికులనపుడా బంధుజనులనుమది,

యుద్ధసన్నద్ధులైయున్న యోద్ధుతతిని

భావము. ఇంకా అర్జునుడు, సజ్జనులను, రెండు సేనల మధ్య నిలబడి 

ఉన్న యావన్మంది  బంధువులను సమీక్షించి, 

జైహింద్.    

                                                                                                                                     

                                                                                                                           


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.