గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, డిసెంబర్ 2021, బుధవారం

|1-3|| పశ్యైతాం పాణ్డుపుత్రాణా // |1-4|| అత్ర శూరా మహేష్వాసా // శ్రీమద్భగవద్గీత అర్జున విషాద యోగములో..౩..౪ శ్లోకములు.

జై శ్రీరామ్.
ఓం నమో భగవతే వాసుదేవాయ.

శ్లో.  పశ్యైతాం పాణ్డుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ |

వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా||1-3||

మ.  సదయం గాంచుఁడు మీదు శిష్యుఁడగు దృష్టద్యుమ్నుఁడన్ ధీవరుం

డదిగో వ్యూహము తా రచించె మహిలో నాశ్చర్యముం గొల్పు నా

మదికింగంటకమైనదై, రిపులకున్ భాగ్యంబుగానిల్వగా,

నది మీ దృష్ఠికితెచ్చితిన్ గనఁగ మీ రాచార్యదేవా! సుధీ!

భావము.

ఓ గురువర్యా! బుద్ధిశాలియు, మీశిష్యుడునగు ధృష్టద్యుమ్నునిచేత వ్యూహాకారముగ 

రచింపబడియున్నట్టి పాండవుల ఈ గొప్ప సైన్యమును జూడుడు!

శ్లో.  అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి |

యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః.||1-4||

కం.  సాత్యకి, విరటుఁడు, ద్రుపదుఁడు                                                               

స్తుత్యులును, మహారథులును చూడగ నచ టౌ                                                        

న్నత్యము సూపగ నుండిరి                                                                                            

స్తుత్యుఁడ! భీమా ర్జనులకు తుల్యులు వారల్. 

భావము.   

ఆచార్యా!  పాండవ సేనలో భీమర్జునలకు సమానులుగా సాత్యకి విరటుడు 

ద్రుపదుడు అందరును గొప్ప పరాక్రమవంతులు మేటి వీలుకాండ్రు వారి 

పక్షముననుండిరి. 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.