గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, జూన్ 2019, ఆదివారం

మందారదామ. స్రగ్విణీ వృత్త గర్భ రాజహంస వృత్తము.,

జైశ్రీరామ్. 
మందారదామ.  స్రగ్విణీ వృత్త గర్భ రాజహంస వృత్తము., 
రాజహంస వృత్తము త త త త త త త త  గ - ౧౩
శ్రీనాథ! నిన్ గొల్వ చేకొమ్ము వీవే. హరీ చేయినందించుమా చిత్స్వరూపుండవై.
దీనావనా! జ్ఞాన తేజమ్ము నీవే సుధీ ప్రాయమున్ గాంచవా! భక్త మందారమా!
మౌనంబదేలయ్య మాదైవమీవే సుమా. శ్రేయమున్ గొల్ప నా చిత్తమందుండుమా.
మానిన్ను నిత్యంబు మన్నింతునేనేరమాధ్యేయమీవేనయా దీన సంరక్షకా.

మందారదామ. త త త గగ - ౧. స్రగ్విణీ వృత్త గర్భ ర ర ర ర - ౭.
రాజహంస వృత్త గర్భస్త మందారదామవృత్తము., త త త గ గ.  యతి - ౭
శ్రీనాథ! నిన్ గొల్వ చేకొమ్ము వీవే.
దీనావనా! జ్ఞాన తేజమ్ము నీవే
మౌనంబదేలయ్య మాదైవమీవే
మానిన్ను నిత్యంబు మన్నింతునేనే.

మందారదామ. త త త గగ - ౧. స్రగ్విణీ వృత్త గర్భ ర ర ర ర - ౭.
రాజహంస వృత్త గర్భస్థ స్రగ్విణీవృత్తము., ర ర ర ర   గయతి - ౭
చేయినందించుమా చిత్స్వరూపుండవై.
ప్రాయమున్ గాంచవా! భక్త మందారమా!
శ్రేయమున్ గొల్ప నా చిత్తమందుండుమా.
ధ్యేయమీవేనయా దీన సంరక్షకా.
జైహింద్.
Print this post

2 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

గురుదేవులకు శుభోదయ వందనములు జైశ్రీమన్నారాయణ 🙏🙏🙏
అమృత సమమైన పదములతో చాలా చాలా బాగున్నది అభినందన వందనములు 🙏🙏🙏

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మందార ధామ స్రగ్విణీ వృత్త గర్భ రాజహంస వృత్తము రాజహంసము వలె అందముగా నున్నది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.