గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, జూన్ 2019, సోమవారం

భ్రమదేలు,మాయజా"-గర్భ-తమతమి"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
భ్రమదేలు,మాయజా"-గర్భ-తమతమి"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
"తమతమి"-వృత్తము.
అభికృతిఛందము.స.భ.త.స.జ.ర.య.జ.గ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమముకలదు.వృ.సం.
సమ న్యాయం!సమధర్మం!సమ సమాజ స్థాపనమ్ము!సాగునే!భారతావనిన్?
తమ స్వార్ధం తమి నింపన్!తమ తమాది పెంపు నింప!తా గరీయంబు నౌనొకో?
కమనీయం బెడమోపన్!కమత స్వార్ధ మంద నెంచ!గాగ నింపే!ప్రమోదమా?
భ్రమలందేల!సబబౌనే!భములు కల్గు నిశ్చయంబు!బాగు నెంచన్వరంబు నౌ!
1.గర్భగత"-స్తుతి"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.భ.గగ.గణములు.వృ.సం.52.
ప్రాసనియమముకలదు.
సమ న్యాయం!సమధర్మం!
తమ స్వార్ధం!తమి నింపన్!
కమనీయం బెడమోపన్?
భ్రమ దేలం!సబ బౌనే?
2.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.
ప్రాసనియమముకలదు.
సమ సమాజ స్థాపనమ్ము!
తమ తమాది పెంపు నింప!
కమత స్వార్ధ మంద నెంచ?
భములు కల్గు నిశ్చయంబు!
3.గర్భగత"-ముకుంద"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.ర.లగ.గణములు.వృ.సం 83.
ప్రాసనియమముకలదు.
సాగునే!భారతావనిన్?
తా గరీయంబు నౌ నొకో?
గాగ నింపే!ప్ర మోదమా!
బాగు నెంచం వరంబు నౌ!
4.గర్భగత"-యెడము"-వృత్తము.
అత్యష్టీఛందము.స.భ.త.స.జ.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
సమ న్యాయం!సమ ధర్మం!సమ సమాజ స్థాపనమ్ము!
తమ స్వార్ధం!తమినింపం!తమ తమాది పెంపు నింప!
కమనీయం బెడమోపన్!కమత స్వార్ధ మంద నెంచ!
భ్రమలం దేల!సబబౌనే?భములు కల్గు నిశ్చయంబు!
5.గర్భగత"-భాముల"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.ర.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
సమ సమాజ స్థాపనమ్ము!సాగునే!భారతావనిన్?
తమ తమాది పెంపు నింప!తా గరీయంబు నౌనొకో?
కమత స్వార్ధ మంద నెంచ!గాగ నింపే!ప్రమోదమా?
భములు కల్గు నిశ్చయంబు!బాగు నెంచం వరంబునౌ!
6.గర్భగత"-కమనీయ"-వృత్తము.
అభికృతిఛందము.న.ర.జ.ర.ర.జ.య.స.గ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమముకలదు.వృ.సం.
సమ సమాజ స్థాపనమ్ము!సాగునే?భారతావనిన్!సమ న్యాయం!సమధర్మం!
తమ తమాదిపెంపు నింప!తా గరీయంబు నౌనొకో?తమస్వార్ధం!తమినింపన్
కమత స్వార్ధ మందనెంచ!గాగ నింపే!ప్రమోదమా?కమనీయంబెడ మోపన్?
భములు కల్గు నాశ్చయంబు!బాగునెంచన్వరంబునౌ!భ్రమలందేల సబబౌనే?
7.గర్భగత"-భ్రమిత"-వృత్తము.
అష్టీఛందము.ర.ర.జ.య.స.గ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
సాగునే!భారతావనిన్!సమ న్యాయం సమధర్మమ్?
తా గరీయంబు నౌనొకో?తమ స్వార్ధం తమినింపన్!
గాగ నింపే!ప్రమోదమా?కమనీయం బెడమోపన్?
బాగు నెంచన్వరంబునౌ!భ్రమలం దేల సబబౌనే?
8.గర్భగత"-కమతెంచు"-వృత్తము.
అభికృతిఛందము.ర.ర.జ.య.స.భ.జ.భ.గ.గణములు.యతులు.9,17.
ప్రాసనియమముకలదు.వృ.సం.
సాగునే!భారతావనిన్!సమ న్యాయం!సమధర్మం!సమ సమాజ స్థాపనమ్ము!
తా గరీయంబు నౌనొకో?తమ స్వార్ధం తమి నింపన్!తమ తమాది పెంపు నింప!
గాగ నింపే!ప్రమోదమా!కమనీయం బెడమోపన్!కమత స్వార్ధ మంద నెంచ!
బాగు నెంచంన్వరంబునౌ?భ్రమలందేల సబబౌనే?భములు కల్గు నిశ్చయంబు
9.గర్భగత"-భ్రమలదేలు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.స.భ.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
సమ సమాజ స్థాపనమ్ము!సమ న్యాయం!సమధర్మం!
తమ తమాది పెంపు నింప!తమ స్వార్ధం తమినింపన్!
కమత స్వార్ధ మంద నెంచ!కమనీయం బెడమోపన్?
భములుకల్గు నిశ్చయంబు!భ్రమలందేల సబబౌనే?
10,గర్భగత"-మాయజా"-వృత్తము.
అభికృతిఛందము.న.ర.జ.స.భ.మ.య.జ.గ.గణములు.యతులు10,18.
ప్రాసనియమముకలదు.వృ.సం.
సమ సమాజ స్థాపనమ్ము!సమ న్యాయం!సమధర్మం!సాగునే!భారతావనిన్?
తమ తమాది పెంపు నింప!తమస్వార్ధం తమినింపన్!తాగరీయంబు నౌనొకో!
కమత స్వార్ధ మంద నెంచ!కమనీయం బెడమోపన్?గాగశనింపే!ప్రమోదమా?
భములుకల్గు నిశ్చయంబు!భ్రమలందేల సబబౌనే?బాగు నెంచన్వరంబునౌ?

స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ వల్లభవఝుల వారికి అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.