గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, జూన్ 2019, సోమవారం

బాసట,జల్లుమాపు,భారణా,ఉత్సుక,మదపెంపు,ఖద్యోతినీ,నిరాధార,వరామన,నిజేచ్ఛ,రంబకా,అంగీకృత,గరగర్భకురువరద"-వృత్తము. రచన;-వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
బాసట,జల్లుమాపు,భారణా,ఉత్సుక,మదపెంపు,ఖద్యోతినీ,నిరాధార,వరామన,నిజేచ్ఛ,రంబకా,అంగీకృత,గరగర్భకురువరద"-వృత్తము.
రచన;-వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి.  జుత్తాడ.
                   

"-కురువరద"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.న.భ.భ.ర.జ.జ.గగ.గణములు.యతులు.
7,10,19,ప్రాసనియమముకలదు.వృ.సం.
వల్లని మాటలా!వలదు!వల్లభమౌ గతి!చూడుమా!వరామను కీర్తి మెచ్చన్?
చెల్లెడి చేతలం!చెలగి!చిల్లొనరించకు?ఛందమే!స్థిరంబమరించు ఖ్యాతిన్!
కొల్లల ఛందముల్కొలువు!గొళ్ళియ మేయకు?స్వేచ్ఛ చేకురున్!వరదంబు లెల్లన్?                                                                                    
చల్లటి! శ్రీలవే?ఛలము!జల్లుల మాపకుమా!నరా!చరాశ్రిత దేహ ధారీ!
అర్ధములు:-
వల్లని= సానుకూలము కాని,వల్లభమౌ గతి=శ్రీప్రదమగు మార్గము,
చిల్లొనరించకు=బెజ్జము కలిగించకు(అపకీర్తి పాలుజేయకు).
గొళ్ళియమేర్చకు=ఛందః స్వేచ్ఛకు ఆటంక పర్చకు,జల్లుల మాపకు=
పడే వర్షమును ఆటంకపర్చకు,ధారావాహికగానడచు ఛందముల
నాటంక పర్చకు!,చరాశ్రిత దేహ ధారీ=అస్థిరమైన శరీరమును ధరించిన
మానవా,శ్రీలవే ఛలము=సంపదే నెపకారణము,మిధ్య మాత్రమే?
భావము:-
సానుకూల్యముగాని మాటల నాడి!ఛందశ్శాస్రమనే శ్రేష్టతావాచిని,
పనికివచ్చిన చేతలతో,రంధ్రాన్వేషణము మాని,గొప్పగా చూడుమా!
ఛందోవరామ కీర్తిని మెప్పగునట్లు,పద్య కవితామ తల్లికి,విస్తృతిని
పెంచుటకు యత్నించుమ!పద్యమునకు స్వేచ్ఛను కల్పించుమ!
కో కొల్లల ఛందములుగల మన తెలుగు పద్యములను ఆదరించుమ!
ఛందోఝరులు జాలువారు తెరంగునకు సంతసించ వలెను గాని,
ఆటంక పరచుట చరాశ్రిత దేహులైన మన బోంట్లకు తగదు.
***ఉదాహరణకు ఉత్పలమాల పద్యమునకు,ప్రతి పాదమున 20,అక్షరములుండునని,10,యవ.అక్షరము యతిచెల్లునని,
ప్రాసనియమముకలదని,ఛందోకారులు వివరించియున్నారు.
అది శిరోధార్యమే!కాదన దగదు.
యతి,వళి,విశ్రామము'అనే నామాంతరములతో వ్యవహరింపబడు
యతి స్థానము. పద్య నడకనుబట్టి,విరుపుట వలన దోషము,ద్రోహము
కాదు.ఇందలి ఉత్పల మాల పద్యమునకు,7,10,అక్షరములు
యతులుగా!వాడితిని.దీని వలన మరికొన్ని క్రొత్త పద్యము లుధ్బవించును.
పూర్వీకులు నిర్దేశించిన,13,42,17,726.
వృత్తములకు లోబడి మాత్రమే యని విజ్ఞులు.మన్నించ ప్రార్ధన,

1.గర్భగత"-బాసట"-వృత్తము.
కృతిఛందము.న.భ.భ.ర.జ.స.గగ.యతి.13.వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
వలదు!వల్లభమౌ!గతి చూడుమా!వరామను కీర్తి మెచ్చన్?
చెలగి!చిల్లొనరించకు?ఛందమే!స్థిరంబమరించు ఖ్యాతిన్!
కొలువు!గొళ్ళియ మేయకు!స్వేచ్ఛ చేకురున్వరదంబు లెల్లన్!
ఛలము!జల్లుల!మాపకుమా! నరా! చరా శ్రిత దేహ ధారీ!
2.గర్భగత"-జల్లు మాపు"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.ర.జ.ర.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
వల్లభమౌ!గతి చూడుమా!వరామను కీర్తి మెచ్చగన్?
చిల్లొనరించకు!ఛందమే!స్థిరం బమరించు ఖ్యాతిన్!
గొళ్ళియ మేయకు!స్వేచ్ఛ చేకున్వరదంబు లెల్లన్?
జల్లుల మాపకుమా!నరా!చరాశ్రిత!దేహ ధారీ!
3.గర్భగత"-భారణా"-వృత్తము.
బృహతీఛందము.భ.ర.న.గణములు.వృ.సం.471.
ప్రాసనియమముకలదు.
వల్లని మాటలే!వలదు!
చెల్లెడి చేతలం!చెలగి!
కొల్లల ఛందము ల్కొలువు?
చల్లటి శ్రీలవే?ఛలము!
4.గర్భగత"-ఉత్సుక"-వృత్తము.
బృహతీఛందము.భ.భ.ర.గణములు.వృ.సం.183.
ప్రాసనియమముకలదు.
వల్లభమౌ!గతి చూడుమా!
చిల్లొనరించకు!ఛందమే!
గొళ్ళియ మేయకు!స్వేచ్ఛ చే!
జల్లుల మాపకుమా!నరా!
5.గర్భగత"-మదపెంపు"-వృత్తము.వృ.సం.46.
ప్రాసనియమముకలదు.
వరామను కీర్తి మెచ్చగన్?
స్థిరం బమరించు ఖ్యాతిన్!
కురుం వరదంబు లెల్లన్?
చరా శ్రిత దేహ ధారీ!
6.గర్భగత"-ఖద్యోతినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.భ.భ.ర.జ.జ.మ.స.లగ.గణములు.యతులు.
13,21.ప్రాసనియమముకలదు.వృ.సం.
వలదు!వల్లభమౌ!గతి చూడుమా!వరామను కీర్తి మెచ్చగన్?వల్లని మాటలా!
చెలగి!చిల్లొనరించకు!ఛందమే!స్థిరం బమరించు ఖ్యాతిన్?చెల్లెడి చేతలన్!
కొలువు!గొళ్ళియ మేయకు!స్వేచ్ఛచే!కురున్!వరదంబు లెల్లన్! కొల్లలఛందముల్!                                               ఛలము జల్లుల మాపకుమా!నరా!చరా శ్రిత! దేహధారీ! చల్లటి శ్రీలవే?
7.గర్భగత"-నిరాధార"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.జ.జ.మ.స.జభలల.గణములు.యతులు.10,18.
ప్రాసనియమముకలదు.వృ.సం.
వల్లభమౌ!గతి చూడుమా!వరామను కీర్తి మెచ్చగన్?వల్లని మాటలా!వలదు!
చిల్లొనరించకు!ఛందమే!స్థిరంబమరించు ఖ్యాతిన్!చెల్లెడి చేతలన్జెలగి?
గొళ్ళియ మేయకు!స్వేచ్ఛచే కురున్ వరదంబులెల్లన్!కొల్లల ఛందముల్కొలువు!                                                 జల్లుల మాపకుమా!నరా!చరాశ్రిత దేహధారీ!చల్లటి శ్రీలవే?ఛలము!
8.గర్భగత"-వరామన"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.జ.మ.స.జ.లల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
వరామను కీర్తి మెచ్చగన్?వల్లని మాటలా!వలదు?
స్థిరంబమరించు ఖ్యాతిన్!చెల్లెడి చేతలంజెలగి!
కురుం వరదంబు లెల్లన్?కొల్లలు ఛందముల్గలవు!
చరాశ్రిత దేహ ధారీ!చల్లటి శ్రీ లవే?ఛలము!
9.గర్భగత"-నిజేచ్ఛ"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.జ.మ.స.జ.స.స.స.లగ.గణములు.యతులు9,18.
ప్రాసనియమముకలదు.వృ.సం.
వరామను కీర్తి మెచ్చగన్?వల్లని మాటలా!వలదు?వల్లభమౌ గతిచూడుమా!
స్థిరంబమరించు ఖ్యాతిన్?చెల్లెడి చేతలం జెలగి!చిల్లొనరించకు ఛందమున్!
కురు న్వరదంబు లెల్లన్?కొల్లలు ఛందము ల్గలవు! గొళ్ళియ మేయకు! స్వేచ్ఛకున్?                                                                            
చరాశ్రిత దేహ ధారీ! చల్లటి శ్రీలవే?ఛలము! జల్లుల మాపకుమా!నరా
10,గర్భగత"-రంబకా"-వృత్తము.
ధృతిఛందము.భ.భ.భ.ర.భ.ర.న.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
వల్లభమౌ!గతి చూడుమా!వల్లని మాటలం వలదు!
చిల్లొనరించకు ఛందమున్?చెల్లెడి చేతలం జెలగి!
గొళ్ళియ మేయకు?స్వేచ్ఛ కున్?కొల్లలు ఛందముల్గలవు!
జల్లుల మాపకుమా!నరా!చల్లటి శ్రీ లవే?ఛలము!
11.గర్భగత"-అంగీకృత"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.భ.ర.న.జ.జ.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమముకలదు.వృ.సం.
వల్లభమౌ!గతి చూడుమా!వల్లని మాటలం వలదు?వరామను కీర్తి మెచ్చగన్?                                                       చిల్లొనరించకు ఛందమున్?చెల్లెడి చేతలం జెలగి!స్థిరంబమరించు ఖ్యాతిన్!                                                           గొళ్ళియ మేయకు!స్వేచ్ఛకున్?కొల్లలు ఛందముల్గలవు!కురున్వరదంబు లెల్లన్!                                                 జల్లుల మాపకుమా!నరా!చల్లటి శ్రీలవే?ఛలము!చరాశ్రిత దేహధారీ!
                                                                           
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.