గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, జూన్ 2015, బుధవారం

శ్రీ(శ్రీరంగం) శ్రీ(శ్రీనివాసరావు) రచించిన ఒక శార్దూలవృత్తము.

జైశ్రీరామ్.
ఆర్యులారా!మాయామేయ జగద్వినాశాన మతిని నర్తింపుమని శివుని అడుగుతూ
శ్రీశ్రీ రచించిన  శార్దూలవృత్తము ఎంత అద్భుతంగా ఉందో తిలకించండి..  
సాయం ప్రస్ఫుట రాగరంజిత లసత్సంపూర్ణ సౌందర్య రా
శీయుక్తామల దివ్యమూర్తివయి సాక్షీభూత నానామరు
త్తోయస్తోత్ర గభీర గానరవ సంతుష్టాంతరంగంబునన్
మాయామేయ జగద్వినాశాన మతిన్ నర్తింపుమా శంకరా!  
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ శ్రీ రచనలు శ్లాఘనీయము
శ్రీ చింతా వారికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.