గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, జూన్ 2015, సోమవారం

పరమపదించిన శ్రీమాన్ దాశరధి రంగాచార్యులవారు.

జైశ్రీమన్నారాయణా! నారాయణా! నారాయణా!
ఓంకారాశ్రిత పూర్ణ తత్వమిక నీ యుచ్ఛ్వాస నిశ్వాసలన్
జంకున్ వీడి త్యజించి ముక్తి పథమున్ సద్గామియై చేరె నా
పంకేజక్షుని పాద పద్మయుగళిన్. వాఙ్మూర్తి లేరింక మా
కింకెవ్వారలు కల్గు వేద హిత సాహిత్యంబు బోధింపగన్.
స్వర్గ పథమందిన మహనీయులు, వేద స్వరూపులు శ్రీమాన్ దాశరధి రంగాచార్యుల వారి అకాల మరణమునకు ఈ సాహితీ లోకము ఎంతగానో చింతిస్తున్నది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ  ఘన నివాళి అర్పిస్తున్నాను.
వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేయుచున్నాను.
జైశ్రీమన్నారాయణా.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

భగవత్స్వరూపులు శ్రీ దాశరధి రంగాచారి గారి ఆత్మకు శాంతి లభించు గాక

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.