గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, జులై 2014, ఆదివారం

ఖలః సర్షపమాత్రాణి ...మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. ఖలః సర్షపమాత్రాణి పరచ్ఛిద్రాణి పశ్యతి 
ఆత్మనో బిల్వమాత్రాణి పశ్యన్నపి న పశ్యతి.
ఆ. పరుల దోషములను దురితుండు చూపించు  
ల్పమైన యది యనల్పముగను. 
తన యనల్ప దోష మరయంగ నేరడే! 
దుష్ట చిత్ప్రవృత్తి శ్రేష్టమగునె? 
భావము. దుర్జనుడు పరదోషం ఆవగింజంత మాత్రమే ఉన్నా, దానినే ప్రత్యేకించి చూస్తాడు. తనదోషం మారేడు కాయంతగా ఉన్నా,తెలిసి కూడా చూడడు. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఎదుటి వ్యక్తి ఉన్నతిని భరించ లేక గోరంతలు కొండంతలు చేసి ప్రచారము చేయడం . అందుకే అంటారు ఒకవేలు ఎదుటివారిని చూపిస్తే నాలుగు వేళ్ళు మనవైపు ఉంటాయని . బాగుంది అందరు గ్రహించ వలసిన సూక్తి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.