గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, జులై 2014, శుక్రవారం

పరద్రవ్యేష్వభిధ్యానం...మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. పరద్రవ్యేష్వభిధ్యానం, మనసానిష్ట చింతనం
వితతాభినివేశశ్చ త్రివిధం కర్మ మానసమ్. 
గీ. పరుల సంపదపై ధ్యాస ప్రబలుటయును, 
పరులకహితము కోరుట, దరియ రాని 
దగు యసత్యదుర్మార్గాన నడరుటయును 
మానసికపాప కర్మలు. మహితులార!
భావము. పరుల సంపదయందు తదేకధ్యాస,మనస్సులో ఇతరులకు అహితం కోరుకోవటం, అసత్యమునందు ఆసక్తి అనే మూడూ మానసిక పాపాలు. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అంతే కాదు ఇటువంటి మానసిక పాపాలు ఇంకా చాలా ఉంటాయి
అందుకే మానసికంగా కూడామంచి భావాలను అలవాటు చేసుకుంటే అందరికీ శ్రేయస్కరం .మంచి సూక్తి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.