గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జులై 2014, సోమవారం

రథస్యైకం చక్రం భుజగయమితాః ...మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. రథస్యైకం చక్రం భుజగయమితాః సప్తతురగాః
నిరాలంబో మార్గశ్చరణవికలో సారథిరపి 
రవిర్యాత్యంతం ప్రతిదినమపారస్య నభసః
క్రియాసిద్ధిః సత్త్వే భవతి మహతాం నోపకరణే. 
గీ. చక్ర మొక్కటే. పూన్చును సర్పమునను.
తురగసప్తకంబాధారమరయ లేదు. 
సారధియనూరుఁ డా కర్మసాక్షికైన 
లోకహితుడయ్యె. పనిముట్లు లేకయ్తున్న.
భావము. రథానికి ఉన్నది ఒకే చక్రం, పాములతో పూన్చబడిన ఏడు గుఱ్ఱాలు, మార్గమా – ఆధారం లేనిది, సారథియా – పాదములు లేనివాడు ,అయినప్పటికీ సూర్యుడు ప్రతిదినమూ అనంతమైన ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాడు. మహాత్ములకు కార్యసిద్ధి వారి బలము వల్లనే చేకూరుతుందిగానీ ఉపకరణముల (పనిముట్ల) వల్ల కాదు. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అసలు కార్య దీక్ష తపోనిష్ట కలిగి ఉంటారుగనుకనే వారు మహాత్ములు .వారిదివ్య శక్తులే వారికి ఉన్నతి ఇకవేరే ఉపకరణా లెందుకు ? చాలా బాగుంది ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.