జైశ్రీరామ్.
శ్లో. అంజలిస్థాని పుష్పాణి వాస్యంతి హి కరద్వయంఅహో సుమనసాం ప్రీతిర్వామదక్షిణయోః సమా.
ఆ. దోసిటగల పూలు వాసన కలిగించు
రెండు చేతులకును నిండుగాను.
సుజనులట్టులుండు, చూపరు భేదంబు.
కుడిని యెడమ నొకటె కూర్మి చూపు.
భావము. దోసిలిలో ఉన్న పువ్వులు , రెండు చేతులను సుగంధంతో వాసింపజేస్తాయి. ఆహా! సజ్జనులు కుడి ఎడమల యందు సమమైన ప్రీతిని కలిగి ఉంటారుకదా!
జైహింద్.
2 comments:
నమస్కారములు
సజ్జనులు దైవాంస సంభూతులు అంతటా దైవాన్ని చూడ గలరు అందుకే వారికి తేడాలు తెలియవు బాగుంది , బంగారు పలుకులు అభి నందనలు
మంచి మాటలను తెలియజేసారు. ఇలాంటి మరిన్ని సంస్కృత సుగంధాలను పరిమళింప చేయ కోరుతున్నాను.ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.