గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, జులై 2014, శుక్రవారం

పాత్రాపాత్ర వివేకోస్తి...మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. పాత్రాపాత్ర వివేకోస్తి ధేను పన్నగయోరివ
తృణాత్సంజాయతే క్షీరం క్షీరాత్సంజాయతే విషమ్.

గీ. గడ్డిని తిని పాలిచ్చును గంగి గోవు.
పాలు త్రావి విషము చిందు పన్నగమ్ము. 
పాత్రతాపాత్రములఁబట్టి వర్థిలునిల 
మంచి చెడ్డలు మనలోన మహితులార!
భావము. వివేకం పాత్రాపాత్రతలను బట్టి ఉత్పన్నమౌతుంది. గడ్డి వల్ల గోవులో పాలు ఏర్పడితే, పాలవల్ల పాములో విషం ఉద్భవిస్తుంది.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మనం పెట్టిన పిడికెడు గడ్డితిని మనమీద క్రోధం లేకుండా కడివెడు పాలిస్తాయి కానీ ఆ పాలను త్రాగిన పాము కంటే మనుష్యులే ఎక్కువ విషం కక్కు తారు baagumdi

చిరంజీవి శ్రీ పండితుల వారికి గురుపూర్ణిమ శుభా కాంక్షలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.