జైశ్రీరామ్.
శ్లో. మృషావాదం పరిహరేత్ కుర్యాత్ ప్రియమయాచితః
న చ కామాన్న సంరంభాన్న ద్వేషాద్ధర్మముత్సృజేత్.
న చ కామాన్న సంరంభాన్న ద్వేషాద్ధర్మముత్సృజేత్.
క. చేయకుమసత్యవాదము.
చేయుము హితమాశవీడి, చేయకహితముల్.
చేయుము ధర్మము వీడకు
మాయవలన, ద్వేషమునను, మతి త్వరపడుటన్,
భావము. అసత్యవాదాలు మానుకోవాలి. దేనినీ ఆశించక ఇతరులకు హితం చేయాలి. కావాలనిగానీ, వేగిరపాటుతో గానీ, ద్వేషంతోగానీ ధర్మాన్ని వదలకూడదు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
స్వచ్చమైన మనస్సుతో ధర్మాచరణ చేయగలిగిన వారు ధన్యులు అదే ఎప్పడికీ శ్రేయస్కరం మంచి మాట
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.