జైశ్రీరామ్.
శ్లో. అల్పాక్షర రమణీయం యః కథయతి నిశ్చితం స ఖలు వాగ్మీబహువచన మల్పసారం యః కథయతి విప్రలాపీ సః.
క. తేలిక పదముల తోడనె
మేలుగ భావంబు తెలుపు మేధావి కనన్.
చాలగ పలుకును, భావము
తేలదు కన వదరుబోతు. తెలియఁ బలుకుడీ!
భావము. కొద్దిపాటి తేలికమాటలతో ఎవడు అందంగా మాట్లాడుతాడో వాడే నిశ్చయంగా మాట్లాడటం తెలిసినవాడు. ఎవడు సారహీన విషయాలను అతిగా మాట్లాడుతూ చెప్తాడో వాడు వదరుబోతు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అందుకేగా అన్నీఉన్న విస్తరి అణిగే ఉంటుందని అన్నారు అది ఖచ్చిత మైన నిజం .తమ తక్కువ తనాని , అసమర్ద్ధతనీ దాచి పెట్టుకోడానికి కొందరు ఎక్కువగా మాట్లాడతారు వారిని చూసి మనం జాలి పడాలి బాగుంది ఈ అమృతాన్ని ఎంత ఆస్వాదించినా ఇంకా ఇంకా మిగులు తూనే ఉంటుంది
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.