జైశ్రీరామ్.
శ్లో. యచ్ఛ్రుతం న విరాగాయ, న ధర్మాయ, న శాంతయేసుశబ్దమపి శబ్దేన కాకవాశితమేవ తత్.
గీ. విన్న శబ్దాన జ్ఞానంబు పెరుగ వలయు.
విన్న శబ్దాన ధర్మంబు పెరుగ వలయు.
విన్న శబ్దాన శాంతియు పెరుగ వలయు.
అట్టి శబ్దంబు కానిది వట్టి గోల.
భావము. విన్నదేదో వైరాగ్యాన్ని కలిగించకపోతే, ధర్మాచరణకు ప్రోత్సహించకపోతే, శాంతిదాయిని కాకుంటే – అది ఎంత గొప్ప సుశబ్ద మైనా , కేవలం కాకి అరుపుగానే భావించాలి.
జైహింద్.
2 comments:
శ్రీ చింతా రామ కృష్ణారావు గురుదేవులకు పాదాభివందనములతో...
నేడు కాకి గోల తప్ప , ఇటు వంటి కోయిల బలుకులు విన బడుట లేదండి. చాలా మంచి మాటను జెప్పిన మీకు ధన్యవాదములు.
మీ శిష్యుడు
వరప్రసాదు
నమస్కారములు
అసలీ రోజుల్లో ధర్మా ధర్మములను గురించి ఆలోచించి ఆచరించే వారెందరు ? ఐనా ఒక్కరైనా ఆచరించ గలిగితే మనకృషి ఫలించి నట్టే అందుకే ఈ అమృత గుళికల్ని కొందరైనా ఏరుకోవాలని ఆశిద్దాం ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.